రోబో చిత్రం లో నాకు నచ్చనివి

Nov 15, 2010

రోబోని సైన్టిష్టు చెడగొట్టి చెత్తకుప్పలో పడవేసినా ఏదో సినిమాలో చూపినట్లుగా వేష్టు వేసే ప్రాంతానికి వెళ్ళి విలన్ వెదకి , దొరకలేదని వెళ్తూండగా తనంతట తానే విడిభాగాలన్నీ కలుపుకొని , విలన్ కార్లో పడి , తనని బ్రతికించమని బ్రతిమాలడం వింతగా ఉంది. దానికి ప్రాణంలేదుకదా...
వేగంగా వెళ్ళే రైలును పరుగెత్తుకుని ఎక్కగలిగిన రోబో , క్లైమాక్సులో బస్సును కూడా అందుకోలేడు...విడ్డూరం కదూ...
ఏది ఏమైనా సినిమా బాగుంది. సినిమా హాలులో సీట్లు నిండిపోయినందున సీట్ల మధ్య గల నడిచే దారిలో చిన్న బల్లలు వేసారు. నేను మా మేనల్లుడూ ఆ బల్లపై కూర్చోవలసి వచ్చింది. సినిమా ఐపోయేదాకా ఈ బల్లపై కూర్చోలేనేమోననుకున్నాను. కానీ సినిమా పూర్తయే దాకా నాకు స్పృహేలేదు. అంతగా సినిమాలో మమేకమైపోయాము. గ్రేట్ వర్క.

ROBO Film

Nov 5, 2010



రోబో చిత్రంలో అంతా అనుకున్నదానికన్నా బాగానే ఉన్నదని మంచి పేరు తెచ్చుకున్నది. సంతోషం. కానీ ఒకటి రెండు విమర్శలుకూడా చేయాలనిపిస్తుంది. అందులో మొదటిది ఏమిటంటే చిట్టి ఫీలవడం నేర్చుకున్నతర్వాత ఐసూను ప్రేమిస్తాడు. అది సహించలేక తన చేతులతో తయారుచేసిన చిట్టిని తానే విరుగగొట్టి చెత్త కుప్పలో పారేస్తాడా సైంటిస్టు. ఎందుకంటే దానిలోనుండి అలా ఫీలయ్యే లక్షణాలను తొలగించడం సాధ్యంకాదు గనుక. కానీ చివర్లో విలన్ పెట్టిన చిప్పు తొలగించిన తర్వాత ఆ విషయమే మరచినట్లుగా ప్రవర్తించడం ఎలా సాధ్యమైంది? కదా..
.

ఇక రెండవ విషయం. అనేక విషయాలు తెలిసిన రోబోకి సంసారమ్ముక్కు తగిలించుకోలేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ యంత్రునికి మనిషికి బేధం చూపడానికి, శాస్త్రమును అశాస్త్రీయము ఓడించినట్లు చూపడం జరిగిం దనుకో వచ్చునేమో...మరి మీరేమంటారు?
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||