పనిచెయ్యడంలేదు

Oct 28, 2008



షాపుకీపర్ :లేదండీ! మీరు చెప్పినట్లుగా కదిలే ఆలౌట్లుండవ్.
సుబ్బారావు : ఎందుకుండవండీ టీవీలో చూపిస్తున్నారుగా అదుంటే ఇవ్వండి.
అంతలో మాస్టారు షాపుకు వచ్చారు .
మాస్టారు : ఏమిటి సుబ్బారావ్ ? ఏమిటి గొడవ?
షాపు కీపర్ :చూడండిసార్! నిన్న ఇతను మాషాపులో ఆలౌట్ దోమలమందు కొన్నాడండీ. టీవీలో చూపించినట్టు నాలుక బయటకు పెట్టి దోమల్ని తినడంలేదట. అలా తినేదాన్ని ఇమ్మంటున్నాడుసార్!
మాస్టారు: ఆ!!!...

కీ.శే. జాన్ డేవిడ్ అయ్యవారు

Oct 19, 2008



దేవుని దూత వలే పేదలకు, వికలాంగులకు, వ్యాధిగ్రస్తులకు, అనాధలకు కొండంత అండగా నిలిచిన డాక్టర్. జాన్ డేవిడ్ అయ్యవారు ప్రభుసన్నిధికి చేరి మూడేళ్ళయింది. చిలకలూరిపేటకు త్రాగునీటి కొరత లేకుండా చేసిన ఈ దయార్ధ హృదయుడు జనవరి తొమ్మిదవతేదీ 2005 న ప్రభువునందు నిద్రించినారు. 1950 – 60 మధ్య కాలంలో చిలకలూరిపేట చుట్టుప్రక్కల గ్రామాలలో తరచుగా తిరుగుతూ దేవుని సువార్తను బోధిస్తుండేవారు. వేకువ ఝామునే ఆయా గ్రామాలలో తిరుగుతూ బూరలో అరుస్తూ దేవుని ప్రవచనాలు చెబుతూండేవారు. “ దేవుని రాకడ సమీపించింది , ప్రియులారా! మారుమనస్సు పొందండి. “ అంటూ ప్రచారంచేసేవారు. మా పల్లె లోని పెద్దలు మమ్మల్ని ఆయన వద్దకు వెళ్ళనిచ్చేవారుకాదు. ‘ వాళ్ళది మన లాగానే క్రీస్తు మతమే గానీ , అది వేరే గ్రూపు. కాబట్టి మనం వారి దగ్గరకు పోకూడదు ‘ అని చెప్పేవాళ్ళు. కానీ మా పల్లె నుండి డాక్టర్. వంజా. జ్ఞానానందం గారి కుటుంబం, దైవసేవకులు గట్టుపల్లి. ఆర్యారావు గారి కుటుంబం, ఇలా నాలుగైదు కుటుంబాలవారు జాన్ డేవిడ్ అయ్యవారి సమాజంలో చేరారు.
జాన్ డేవిడ్ అయ్యవారు 17 అక్టోబర్ 1926 న విశాఖపట్టణం జిల్లా, నర్సిపట్టణం తాలూకా, బల్లిఘట్టం గ్రామంలో గాబ్రియేల్ , కృపమ్మ దంపతులకు జన్మించారు.చిన్న తనంలోనే తండ్రి మరణించినందున తల్లి సంరక్షణలో పెరిగి, మిలిటరీలో పనిచేశారు. తరువాత దైవసేవ చేస్తూండగా దేవుడు తనకు జీవితసహచరిగా ఆణిముత్యము వంటి డాక్టర్. సత్యవేదమ్మ గార్ని బహుమతిగా ఇచ్చాడు. వీరికి ఒక కుమారుడు , నలుగురు కుమార్తెలు కలిగారు. వారిలో ఒక కుమార్తె చనిపోయారు, మరొకరు విదేశాలలో ఉంటున్నారు, మిగిలిన ఇద్దరు కుమార్తెలూ, కుమారుడూ సేవ చేస్తున్నారు.
జాన్ డేవిడ్ అయ్యవారు ఆంగ్లభాష నుండి తెలుగులోకి విదేశీ సువార్తీకుల ప్రసంగాల్ని తర్జుమా చేసి చెబుతుండేవారు. జాన్ డేవిడ్ అయ్యవారు మరియు సత్యవేదమ్మ డాక్టర్ దంపతులను దేవుడు బహుగా దీవించినందున విదేశముల నుండి విరాళములు తెచ్చిమన రాష్ట్రములో అనేక ప్రాంతములందు సేవాకార్యక్రమములు నిర్వహించారు. 1952లో A.M.G. అనే సంస్థను స్థాపించారు. కంటి వైద్యశాలలు, క్షయ వ్యాధి నివారణ కేంద్రాలు , కుష్ఠు వ్యాధి నివారణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, అనేక విద్యాసంస్థలు స్థాపించి అందులో అనాధలకు ప్రాధాన్యత నిచ్చారు. వేసవిలో పాఠశాలలకు సెలవులు ఇవ్వగానే పిల్లలందరూ వారివారి ఊళ్ళకు వెళతారు. కానీ తల్లీతండ్రీ బంధువులూ ఎవ్వరూ లేని అనాధ పిల్లలు మాత్త్రం హాస్టల్ లోనే ఉంటారు. ఆసమయంలో జాన్ డేవిడ్ అయ్యవారు ఏదేశంలో ఉన్నప్పటికీ , ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కనబెట్టి ఇండియా వచ్చి ఆపిల్లలకు మంచి పిండివంటలు వండించి పెట్టి వారితో ఆడుతూపాడుతూ గడుపుతారు. అనాధల యడల వారి ప్రేమకు ఇది నిదర్శనం.
వీరు అనేక అవార్డులు ,ప్రశంసాపత్రాలు పొందారు. 1979,1982,1986,1994,1998లలో అప్పటి రాష్ట్ర గవర్నర్లచే ఉత్తమ సేవాఅవార్డులు అందుకున్నారు. 1995లో రాష్ట్రపతిచే జాతీయ బాల సంక్షమ అవార్డును అందుకున్నారు. అమెరికా తానా మహాసభలోకూడా ఉత్తమ సంఘసేవా అవార్డును అందుకున్నారు. పలు పట్టణాలు , గ్రామాలలో త్రాగునీరు, మురుగు కాల్వల అభివృద్ధి, పేదల గృహనిర్మాణము వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. జర్మనీ దేశస్తుడైన డాక్టర్. డైక్ మెన్ గారి ద్వారా కోట్లాదిరూపాయల వితరణనందించారు. యానాదులకు, పారిశుధ్య పనివారలకు, బాలకార్మికులకు, వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలకు , గిరిజనులకు అనేక పధకాల ద్వారా సహాయాన్ని అందించారు. ప్రతి సంవత్సరము దాదాపు 75 వేలమందికి సహాయము అందిస్తున్నారు. ఇందిర ఆవాస యోజన కార్యక్రమము ద్వారా నిర్మిస్తున్న గృహములకు 8వేల రూపాయల వంతున సహాయం అందించారు. ఆత్మహత్యలు చేసుకున్న వ్యవసాయదారుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించి , వారి పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాటు చేసారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు నిరాశయులైన కుటుంబాలను ఆదుకున్నారు. రైతులకు ఉచిత పశుగ్రాసాన్ని అందించారు. త్సునామీ బాధితులకు లక్షలాదిరూపాయలు సహాయం అందించుచూ హఠాత్తుగా ప్రభువునందు నిద్రించారు. చిరస్మరణీయులైన వారి జ్ఞాపకార్ధం ఒక శిలావిగ్రహం నిర్మించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
www.amg-india.org/community.html

కనెక్షన్

Oct 4, 2008

మాస్టారు : “ ఏమిటి సుబ్బారావు కాలికి కట్టు కట్టుకొని , కుంటుకుంటూ వస్తున్నావ్ ? “
సుబ్బారావు : “ ఏంచెప్పమంటారు... ఇటీవల హచ్ కనెక్షన్ తీసుకున్నాను సార్ ! కుక్క కరిచింది. “
మాస్టారు : “ దానికీ దీనికీ ఏమిటి సంబంధం ? “
సుబ్బారావు : “ మీకు తెలియదులే సార్! . నేను ఇంట్లో సెల్లు మరచిపోయి వస్తుంటే గుర్తుచేయడానికి కరిచుంటది. యాడ్లోకూడా ఇటువంటిదే వుంది. “
మాస్టారు : “ ఆ .............. “ .

అగ్యానం

Oct 3, 2008






సుబ్బారావు : “మాస్టారూ ! బాసుమతి రైస్ కూ, కండోలినా రైస్ కూ తేడా ఏమిటంటారూ?”
మాస్టారు : “ బాసుమతి రైస్ ను ఇండియన్స్ మక్కువతో తింటారు. కండోలినా రైస్ ఇండియాను మక్కువతో తింటుంది. అంతే.”

పొగడ్తలు

Oct 2, 2008

“ఒక పెన్సిల్ మరొక పెన్సిల్ తో ఏమంటుంది ?”
“ మీరు చాలా షార్పుగా ఉన్నారండీ “ అని.
.................... ............ ..................

ఒక స్కూలుకు క్లాప్స టీం వచ్చింది పిల్లల లెర్నిగ్ టెస్టు చెయ్యడానికి. “టీచర్ గారూ! మీ కాస్ లో ‘ A’ గ్రేడు ఎవరెవరికిస్తారు? “ అడిగాడు టీంమెంబర్ అనుమానంగా.
టీచర్ : “ ఎవరికైనా లవ్ లెటర్ రాసినా, అలాంటి అల్లరి పనులేమైనా చేసినట్లు తెలిసినా వాళ్ళకు వార్నింగ్ యిచ్చిమరీ ‘A‘ గ్రేడు ఇస్తున్నామండీ ” చెప్పింది ఆ టీచర్ సినిమా పత్రిక దాచేస్తూ.
............ ........... .............


కమల : “ ఈమధ్య ఆ మాస్టారు నల్లకళ్ళద్దాలు పెట్టుకుంటున్నారేమిటే స్వప్నా? శుక్లాలుగానీ తీయించుకున్నారా? “
స్వప్న : “ అబ్బే అదేంలేదే. వాళ్ళ క్లాసులో చాలా మంది బ్రైట్ స్టూడెంట్స ఉన్నారంట. అందుకనీ...
........ ........ ..........
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||