తెలుగు భాషను గురించి ఆలోచన చేస్తుంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు భాష అనేక విధములైన ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. మనం వ్రాస్తున్నదీ , సంభాషిస్తుందీ తెలుగు కాదు. నిజానికి భారతదేశంలోని భాషలేకాదు, దాని పరిసర దేశాలలోని భాషలు కూడా ఈ రకమైన సంక్షోభంలో ఉన్నాయి. ఈ భాషలలో మృత భాష అయిన సంస్కృత భాషను బలవంతంగా, ప్రయత్న పూర్వకంగా చొప్పించ బడుతుంది. ఉదాహరణకు తెలుగు భాషను బలోపేతం చేయడమనే ప్రయత్నంలో భాగంగా సంస్కృత భాషను కొందరు పండితులు ప్రవేశపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ అయిన ఒకటవ తరగతి తెలుగు పుస్తకం ఒకసారి చూడండి. అందులో తెలుగు పదాల కంటే సంస్కృత పదాలే ఎక్కువగా ఉన్నాయి. అవే బలవంతంగా తెలుగు పేరుతో నేర్పబడుతున్నాయి. తెలుగు భాషలో అందుబాటులో లేని పదాలను సంస్కృత భాషనుండి తెచ్చుకోవడంలో తప్పులేదు కానీ , తెలుగులో మంచి పదాలున్నప్పటికీ వాటికి బదులుగా సంస్కృత భాషలోని పదాలు వాడడమే గొప్పగా భావించబడుతుంది. తేనెలూరు తెలుగు రుచి సంస్కృతంతో సంకరమైన భాషలో ఉండదు. తెలుగు భాషాభివృద్ధికి సంస్కృత భాషా పండితులే నాయకత్వం వహించి వివిధ ఉద్యమాలు, కార్యక్రమాలు నడపడం మన దౌర్భాగ్యం.
నిజమైన తెలుగు మాట్లాడేవారికి ద్విత్వాక్షరపదాలు మాత్రమే పలుకగలరు. సంయుక్తాక్షరాలు పలుకలేరు. సంయుక్తాక్షర పదాలను కూడా అందమైన తెలుగు యాసలో విరిచి మాట్లాడగలరు. మాయాబజారు చిత్రంలో అసమదీయులు, తసమదీయులు లాగా. పూర్వకాలపు పండితులకు ఈ సంస్కృత భాషాదురభిమానం బహుశా లేకుండుటచే కాబోలు డేవిడ్ ,జోసఫ్ , జీజస్ వంటి పేర్లు కూడా దావీదు, యోసేపు ,యేసు , జోజప్ప, జేసువు ఇలా అనువదింపబడ్డాయి.
ఒకవిధంగా చూస్తే తెలుగు భాషపై ఓ దీర్ఘకాలిక కుట్ర జరిగినట్లు కన్పిస్తుంది. అది క్రమేపి బలపడుతుంది. సాధారణ ప్రజలకు ఈ విషయాలు అర్ధం కావడం కష్టం. కనుక ఓ మృతభాషాసంకలితం చేయబడినందున మన భాషలు కూడా మృత్యుకళతో ప్రకాశిస్తున్నాయి. ఇట్స్ టూ లేట్. మనమేంచెయ్యలేం. లీవిట్.
సంస్కృతం పక్కనే ఒక deathbed ఏర్పాటుచేసిన మగానుభావులే ఇప్పుడు పాపం తెలుగు చచ్చిపోతోందని తెగబాధపడిపోతూ ఉన్నారు. వాళ్ళకు తాము చెప్పిందే తెలుగు. మనలాంటోళ్ళు మాట్లాడుకునేది కాదు. బాధపడేవాళ్లని బాధపడనివ్వండి.తెలుగెక్కడికీ పోదు.
ReplyDelete