అందం చూడవయా

Apr 1, 2007

ఆ రోజు మాఆవిడ ఎంతో హుషారుగా ఉంది.తల స్నానం చేసి,క్రీములు రాసి,పౌడరు అద్ది,సెంట్లు పూసి,క్రొత్త చీరెకట్టి,బుట్టెడుపూలు పెట్టుకొని కాసేపు అటూఇటూ నాముందే తిరిగి ఇక లాభంలేదని ఓకుర్చీ లాక్కొని కూర్చుంది.నేనేదో పుస్తకం చదువుతూ పంచలో కూర్చొని ఉన్నాను .చివరకు "ఏమండీ ఈ లోలాకులు చూసారూ? ఇవిచేయించి ఇప్పటికి ఖచ్చితంగా ఓ సంవత్సరం అయింది" అంది; అప్పుడైనా అమెనిచూస్తానని. నేను "ఓహో అలాగా " అన్నాను పుస్తకంలోచి తలత్రిప్పకుండా. "ఈ చీర ఎలావుంది?" అంది. "చీరె బాగానేవుంది."అన్నాను."మరి నేనెలావున్నాను?"అంది కొంచం కోపంగా.పుస్తకం ప్రక్కకు పెట్టి దీక్షగా చూసి " ఏమీ మార్పులేదు.ఖచ్చితంగా నిన్నటిలాగానే వున్నావు" అన్నాను."ఆహా ఎంత అందంగావున్నావు? నువ్వు కట్టుకున్నందుకే ఈ చీరెకు ఇంత అందమొచ్చింది"అని నేను అనాలని ఆమె కోరిక. నాకేమో అలా అనడం ఇస్టంలేదు. ఆడవారు అతిగా అలంకరించుకొవాల్సిన అవసరం లేదని నా ధృఢవిశ్వాసం. ఒక్క ఉదుటున లేచి ఇంట్లోకివెళ్ళి నా పేంటూ, చొక్కా,లుంగీ చుట్టుకొని తెచ్చి నాపై విసిరివేసి "గెట్ అవుట్ " అని ధడేలుమని తలుపేసుకుంది.
నాక్కూడా కొంచం కోపం వచ్చింది.నేను అబద్ధం చెప్పనందుకు ఆమెకు కోపం రావడం తప్పా? నేను నిజం చెప్పినందుకు నాక్కోపం రావడం తప్పా? తప్పేవరిది? అని ఆలోచించుకుంటూ బట్టలు అక్కడే వదిలేసి పుస్తకం మాత్రం చంకలో పెట్టుకొని మా అమ్మగారింటికి వెళ్ళాను. మా అమ్మాగారిల్లు మేము అద్దెకుండే ఇంటికి రెండు బజార్ల అవతల వుంది. మా ఇంటికొచ్చి మంచం వాల్చుకొని పడుకొని పుస్తకం చదువుకొంటున్న నన్ను "అన్నం పెట్టమంటావురా?" అందిమాయమ్మ. నేనుఊంకొట్టగానే గబగబా ప్లేటులో అన్నం గోంగూరపప్పు,కొబ్బరికారం,నెయ్యి వేసి తెచ్చింది.నేను లేచి కూర్చొని తల దిండును వొళ్ళో పెట్టుకున్నాను.లేచి కాళ్ళూచేతులు కడుక్కోరా అంది.నేనేమీ మాట్లాడకుండా ప్లేటును దిండుమీద పెట్టుకొని రెండొ చేతులోని పుస్తకాన్ని చదువుకుంటూనేవున్నాను.ఇక లాభం లేదని మా అమ్మే ఓ గిన్నెలో నీళ్ళు తెచ్చింది.దాన్లో చెయ్యి ముంచి కడుక్కొని మెల్లిగా అన్నం కలుపుకొని తింటూనే పుస్తకం చదువుకుంటున్నాను."ఇంట్లో కోడల్లేదా?" అంది. ఉంది అన్నట్లు తల ఊపాను."ఏం చేస్తుంది?" అంది."ఏంలేదు ఊరికేవుంది"అన్నాను.మా అమ్మకి విషయం అర్ధమైనట్లుంది;మానాన్నకి ఉప్పందించింది.ఆయన మామేనమామనొకర్ని మాఇంటికి పంపి డేటా సేకరించాడు.విషయం తెలిసినాగాని వారికేమీ తెలియనట్లుగా ఎవరికివారు కూర్చున్నారు.చీకటి పడిన తరువాత లేచి ఇంటికి వెళుతున్నానని మా అమ్మతో చెప్పి మెల్లిగా ఇంటికి వెళ్ళాను. నన్ను చూస్తూనే మా ఆవిడ ఒక్క విసురున ఇంట్లోకి వెళ్ళీంది.టీ తెచ్చిచ్చింది.నేను టీ త్రాగినంతసేపు తనదురదృష్టాన్ని తలచుకొని బాధపడుతూనేఉంది.
Share this article :

3 comments:

  1. నమస్తే అజిత్ కుమార్ గారు!!

    మీరు రాసిన అందం చూడవయా!!.. చదివినతరువాత నాకు ఇలా చెప్పాలనిపించింది.. తప్పుగ అనుకోకండి. ..స్త్రీ కి తండ్రి గారం భర్త గొప్పదనం వుండాలట మన పెద్ద వాళ్ళు చెప్పిన సత్యం ఇది... ఎవరొ ఆ పక్కన వాళ్ళు ఈ పక్కవాళ్ళు బాగున్నారు అని చెప్పెకన్న ఈరోజు "నువ్వు బాగున్నవు" అని భర్త అంటే అది గొప్పతనం....స్త్రీలు అల్పసంతొషులండి.. బాగున్నవనో లేదా అన్నం తిన్నవా అనో మీరు అడిగరనుకొండి ఎంతో అనందపడ్తుంది.... ఎప్పటికి తెలుసుకొంటారో మీ మొగవాళ్ళు మా ఆడవల్ల మనసులని......ఏదో బంగారం అడిగరా..మీ ఆవిడ ఎలా వున్నాను అని కదా అది కూడా అడగలేదు... అడగక ఇచ్చిన compliment గొప్పదండీ.... !! అర్ధం చేసుకోరూ...!!!! మాస్టరైవుండీ... మీకు తెలియకపొవడమెమిటండీ ??? మరీ వింత కాకపొతే!!!

    ReplyDelete
  2. అజిత్ కుమార్ గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి

    - హారం ప్రచారకులు.

    ReplyDelete
  3. viswam గారూ...,

Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||