చేనేత కార్మికుల ఆకలి చావులు

Aug 29, 2010

చేనేత కార్మికులు మాత్రమే ఎందుకని మరణిస్తున్నారు ? అనేక ఇతర వృత్తుల వారి పరిస్తితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. వారిపై లేని ఆదరణ కేవలం చేనేత పనివారిపైనే ఉండడానికి కారణమేమైయుంటుందో నాకైతే అంతుబట్టడంలేదు. పైగా బ్రతుకుదెరువు కోసం కూలీలుగా,  హోటళ్ళలో సర్వర్లుగా, బట్టల కొట్టుల్లో సేల్సుమేన్లుగా పనిచేస్తున్నారని అక్కడికి అదేదో ఘోరమైన తప్పిదమన్నట్లుగా మీడియా ప్రచారం చేస్తుంది.
వాస్తవానికి ప్రజల ఆసక్తులు , ఆశలు మారుతున్నాయి. వారు ఆధునిక జీవనవిధానానికి మారిపోతున్నారు. ప్రాచీన భారతీయ సంస్కృతికి నేటి ఇండియన్ సంస్కృతి కి మార్పు చాల ఎక్కువగా ఉంది. దానిని ఆపడానికి మతశక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వము వ్యాపారుల చేతుల్లోఉంది. వ్యాపారులు ప్రజల ఆలోచనా విధానంలో మార్పును ఆశించడంలేదు. ప్రజలు ప్యూడల్ ధోరణిలో ఉంటే వ్యాపారులకు లాభాలకు కొదవవుండదు. అయితే వ్యాపారులు మాత్రం మారుతూఉన్నారు గానీ ప్రజల్లో ఆమార్పులు వారు ఆశించడంలేదు. అందుకే మతం చెక్కుచెదరకుండా ఉండాలంటే కులం ఉండాలి. కనుక కులవృత్తులు అంతరించిపోకుండా ఆర్ధిక సహాయం చేస్తుంది. ప్రజలు చేనేత వస్త్రాలు కొనడంలేదు. కుటీర పరిశ్రమలలో తయారౌతున్న వస్తువులను కొనడంలేదు. దేవతా శిల్పాలకు పూజలు చేయుటకు బదులుగా క్యాలెండరు దేవుడి బొమ్మలకు , ప్లాస్టిక్ దేవుని బొమ్మలకు పూజలు చేస్తున్నారు. కనుకనే ప్లాస్టిక్ ను వ్యతిరేకించండి అనే నినాదం ప్రభుత్వ శక్తులచే ప్రచారం చేయబడుతుంది. మాతృభాషను ప్రోత్సహించాలి అనే పేరుతో ఇంగ్లీషు భాషను ప్రజలకు దూరం చెయ్యాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన భాషలో ఆంగ్ల పదాలు చేరకుండా నిరోధించడం కోసం కృషి జరుగుతుంది. మట్టి కుండల వాడకం తగ్గిపోయింది. అందుకే మంతెన సత్యన్నారాయణరాజు గారు వంటి మతప్రచారకులు మట్టి కుండల్లో పిడతల్లో వంటచెయ్యడం వల్ల తిరిగి ప్రజలను ప్రాచీన అలవాట్లవైపు మళ్ళించాని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వము భజన సంఘాలకు ధనమిచ్చి ప్రోత్సహిస్తుంది. ఇంగ్లీషు భాషను నిషేదించాలని , భారత దేశాన్ని జంబూ ద్వీపంగా మార్చాలని ప్రయత్నం జరుగుతుంది. తద్వారా ఇండియాను హిందూ మత రాజ్యంగా మార్చాలనే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రాంతీయ తత్వాన్ని పెంపొందించుట, మాతృభాషలో బోధన, మతవిద్య, యోగ, ప్రకృతి వైద్యం, మాంసాహారం మాని ఆకులు, కాయలు, గింజలు తినుట, దేశ చరిత్రను మార్చిరాయుట, కళలను , కుటీర పరిశ్రమలను , చేనేత పరిశ్రమను ప్రోత్సహించుట వంటి చర్యలు తీసికొనుట ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే అందులో చిత్తశుద్ధి లేదు. రాజకీయ నాయకులు మాత్రమే ఖద్దరు దుస్తులు ధరిస్తున్నారు. వారి కుటుంబసభ్యులు అత్యంత ఆధునిక పోకడలతో ఉంటున్నారు. వారు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు. పబ్బులలో విహరిస్తున్నారు. కంపెనీ దుస్తులు ధరిస్తున్నారు. విమానాలలో కారులలో తిరుగుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతరులు కూడా అమెరికా నాగరికతను ఫాలో అవుతున్నారు. అయితే ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా బలవంతంగా మతవిధానాలను వారిపై రుద్దాలని చూడడం నిష్పలం.
భావవాదులైన కమ్యూనిష్టులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాంగదా అని , కార్మికులకు అనుకూలంగా మాట్లాడుతున్నాం గదా అని మాతృభాష, అమెరికా వ్యతిరేకత తదితర అంశాలలో అయోమయంగా పాల్గొంటున్నారు. పిటీ...
Share this article :

2 comments:

  1. ఎంత చేసి ఏం లాభం. క్రిస్టియన్ మిషనరీల దాటిని తట్టుకోవడం వీళ్ళ వల్ల అవుతుందా? వాళ్ళ గురించి కూడా ఒక మాట రాయండి.

    ReplyDelete
  2. అజిత్ కుమార్ గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||