దమ్ము లేని దమ్ము --- movie review

Apr 30, 2012



సంవత్సరానికి రెండురోజులు చంపుకుందామని మిగతా రోజులు ఒకరిజోలికి మరొకరు రాకుండావుందామని రెండు ప్రాక్షన్ గ్రూపులు నిర్ణయించుకోవడం అసమంజసంగావుంది.
కధ మొదటే బలహీనపడింది. కర్నూలు జిల్లా హొలగొంద మండలంలో దేవుని విగ్రహం కోసం కర్రలతో కొట్టుకునే సాంప్రదాయాన్ని ఆసరాగా తీసుకొని , ప్రాక్షన్ తరహాలో తన్నుకుంటాం, చంపుకుంటామంటే ప్రభుత్వం చూస్తూకూర్చుంటుందనుకోవడం కూడా ఘోరమైన తప్పు. 
 సుమన్ తనకు వారసుడు పుట్టినప్పుడు వాడ్ని రహస్యంగా పెంచి, సర్వవిద్యలు నేర్పి, నాసర్ వర్గాన్ని ఓడిస్తానని చెప్పడం  రెండవ బలహీనత.

ఆఏటినుండి ప్రత్యర్ధుల గ్రామాలలో ఎవరూ మగబిడ్డను కనరాదని ఆంక్ష విధించడం గెలిచిన నాసర్ని ని బలహీనపరచడమే. నాసర్ వేషధారణ కూడా అంతబాగలేదు. ఆయన జమిందారులాగాలేడు, బురదగుంటల్లో చేవలు పట్టేవాడులాగా ఉన్నాడు.

ఆపదలో ఉన్న ఒకరిని కాపాడి 25లక్షలు సంపాదించిన ఎంటీయార్ ఎంతమందినైనా తంతాడు చంపుతాడు కానీ హింసను చూస్తూచూస్తూ జరగనీయడు.63లక్షలకు ఓనరౌతాడు. తన రాయకీయ ప్రవేశాన్ని గూర్చిన ఆకాంక్షను వెలిబుచ్చడం అప్రస్తుతంగా వుంది. యువకులు  ప్రేమలో దిగడానికి, వివాహం చేసుకోవడానికి ముందుగా ఎంత సంపాదించాలో ఒక అంచనా ఇచ్చాడు. విజయం సాధించినప్పుడు మిత్రునికి మందుపార్టీ ఇవ్వాలనే నీతిని బోధించాడు. లిల్లి,బూరె బుగ్గల బుల్లీ అంటూ, ఏంగిల్స్ గురించీ, డ్రస్ రంగులు గురించి బాగా చెప్పాడు.  చస్తే చావనీ అంటే,  తన ప్రయురాలిని అవమానిస్తే పోలీసులు అనికూడా చూడకుండ కొడతాడు. అలాగే స్టేట్ హోం మినిష్టరోచ్చి పోలీసుల్ని కొట్టిన వానికి సారీ చెప్పడం, పోలీసు ఉన్నతాధికారి ఎస్సైని స్ఫాట్ లోనే సస్పెండ్ చేయడం , ఎవరితో పెట్టుకున్నావో చూశావా అనడం అంటే ఇదేంట్రా బాబూ అని ప్రేక్షకులు జుట్టు పీక్కోవాల్సొచ్చింది.


కోటాశ్రీనివారావు తమ అవసరం చెప్పకుండా దత్తత తీసుకోవడం అదీ అసంబద్ధంగా అంటే సుమన్ మామ అయిన కోట శ్రీనివాసరావు సుమన్ పేరుతో దత్తత చేసుకోలేడుకదా . సుమన్ మామ ఒకర్ని దత్తత తీసుకుంటే అతను సుమన్ కుటుంబానికి వారసుడు ఎలా అవుతాడు? 

దత్తత స్వీకరించిన  తరువాత చీటికీమాటికీ  డబ్బు ఎంటీవానిచేత ఖర్చు పెట్టమనడంలో కామిడీ ఊహించారేమోగాని అది కధాపరంగా ఒక బలహీనత. బ్రహ్మానందానికి తగిన పాత్ర లేక నిస్సహాయు డైనాడు.
 
ఎన్నడూ తిండిమొహం ఎరుగనివాడిలా రాజమహల్ లో  హీరో ప్రవర్తించడం ఒక బలహీనత . ఈ సీనులో సంభాషణలుకూడా బాగాలేవు. హీరో అక్క ఒకే ప్రశ్న అడుగుతుంది కానీ అక్కడ ప్రశ్నలు చాలా వేసే అవకాశం ఉంది.  బహుశా ఎంటీఆర్ తరువాత  సినిమా పేరు రూలర్ కావొచ్చు. రాజు డ్రస్ లో అలగ్జాండర్లా ఉన్నాడు.

నాసర్ దగ్గర ఉండే పురోహితుడు జూనియర్ని దీవించడానికి కారణం తెలియలేదు. జూనియర్నిదుష్టసంహారంచేసే నరసింహావతారంగా చూపడం, వైదిక పురోహితబృందం అతణ్ణి సపోర్టు చెయ్యడం,  నాసర్ని రాక్షసునిగా భావించి విలన్ల  నాశనం కోరేవారే వైదికమతస్థులని చూపాల్సినంత అవసరం లేదేమో. క్లైమాక్స్ ఫైటు కోసం నాసర్ తన వర్గంవారిని రుద్రాక్షలు ధరించిన శివసేన అధినేత వలే కత్తితో బొటనవేలు కోసుకొని ఆరక్తంతో తన కొడుకుకు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తే , ఎంటీవాడు మాత్రం వైదిక బ్రాహ్మణ సమూహంచే యజ్ఞయాగాదులు చేసి పుణ్యస్నానమాచరించి వారి దీవెనలతో ఉత్తమ బ్రాహ్మణగురువుచే స్పాట్ బొట్టు పెట్టించుకుంటాడు. చివరకు శైవంమీద వైష్ణవవిజయం సూచించినట్లనిపించింది. 
 
అశోకుణ్ణి గుండెలమీద గొడ్డలితో నరికితే తర్వాత చేతికి కట్టుకున్నాడు. 

 

ఫైటింగులు ఇది తేలుగు సినిమా అని గుర్తు చేసేలా ఉన్నాయి. సీనియర్ ఎంటిఆర్ ప్రవేశపెట్టిని కిలో రెండు రూపాయల పథకాన్ని- కిలో రెండు రూపాయల  పురుగులు పట్టిన బియ్యం  పధకమని , నీళ్ళు లేని ప్రాజక్టులని  వైయ్యస్సార్ పాలనని  కామెంట్ చెయ్యడం ఒక బలహీనతే. కలెక్టరు లొంగిపోవడం, ఫ్రాక్షన్ లీడరుకు మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు భయపడుతున్నారని చెప్పడం, మగ శిశువుల్ని చంపుతుంటే ప్రభుత్వఅధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం, అన్నీ దమ్ముతక్కువ పనులే.  కార్తీక పాత్ర రాజకుటుంబానికి తగినట్టుగా లేదు. అయితే వాస్తు పాట బాగుంది.
మరొక తప్పు ఏమిటంటే విలన్ పోలీసు ఎంటీఆర్ ఈ ఇంటి అసలు వారసుడు కాడని, ఒక అనాధ అని , హైదరాబాదులో  తనకు ఆవిషయం తెలుసని, ఈతణ్ణి ఎవరో దత్తత కూడా తీసుకున్నారని, అసలు వారసుణ్ణి చంపి ఆ చోటులో ఇతడొచ్చినాడని అందరిలో కొట్టడం అనే సీను బాగాలేదు. ఇదంతా ఇంటిలో ఉన్న సుమన్ విని బయటికి రావడం, చరిత్ర చెప్పడం కూడా ఊహించని పరిణామమే. సుమన్ చచ్చిపోయాడని అనుకుంటున్న ప్రేక్షకులకు సుమన్ తన ఇంట్లోనే దాక్కున్నాడని , పైగా ఆమెకు బొట్టుకూడా చెడిపి.... అని తెలిసి నప్పుడు  థూ .... అని ఉమ్మెయ్యాలని పించింది. కన్నతండ్రికి కూడా తెలియకుండా కొడుకును కోటాశ్రీనివాసరావు అనాధాశ్రమంలో చేర్చి పెంచడమనే క్రమంలో  కధ బాగా బలహీనపడిపోయింది. చేతులు వెనక్కి కట్టుకొని కూడా ఫైట్ చేసేంత నేర్పు వానికి ఎలా వచ్చిందబ్బా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోవలసిరావడం కూడా కథాపరమైన బలహీనతే. ఆ ఎంటీవాడి మనవడైయుండి ఈ మాత్రం కొట్టలేడా అని అనుకోవడానికి జనమంతా చెవుల్లో పువ్వులు పెట్టుకుని కూర్చున్నారనుకున్నా , క్లైమాక్సు బాగుంది. మంచి సందేశాత్మకంగా వుంది.
దర్శకుడు చిత్రాన్ని హడావుడిగా తీసినట్టుంది. ఎంటీవోడున్నాడు, హీరోయిన్ గా మంచి పేరున్న త్రిష ఉందీ, పాతతరం హీరో హీరోయిన్లుగా వెలిగిన సుమన్, భానుప్రియ ఉన్నారు, మరొక హీరో వేణు ఉన్నాడూ, నాసర్ , కోటాశ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖసుధాకర్ మొదలైన ప్రముఖ నటులున్నారు, కీరవాణి సంగీతం బాగుంది ఏదైనా కాస్తెకూస్తె అటూఇటైనా ఫరవాలేదనే దమ్ముతో కథమీద నిర్లక్ష్యంగా ఉన్న బోయపాటి శ్రీను గారికే మార్కులు తగ్గినవి.
Share this article :

2 comments:

  1. hahahahaha inta baagaa teeshaaraa ayyababoy Mayday veldham anukunnaa bathikincharu dhanyavaadamulu

    ReplyDelete
  2. చాల correct ga రివ్యూ వ్రాసారు.కానీ Climax సందేశాత్మకంగా వుంది అన్నారు కానీ అది కూడా వేస్ట్ ......అంత క్ర్రురుడు ఒకసారిగా మారడం ఏంటి ....

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||