ఐక్యరాజ్యసమితి దినోత్సవం నేడే
Oct 24, 2017
ఈ రోజు ఐక్యరాజ్యసమితి దినోత్సవం. ఇది 72 యేళ్ళుగా ప్రపంచానికి సేవలు అందిస్తుంది.
80 దేశాలలోని 80 మిలియన్ల ప్రజలకు ఆహారము మరియు ఇతర సేవలను అందించింది. ప్రపంచంలోని 45 శాతం అనగా 30 లక్షల మంది పిల్లల ఆరోగ్యం కోసం ఏటా టీకామందులు పంపుతుంది. యుధ్ధము, హింస నుండి తప్పించుటకు 6 కోట్ల 56 లక్షలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూమిపై పెరుగుతున్న వేడిని 2 డిగ్రీలు తగ్గించుటకు 195 దేశాలతో కలిసి పనిచేస్తున్నది. లక్షా 17 వేలమందిగల శాంతి దళంతో 4 దేశాలలో 15 దాడులు చేసి శాంతిని కాపాడింది. పేదరికంపై పోరాటం చేస్తూ ఒక బిలియను మంది ప్రజలకు చేయూతనిచ్చింది. మానవ హక్కులు కాపాడుటకు 80 ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తున్న ఐక్యరాజ్యసమితికి నా అభినందనలు.
Labels:
పండగ
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !