ఒక స్టూడెంటు తన మాస్టారుగారితో ఇలా అన్నాడు " అయ్యా ! నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను . ఒకవేళ దీనికి జవాబును తమరు చెప్పలేకపోతే నాకు ఈ పరీక్షలో A గ్రేడు ( First Class Marks ) ఇవ్వాలి " అని అడిగాడు.దానికి మాష్టారు సరే అన్నారు. " అయ్యా! దేన్ని న్యాయబద్ధమేగానీ తార్కికంగా సమర్ధనీయంకానిదనీ, తార్కికంగా సమర్ధనీయమేగానీ న్యాయబద్ధం కానిదనీ , అటు తార్కికంగానూ ఇటు న్యాయబద్ధంగానూ సమర్ధనీయం కానిదనీ అంటారు ? " అని అడిగాడు. మాష్టారు బాగా ఆలోచించారు. అయినా జవాబు చెప్పలేకపోయాడు. కనుక పందెం ప్రకారం అతనికి A గ్రేడ్ ఇచ్చాడు. తర్వాత తన క్లాస్ లో మంచి తెలివైన విద్యార్ధిని పిలిచి ఇదే ప్రశ్న అడిగాడు .
దానికా విద్యార్ధి “ సార్! ఇది చాలా సింపుల్ సార్.ఒక ఉదాహరణ తీసుకుందాం.
మొదటిది. ఒక వ్యక్తి వయసు 60 సంవత్సరాలు అతని భార్య వయసు 35 సంవత్సరాలు అనుకుందాం. 60 సంవత్సరాల వయస్సున్న ఆవ్యక్తి 35 సంవత్సరాలవయస్సున్న స్త్రీని పెండ్లి చేసుకోవడం న్యాయబద్ధమేగానీ తార్కికంగా సమర్ధనీయంగాదు.
రెండవది ఆమె వైపునుండి చూద్దాం. ప్రేమించడంలో 25 సంవత్సరాల అనుభవంగల వ్యక్తిని పెండ్లిచేసుకోవడం తార్కికంగా సమర్ధనీయమేగాని తన తండ్రి అంత వయస్సు గలవానిని పెండ్లాడడం న్యాయంగాదు.
మూడవది పరీక్ష రాయకపోవడమేకాకుండా,మిమ్మల్ని ఓడించానని అందరికీ చెబుతూ మిమ్మల్ని అవమానపరుస్తున్న వాడికి A గ్రేడు మార్కులు ఇవ్వడం న్యాయబధ్ధంకాకపోవడమేగాక తార్కికంగా సమర్ధనీయంకూడాకాదుగదా “ అన్నాడు.
బాగుంది.కానీ అన్నీ ఒకేవిషయానికి సంబంధించి[వర్తించి] వుండాలనుకున్నాను.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteకానీ విస్తెర్లో ఐటంలు అన్నీ
ReplyDeleteవుంటేనే బాగుంటుందనీ...
idi oka english joke anukuntanu?
ReplyDeleteyes
ReplyDelete