C.M. గా జగన్‌ను నియమించకపోవడానికి కాంగ్రెస్ హై కమాండ్‌కు గల 2 కారణాలు

Sep 12, 2009

వైయ్యస్ రాజశేఖరరెడ్డి మరణానికి గల కారణాలను వెలికితీయడంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆహ్లాదకరంగా వ్యవహరించుతూంది. వైయ్యస్ రాజశేఖరరెడ్డి హైకమాండ్‌ను ఏవిషయంలోనూ ప్రాధేయపడకుండా చక్కని పరిపాలన సాగించుచు ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు. హైకమాండ్ లోని కొందరి పెద్దల సహజ అవసరాలు వైయ్యస్ ద్వారా నెరవేరడం లేదు. తమ వర్గానికి చెందిన ఏ ఎదవకైనా ఓ మంత్రి పదవి ఇప్పించుకోలేక పోయారు. హైకమాండును ఎటువంటి సలహాలు కోరకుండానే ఒంటి చేత్తో పార్టీని గెలిపించాడు. దాదాపుగా ఓ నియంత లాగా వాళ్ళ దృష్టిలో వాళ్ళు వైయ్యన్ ను భావించారు. కనుకనే వైయ్యస్ అదృశ్యవార్త విని మహదానందంగా నూతనోత్సాహంతో దు:ఖించారు.
1. వచ్చిన అవకాశం వదులుకొని మళ్ళా అధికారాన్ని జగన్ కు ఇవ్వడం హైకమాండ్ కు ఇష్టం లేదు. ఎందుకంటే జగన్ ప్రక్కన కెవిపి ఉన్నంతవరకూ అధికారం జగన్ కు ఇవ్వరు. ఎందుకంటే జగన్ కు హైకమాండ్ అంటే వా. రవి కాదు, మాయలఫకీరయిన ప్రణబ్ కాదు. కేవలం కేవీపీ రామచంద్రరావే.
2. ప్రమాదం జరగడానికి ఏవియేషన్ అధికారుల సహకారం తీసుకున్నవారు ప్రమాదం ఎలాజరిగిందో ఎంక్వైరీ చేయడానికి అష్టాచమ్మాలాగా తలాకాసేపు ధోరణిలో పరిశోధనాగేం ఆడేస్తున్నారు. ఈ పరిస్తితుల్లో ఒక వేళ జగన్ కే ముఖ్యమంత్రి పదవి ఇస్తే అతడు ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించే ప్రమాదముంది. అప్పుడు తమ బండారం బట్టబయలౌతుంది. కనుక అతనికి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇచ్చే అవకాశంలేదు.
3. హెలీకాఫ్టర్ లో ప్రయాణిస్తున్నవారు ఏం మాట్లాడారో తెలిశాక ( అంటే ఈ ప్రమాదం జరగడానికి హైకమాండ్ కారణమనే సంగతి. లేదా ఎవరో హెలీకాఫ్టర్ ను కావాలని పాడు చేశారనే విషయం పైలెట్లు గ్రహించి ఆవిషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పే సంభాషణలు ) ఆపాటికే జగన్ సియ్యంగా ఉంటే పార్టీని తొంభైశాతం దాకా చీల్చి వేరే పార్టీ పెట్టే అవకాశం ఉంది. కనుకనే జగన్ కు సియ్యంగా ఇవ్వరు.
4. రోశయ్యగారు కాబట్టి సియ్యం ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ జాడ తెలియలేదు అని తెలియగానే టి.వి. ప్రకటన ద్వారా ఎరుకలవాళ్ళు, యానాదుల వాళ్ళు దయచేసి అడవిలోకిపోయి వెతకండి అని కోరినాడు. అదే జగన్ అయితే పోలీసులను కోరివుండేవాడు.
5. చెట్లమీద హెలీకాఫ్టర్ దిగడంవల్ల సియ్యం గారికి దెబ్బలు తగిలి ఉంటాయనే 40 ఫొటోలు తీసి దానిలో సియ్యంగారూ, ఇతరులూ ప్రాణాలతో లేరని నిర్ధారించుకుని తర్వాత శవాలను తేవడానికి ప్రయత్నం జరిగింది.
6. బహుశా జనాన్ని మాయచేయడానికి , జగన్‌కు జనాన్ని దూరం చెయ్యడానికి ఏదైనా అభూతకల్పనలు సృస్ఠించవచ్చు, నిందలను సృష్ఠించవచ్చు.
కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదుగదా. ఇన్నాళ్ళకు కొందరికి పరిపాలించుకునే మహదావకాశం వచ్చింది. మరో నాలుగేళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు.
అటువంటి వారికి ప్రజలు చేతితో చెబుతారో కాలితోచెబుతారోగానీ మంచి సమాధానం చెబుతారని ఆశిద్దాం.
Share this article :

15 comments:

  1. మీ అభిప్రాయాలూ, నమ్మకాలు మీవి నేను వాటిని తప్పు పట్టను కాని నాకు మాత్రం ఈ మధ్యకాలంలో బాగా నవ్వు తెప్పిచ్చిన పోస్టు ఇది, ధన్యవాదాలు !

    ReplyDelete
  2. the logic behind your analysis is very creative. i think this can be given to any news channel for their Crime Time stories

    ReplyDelete
  3. chala bagundi mee creativity! high command killed your cm!!you forgot Varuna reddy!this kind of stories are not going to keep jagan in cm's gaddi! save democracy. Elected positions are not some body's babu sommu!

    ReplyDelete
  4. నిజమేనా !...కొన్నిసార్లు మన కళ్ళు కూడా మోసం చేయొచ్చు కదా!

    ReplyDelete
  5. ha ha ha haaaaaaaa

    ReplyDelete
  6. అమ్మా శ్రావ్యా!
    ఎక్కడో సింగపూర్ లో ఉన్న నీకేం తెలుస్తుంది... ఆంధ్రుల గుండె ఘోష! ఈ పోష్టు నీకు నవ్వు తెప్పించడం లో వింత ఏం లేదు. వైఎస్ అంతిమయాత్ర నీకు పండగలా ఉండే ఉంటుంది. మీ ఇంట్లో బిరియాని వండే ఉంటారు!
    బాబూ హరి ప్రసాద్...
    లాజిక్ గా ఉంది... న్యూస్ ఛానెల్స్ కి ఇస్తే బాగుంటుంది ఒక సినిమాచూసిన దిగువస్థాయి ప్రేక్షకుడిలా నువ్వు స్పందించిన తీరు చూస్తుంటే వాంతి వస్తోంది. వైఎస్ దుర్ఘటనకు నువ్వేమైనా నిజమైన కారణం చెప్పగలవా? ఎనాలసిస్ చేస్తావ్! మనిషి నచ్చితే ఒకలా... నచ్చకపోతే ఒకలా
    మాష్టారూ మీరు బాగా రాసారు... చాలా గుండెలు వైఎస్ మరణం వెనుక దాగున్న నిజాలేమిటొ నని మీలానే రక రకాలుగా ఎనాలసిస్ చేసుకుంటూ వేదననుభవిస్తున్నారు!

    ReplyDelete
  7. మాష్టారూ!
    మీ పోష్టు చాలా... చాలా బాగుంది. ప్రజల గుండె చప్పుడు మీ పోష్టులానే పరి పరి విధాల ఆలోచనలో పడింది.
    ఇక పోతే నవ్వొస్తుంది... హహ... హహలాంటి కామెంట్స్ కూడా మీ పోష్టుకి వచ్చాయి. వాటిని పట్టించుకోకండి! శవం కాలుతుంటే అన్నం తింటున్న శివపుత్రుడు... నాయనమ్మ శవం ఉండగానే ఆకలేస్తుంది అన్నం పెట్టమన్న కమల్ హాసన్ స్వాతిముత్యం గుర్తొస్తున్నాయి. వారి మానసిక స్థితికి జాలి వేస్తోంది.
    నరేష్

    ReplyDelete
  8. మాస్టరు నాకు నవ్వు తెప్పించింది ఆయన మరణం కాదండి మీరు రాసిన కారణాలు , ఆయన మరణం లో అత్యధికం గా నష్టపోయింది వారి కుటుంబసభ్యుల తరవాత కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే.
    1. వచ్చిన అవకాశం వదులుకొని మళ్ళా అధికారాన్ని జగన్ కు ఇవ్వడం హైకమాండ్ కు ఇష్టం లేదు. ఎందుకంటే జగన్ ప్రక్కన కెవిపి ఉన్నంతవరకూ అధికారం జగన్ కు ఇవ్వరు. ఎందుకంటే జగన్ కు హైకమాండ్ అంటే వా. రవి కాదు, మాయలఫకీరయిన ప్రణబ్ కాదు. కేవలం కేవీపీ రామచంద్రరావే.
    >> అంటే మీ ఉద్దేశ్యం లో జగన్ కాక వేరే వాళ్ళు CM ఐతే కేవీపీ ఏమి చేయలేరనా , ఎవరు ముఖ్యమంత్రి ఐనా ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో అయన హవానే నడుస్తుంది .
    2. ప్రమాదం జరగడానికి ఏవియేషన్ అధికారుల సహకారం తీసుకున్నవారు ప్రమాదం ఎలాజరిగిందో ఎంక్వైరీ చేయడానికి అష్టాచమ్మాలాగా తలాకాసేపు ధోరణిలో పరిశోధనాగేం ఆడేస్తున్నారు. ఈ పరిస్తితుల్లో ఒక వేళ జగన్ కే ముఖ్యమంత్రి పదవి ఇస్తే అతడు ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించే ప్రమాదముంది. అప్పుడు తమ బండారం బట్టబయలౌతుంది. కనుక అతనికి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇచ్చే అవకాశంలేదు.
    >> ఏ ఆధారాలతో మీరు ఇది చెబుతున్నారు, మరీ ఏవియేషన్ అధికారులు మీకు అంత వెధవలు గా కనపడుతున్నారా?
    3. హెలీకాఫ్టర్ లో ప్రయాణిస్తున్నవారు ఏం మాట్లాడారో తెలిశాక ( అంటే ఈ ప్రమాదం జరగడానికి హైకమాండ్ కారణమనే సంగతి. లేదా ఎవరో హెలీకాఫ్టర్ ను కావాలని పాడు చేశారనే విషయం పైలెట్లు గ్రహించి ఆవిషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పే సంభాషణలు ) ఆపాటికే జగన్ సియ్యంగా ఉంటే పార్టీని తొంభైశాతం దాకా చీల్చి వేరే పార్టీ పెట్టే అవకాశం ఉంది. కనుకనే జగన్ కు సియ్యంగా ఇవ్వరు.
    >> మామూలు గా బ్లాగులు రాసి చదివే మనకే ఇన్ని తెలివితేటలు, ఇంత సమాచారం ఉంటే జగన్ కు తెలియదా? అప్పుడు CM కాకపోతే మాత్రమేమి వేరే పార్టీ పెట్టటానికి.
    4. రోశయ్యగారు కాబట్టి సియ్యం ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ జాడ తెలియలేదు అని తెలియగానే టి.వి. ప్రకటన ద్వారా ఎరుకలవాళ్ళు, యానాదుల వాళ్ళు దయచేసి అడవిలోకిపోయి వెతకండి అని కోరినాడు. అదే జగన్ అయితే పోలీసులను కోరివుండేవాడు.
    >> పోలీసులు ను జగన్ కోరక్కరలేదు రోశయ్యగారు కూడా కోరక్కరలేదు , అది వారి భాద్యత, అందులోను రాజశేఖర రెడ్డి గారి అభిమాన అధికారే DGP పోస్టు లో ఉన్నారు అని అందరికి తెలిసిన విషయమే కదా. BTW
    ఆ సమయం లో రోశయ్య గారు CM కాదు.
    5. చెట్లమీద హెలీకాఫ్టర్ దిగడంవల్ల సియ్యం గారికి దెబ్బలు తగిలి ఉంటాయనే 40 ఫొటోలు తీసి దానిలో సియ్యంగారూ, ఇతరులూ ప్రాణాలతో లేరని నిర్ధారించుకుని తర్వాత శవాలను తేవడానికి ప్రయత్నం జరిగింది.
    >>అంటే బ్రతికి ఉంటే తెచ్చేవాళ్ళు కాదా?
    6. బహుశా జనాన్ని మాయచేయడానికి , జగన్‌కు జనాన్ని దూరం చెయ్యడానికి ఏదైనా అభూతకల్పనలు సృస్ఠించవచ్చు, నిందలను సృష్ఠించవచ్చు.
    >> ఇలా చేస్తే నష్టపోయేది కాంగ్రెస్ మాత్రమే.

    ReplyDelete
  9. వైఎస్ అంతిమయాత్ర నీకు పండగలా ఉండే ఉంటుంది. మీ ఇంట్లో బిరియాని వండే ఉంటారు!>>
    అబ్బే లేదండి ఆ రోజు బిరియాని వండలేదు, ఏమి తిన్నాను ... ఆ గుర్తు కొచ్చింది పిజ్జా తిన్నా, పర్లేదు అది కూడా బానే ఉందిలెండి . మీరు రాసిన కారణాలు సహేతుకం గా లేవు అంటే మేము చావు ను పండుగ చేస్తుకోన్నట్లు అన్న మాట బాగుంది , ఇలాంటివి రాశేటప్పుడన్నా కొద్దిగా మీ బ్లాగ్ పేరు గుర్తు పోట్టుకోండి సారూ !

    ReplyDelete
  10. మాస్టారూ, మీరు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు, సాక్షి పేపర్ లోనో, వాళ్ల చానెల్ లోనో ఉండాల్సిన వాళ్లు. ఈ ఆర్టికల్ ను, వాటికి ఏమైనా పంపించకపోయారా, మొదటి పేజీ లో, ఆరుకోట్ల ఆంధ్రుల గుండెచప్పుడు లాంటి, మీ టపా, సాక్షి మొదటి పేజీ లో వచ్చేది.

    అయినా, 60 ఏళ్లకే పోతానని చెప్పి మరీ పోయిన మన అపర "ఏసయ్య" దేముడు గారికి వాటికన్ వాళ్లతో సెయెంట్ హుడ్ ఇప్పించే దిశలో పనిచేయక, జగన్ ను CM చేయాలనే చిన్న చిన్న ఆశయాల కోసం మీ మెధాశక్తిని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు.

    మీ లాంటి మెతావే మా మిత్రుడు ఒకడు, తన కొడుకు ను CM ని చేయటానికి కావాలనే దేముడు గారు తీసుకోవాల్సిన కమీషన్ లు తీసుకొని ఆ దేముడు దగ్గరకు వెళ్లిపోయారని తెగ బాధపడి పోయాడు.

    ReplyDelete
  11. జగన్ కాక వేరే వాళ్ళు CM ఐతే కేవీపీ ఏమి చేయలేరనా , ఎవరు ముఖ్యమంత్రి ఐనా ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో అయన హవానే నడుస్తుంది ...ఏ ఆధారాలతో మీరు ఇది చెబుతున్నారు

    yes i want to talk to praveen sarma right now..

    ReplyDelete
  12. మీరు చెప్పింది నిజమే నండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దరించటానికి పుట్టిన అవతారపురుషుడు మరో శ్రీక్రిష్ణుడు లాంటి KVP మాటలను నమ్మి, చనిపోయిన అర్జునుడు aka YS aka Samuel Reddi గారి కుమారుడు మరొ అభిమన్యుడు లాంటి జగన్ యువరాజాలను ముఖ్యమంత్రి చేయకపోవటం చాలా శొచనీయం.

    దీనిని ఖండించటానికి జగన్ యువరాజా వారి యువసేన లో నుండి, మీలాంటి సేనానాయకులు నడుము బిగించి, మానవ బాంబులయ్యి, D.S లాంటి వాళ్ల శరీరాలు, మరియు మీ శరీరాలు ముక్కలు ముక్కలు చేసుకొని, పైన ఉన్న ఏసు ప్రభువు దగ్గరకు చేరుకొన్న ఆ ఏసు కంటే గొప్పవాడయిన (ఎందుకంటే, ఏసయ్యకు మహా అయితే చర్చ్ లు , మాత్రమే ఉన్నాయ్యి, అదే మన అపర ఏసయ్య కు అయితే గుడులు, పూజలు, కొబ్బరికాయలు కూడా ఉన్నాయి) మన దేముడు గారి దగ్గరకు చేరుకోవాల్సిందే.

    ఇక అపర ఏసు గారి హెలికాప్టర్ ను కుట్ర పన్ని కూల్చిన ఈ పాపపు లోకం లో మీ లాంటి ఉత్తములు బ్రతికి ఉండటం కంటే చనిపోయి దేముడు గారి దగ్గరకు చేరుకొని వరుణ దేముడు (మర్చి పోయాను ఏసయ్య పక్కన వరుణ దేముడు ఉంటాడా?, దీనికోసం ఎదయినా ఇంకొ నిభందన కావాలేమో, పెద్ద ఇబ్బంది ఏమీలేదు, మన అనిల్ కుమార్ గారు ఒకటి ఎటూ youtube లో పెడతారులే) ను పొగుడుతూ, ఆటలు ఆడుకోవాల్సిందే.

    ఇక మాలాంటి పాపకుండలు ఎదో చికెన్ బిర్యానీయో, లేక పిజ్జా బర్గర్లో తింటూ కాలక్షెపం చెస్తూ ఉంటాం. మన అభిమన్యుడు జగన్ గారెమో, శ్రీక్రిష్ణుడు లాంటి kvp తో కలసి, సాక్షి కొసం తెల్ల డబ్బు 300 కోట్లు ఇచ్చినందుకు వాంపిక్ పేరుతో మేట్రిక్స్ ప్రసాద్ గారికి కేవలం 28 వేల ఎకరాలు, సైన్స్ సిటీ లాంటి వాటి కోసం కేవలం ఓ లక్ష ఎకరాలు తీసుకొని కంచె వేస్తూ, మీ లాంటి అభిమానుల పుణ్యమా అని దేశ సేవ చేస్తూ ఉంటారు. తన కోసం, మానవ బాంబ్ లు అయిన వారికోసం, సాక్షి లో, ఓ పేజీ కేటాయిస్తారు కుడా (ఎంతయినా యువరాజా వారు ధరమప్రభువులు మరి). అవతార పురుషులు సోదర అనిల్ కుమార్ గారెమో ఎప్పటిలాగే కూటాలు పెట్టి జనాలను ప్రభువు దగ్గరకు చేరుస్తూ ఉంటారు.

    ReplyDelete
  13. స్పందించిన బ్లాగ్మిత్రులకు ధన్యవాదాలు. నావి కేవలం ఊహాగానాలేకాని ఆధారవూరితమైనవికావని మనవి. నా అంచనాలన్నీ నిజం కాకపోవచ్చు.జగన్ గారికి సీయ్యం పదవి నిరాకరిస్తున్నారన్న బాధతో , నాబాధను ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియక బ్లాగులో వ్యక్తవరచాను. వైయ్యస్సార్ గారికి శరద్‌పవార్ లాగా, మమతా బెనర్జీ లాగా స్వంత కుంపటి పెట్టుకునే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి గనుక ఆయనను రెచ్చగొట్టేందుకే రైల్వేల్లాంటి ప్రాజక్టులు తగినన్ని యివ్నకపోతేనన్నా హైకమాండ్ పై తిరగబడి తాను స్వంత పార్టీ పెట్టుకుంటాడేమోనని వేచి చూస్తున్నట్లున్నారు. కానీ ఆయన అలాంటి పని చెయ్యలేదు. ప్రస్తుతం జగన్ని కూడా రెచ్చగొడుతున్నారు ఒకవేళ వైయ్యస్సార్ కాంగ్రెస్ లాంటి పేరు పెట్టుకొని స్వంత పార్టీ పెట్టుకుంటాడని. కేవీపీ రామచంద్రరావుగారు అందర్నీ కంట్రోలు చేస్తున్నారు. భవిష్యత్తులోనైనా సరే తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశం లేదనీ, సోసియా గారికి నమ్మకమైన బంటుగా జగన్ ఉంటాడని హామీలిస్తూ హైకమాండును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. హైకమాండ్ కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ వైయ్యస్సార్ మరణానంతరం ఆత్మహత్యలు చేసుకున్నవారిని గురించి ఇంతవరకూ పట్టించుకు పోవడానికి కారణంగా నాకేమనిపిస్తుందంటే బహుశా జగన్‌కు అధికారం అప్పగించవచ్చేమోనని.

    ReplyDelete
  14. http://ekalingam.blogspot.com/2009/09/blog-post.html?showComment=1252849531523#c3782070532801604812

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||