ప్రపంచ అక్షరాశ్యతాదినం జరుపుకుంటున్నాం. కనుక ఇప్పుడైనా అక్షరాస్యత అంటే ఏమిటా అని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇద్దరిమధ్య జరుగవలసిన అవగాహన ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడానికి అవసరం. ఎదురెదురుగా ఉన్నప్పుడు ఒకడు మరొకనికి కొన్ని గుర్తులు చూపి, లేదా కొన్ని శబ్దాలు వినిపించి తెలియజేస్తాడు. ఇది ప్రధానమైన అంశం. ఇక అప్రధానమైన విషయం మరొకటుంది. దేనిపైనైనా కొన్ని గుర్తులు లేక బొమ్మలు వ్రాసి తన అభిప్రాయాన్ని తాను ఎదుటలేకపోయినా మరొకనికి తెలియజేయగలగడం. ఇది అధమాధమ కార్యము. ఎందుకంటే ఎదురెదురుగా ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయం మరొకరికి ప్రత్యక్షంగా వివరించుకునే అవకాశం ఉంటుంది. అనేక పొరలుగల ఈ ప్రక్రియ జరిగినంద వీజీగా ఉత్తరాలద్వారా జరుగదు. కనుకనే దీనిని అధమాధమని అంటున్నాను. అయితే మోసగాళ్ళకిది కల్పవృక్షం. దేవుడు చెప్పాడంటూ తమ వంచనాకృతులు వెలయించి ఎదుటివారిని మోసగించి కాలం గడుపుకునే వంచకులకు ఇదే గొప్ప. కనుకనే కృతజ్ఞతా సూచకంగా అక్షరాస్యతాదినోత్సవం జరుపుకుంటున్నారు. నేడు ప్రపంచములో అనేకరకములైన మోసగాళ్ళూ, అపజ్ఞానులూ, వేషధారులతో నిండివుంది. ప్రతిఒక్కడూ తన పొరుగువానికి చెందవలసిన వాటాలో కొంత పొందాలని చూస్తున్నారు.
భావవాదులు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇవ్వకుండా, అవసరం లేనివిషయాలకు ప్రాధాన్యత ఇచ్చి కాలక్షేపం చేసేవాళ్ళే. ఇకపోతే అక్షరాస్యత అంటే గురురహిత స్వంత పైత్యంగా మార్చివేస్తున్నారు. అనవసరశ్రమను తలకెత్తుతున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి రెండు రకాల భాషల సంజ్ఞలు నేర్చుకుంటే మంచిది. ఒకటి లోకల్ భాష, మరొకటి గ్లోబల్ భాష. లోకల్ భాషలో చదవనూ, వ్రాయనూ నేర్చుకొనుటకు రెండుసంవత్సరములు పడుతుంది. అంటే పిల్లలను ఆరవ ఏట బడిలో చేరిస్తే రెండేళ్ళలో కేవలం లోకల్ భాషను నేర్చుకుంటే సరిపోతుంది. ప్రాధమిక విద్యలో మిగిలిన మూడు సంవత్సరాలు గ్లోబల్ భాష నేర్పాలి. ఇక ఆరవ తరగతినుండి పదవతరగతివరకు సైన్సు, గణితం, సామాజిక విషయాల పరిజ్ఞానం గురించి నేర్పాలి. ఇవి వారాంతపు సెమిస్టర్ల విధానంలో పరీక్షిస్తుంటే చదువు ఆహ్లాదకరంగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఏమంటారు?
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !