కళలు అంటే నైపుణ్యాలు. రతి కార్యమునకు సహాయపడే వివిధ నైపుణ్యాలను కళలు అంటారు. ఇవి 64 అని వాత్సాయనుడు చెప్పాడు. వీటిలో ప్రధానమైనవి లలితకళలు. ఇవి కవిత్వము, సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము. కవిత్వము శృంగారాన్ని ప్రధానంగా వినిపిస్తుంది. నేటికాలంలోని ఏ సినీమాను చూసినా అందులో ప్రేమ ఎలా ఫలవంతమైనదో చూపబడుతుంది. పాటలు ఎక్కువగా శృంగారభావాత్మకంగా ఉంటాయి. సంగీతము లో ఎదుటివారిని వశపర్చుకునే శక్తిగలది అంటారు. నాట్యము అనగా కళాకారులు అనేపేరుతో స్త్రీలు ప్రదర్శించే వివిధ రతిభంగిమల ప్రదర్శనే నాట్యము. శిల్పము నందు చెక్కబడేవి శృంగారభంగిమలే. పూర్వము దేవాలయాలపై ఇవి తప్పనిసరిగా చెక్కబడియుండేవి. అలాగే చిత్రలేఖనము కూడ స్త్రీల నగ్నసౌందర్యాన్ని చిత్రించడమే చిత్రకళకు పరాకాష్టగా చెప్పవచ్చు. ఈ కళలు ఫ్యూడలే భావాలతోనిండి వుంటాయి. పూజాభావం, ఆత్మార్పణం వంటి వికారాలు కలుగుతాయి. మతభావనలు ప్రచారమునకు ఇవి ప్రధాన ఆయుధములుగా విలసిల్లినవి.
నేటి కమ్యూనిష్టుపార్టీలవారమనిచెప్పుకునేవారు పై చెప్పబడిన ఫ్యూడల్ ఆయుధములతో ఫ్యూడల్ సంస్కృతిని విమర్శిస్తూ పాటలద్వారా, కుంటినాట్యము ద్వారా ధనవంతుల మోసాల గురించి, ప్రభుత్వ పక్షపాతధోరణి గురించి ప్రబోధిస్తుంటారు. భావవాద ఆయుధములైన కళలతో భావవాదకమ్యూనిష్టు పార్టీలు భావవాద వ్యతిరేక ప్రచారం చేయబూనడం విడ్డూరంగదా.
adi ivaLa commam aipoyindamDi....
ReplyDeletemari elaa prachaaramu cheyyali?
ReplyDelete