గీకువీరుడు Greeku Veerudu Telugu Film Review

May 18, 2013



గ్రీకువీరుడు అనే సినిమా పేరుకూ సినిమాలోని కధకూ ఏమీ సంబంధంలేదు. ఏం? కథకూ, కథపేరుకు సంబంధం ఉండాలా అని కొందరికి సందేహం రావచ్చు. ఓ ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి వీధి దీపం వెలుగులో దేనినో వెదుకుతూంటే ఆ దారినపోయే ఓ వ్యక్తి ఆయన్ను దేనినకోసం వెదుకుతున్నారని అడిగాడట. ఆ వెదుకుతున్నవ్యక్తి ఆయనతో తన చిల్లర నాణ్యాలు కొన్ని ప్రక్క వీధిలో పడిపోయాయని వాటికోసం వెదుకుతున్నానని చెప్పాడట. మరి ఎక్కడో పడిపోతే ఇక్కడెందుకు వెదుకుతున్నారని అడిగితే . అక్కడ అంతా చీకటిగా ఉంటె ఎలా కనిపిస్తాయి ? అందుకే  అందుకే ఈ వీధి లైటు వెలుతురులో వెదుకుతున్నానని చెప్పాడట. అలా ఉంది ఈ సినిమా పేరు గురించి. ఇంతకు ముందు శోభనబాబు అనే నటుడు కూడా ఇలాంటి వింతలే చేసేవాడు.
ఎదుటివారు తనని గుర్తు పట్టకుండా ఉండడానికి తన నొసలు పైకి తన తల వెంట్రుకలను రింగులా ఉంచేవాడు. దానితో ఎవరూ ఆయన్ను గుర్తించలేకపోయేవారు. ఆ వారసత్వం పోకుండా ప్రేక్షకులపైకి వదలబడ్డ నిజమైన తెలుగు సినిమా గ్రీకు వీరుడు. నిజానికి గ్రీకు వీరుడంటే గ్రీకు లకు చేందిన లేక గ్రీసు దేశానికి చెందిన వ్యక్తి కధ కాదు. నిజానికిది గీకు వీరుడు. అంటే అమ్మాయి లను గీకుతూ ఉంటాడన్నమాట. గీకడమంటే అమ్మాయిలతో వ్యభిచారంచేసే వ్యక్తి. అంటే వ్యక్తిత్వంలేని వాడూ ,కేవలం విలాసాలకోసం వ్యభిచారంచేసే అమ్మాయిలతో వ్యభిచరించే వీరుడన్నమాట. ప్రేమ అన్నా వివాహం అన్నా ఇష్టంలేని వాడు, దాదాపుగా ప్రేమకు వ్యతిరేకి అయిన అటు వంటి గొప్పవ్యక్తి ఎలా ప్రేమలో పడ్డాడో చెప్పడమే దీనిలోని కధ. అంటే గీకే వీరుడు కాస్తా గీకలేని వీరుడు గా మారే క్రమమన్నమాట.  గతంలో కింగ్ అనే పేరుతో సినిమా తీసి నందున కింగ్ నాగార్జున అనే బిరుదు తగిలించుకున్నట్లుగానే, ఏదో సినిమాలో ఓ అమ్మాయి తన కలల రాకుమారుడుని గ్రీకువీరుడని ఊహించుకున్నందున , ఆమెను ఆ సినిమాలో ప్రేమించింది నాగూగారేగనుక నాగూయే గ్రీకువీరుడని మరో బిరుదును కూడా తగిలించేసుకున్నట్లున్నాడు. ఈ సినిమాలో గీకు వీరుడు  అనే పేరు కంటే గ్రీకు వీరుడనే పేరే వినడానికి గొప్పగా ఉంటుదని భావించారేమో  గ్రీకువీరుడని ఈ సినిమా పేరు పెట్టుకొనివుంటారని ఇందు మూలముగా నా అభిప్రాయము ను తమకు తెలియజేసుకుంటున్నాను. జై గ్రీకు భూమి.  పూర్వం ఓ రచయిత్రి కూడా ఇద్దరు ప్రేమికులు అపార్ధాలతో విడిపోయి, చివరకు కలుసుకున్నట్లు కధలు వ్రాసేవారు.  సహజ లక్షణాలు కొన్ని అపార్ధాల కారణంగా తొలగి పోయి చివరకు మరలా ఏర్పడడం. ఉదాహరణకు ఒక కుక్కయొక్క కధను సినిమా కధగా చెప్పుకోవాలంటే  విశ్వాసంగా ఇంటిని కాపలా కాయాల్సిన ఓ కుక్క కొన్ని పరిస్థితుల దృష్యా ఎలాగా దారితప్పి దొంగ కుక్కగా మారిందో ,తరువాత ఒక ఆడ కుక్క సహకారంతో మరలో విశ్వాసపాత్రమైన కుక్కగా ఎలామారిందో తెలియజేయడమే ఈ చిత్రం లోని కథ అన్నట్లుగా తయారైంది.

గీకు వీరుడు చిత్రంలో నాగార్జున గారు ప్రేమించడాన్ని ఇష్టపడడు.కానీ ఓ ఆడస్త్రీ స్నేహం వల్ల తన తప్పును తెలుసుకొని మంచి ప్రేమికుడిగా ఎలామారాడో ఈ సినిమా మనకు తెలియజేస్తుంది. ఇంకోలా చెప్పుకోవాలంటే 99మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని ఆ నూరవ అమ్మాయి ఎలా సరైన దారిలోకి తెచ్చిందో ఈ సినిమా మనకు తెలియజేస్తుంది. ఇలాగా ఎన్నయినా చెప్పుకోవచ్చు.
అమెరికాలో పెరిగిన ఇండియాసంతతికి చెందిన యువకునికి మంచి అలవాట్లకంటే చెడ్డ అలవాట్లే ఎక్కువ. అమెరికాలో చదివి పెరిగిన యువకుల పాత్ర చిత్రీకరణకోసం ఈ కేరెక్టర్ లో వెదకలేము. అమెరికాలోని యువత విశృంఖల జీవితాన్ని గడుపుతుంటారనే భారతీయుల నమ్మకం. ప్రేమమీద నమ్మకం లేని హీరో నటన వాస్తవానికి విలన్ నటన లాగా వుండాలి. అలా విలనిజాన్ని నాగార్జున చూపించలేకపోయాడు. శోభనబాబు మారు వేషంలాగా మనమే ఊహించుకోవాల్సివచ్చింది. తన కంపెనీలో పనిచేసే ఓ అందమైన అమ్మాయి తనను పెళ్ళి చేసుకోమని అడిగితే కాదంటాడు. తమ ఇద్దరి మధ్య శారీరక సంబంధం వున్నది గనుక పెండ్లి చేసుకోమని బ్రతిమాలినా హీరో అంగీకరించడు. ప్రేక్షకులు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఆమె హీరోయిన్ కాదుగాబట్టి. ఆడపిల్లలు డబ్బుకోసం ఏపనైనా చేస్తారని సందేశం ఇవ్వాల్సినంత అవసరం లేకపోయినా కామిడీ కోసం బహుశా ఇలాంటి సీన్లు పెట్టివుంటాడు దర్శకుడు.

ఇక నాగార్జున కంపెనీ గురించి చూద్దాం. వీళ్ళది ఏవైనా ఫంక్షన్లు, ప్రోగ్రాములకు అవసరమైన పనులు చేసిపెట్టే ఈవెంట్ సంస్ధ. ఏవైనా పెళ్ళిళ్ళకు, బర్తడే ఫంక్షన్లకు ఇన్విటేషన్ కార్డుల ప్రింటింగు మొదలు వంటవాళ్ళను ,కేటరింగు వాళ్ళను ఏర్పాటు చేయడం ఇలా అన్ని పనులు చేసే సంస్థ అన్నమాట. ఒక సేవా సంస్ధ వారి ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు అంటే ప్రదర్శనకు అనువైన స్ధలాన్ని మాట్లాడడం, కరపత్రాలు ముద్రించి ప్రచారం చెయ్యడం, స్టేజీ అలంకరణ, సౌండ్ సిస్టం, కూర్చీలు మొదలైన అద్దె సామాగ్రిని తెచ్చి అమర్చుట, టిక్కెట్లు అమ్మిపెట్టుట ఇలాంటి సేవలు చేసినందుకు కొంత డబ్బు తీసుకుంటారు. వారికి తగినంత కలెక్షన్ రాకపోయినా , వారకి నష్టం వచ్చినాగానీ తమకేమీ సంబంధం లేదని, తమకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని అగ్రిమెంటు వ్రాసుకుంటారు. సినిమాలో ఈ అగ్రిమెంటును మార్చి , ఒకవేళ నష్టం గనక వస్తే మేమే మీకు నష్టపరిహారం చెల్లిస్తామని తమ సంస్థలో పనిచేసే క్లర్కు మార్చినందువల్ల నష్టం వచ్చింది గనుక డబ్బుకట్టమంటారు. కూలి వాని చేత పని చేయించుకొని వాడ్నే డబ్బుకట్టమనడం ఏమిటి? దానిని అమెరికా కోర్టులు సమర్ధించడమేమిటి? 5 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఒత్తిడి చేయడమేమిటి ? 25 కోట్ల రూపాయలు కట్టాలనడమేమిటి? వ్యాపారం అంటే కోట్లలోనే అంకెలుండాలా?

ఇక ఇండియా చట్టాల గురించి చూద్దాం. నాగార్జున తాత విశ్వనాధ్ . తాత ఆస్ధికి మనవడు వారసుడుగదా. అన్ని సినిమాలు తీశాడుగదా ఆయనకు ఆ మాత్రం తెలియదా? ఆస్తి ఎవరెవరిపేరనో ఎలారాస్తాడు? ఎలాచెల్లుతుంది?
  ఈ సినిమాలో హీరోయిన్ కూడా హీరోకి తగ్గట్టుగానే ఎవరికైనా ఆఖరికోరికలుంటే వాటిని తీర్చడానికి కృషి చేస్తుంది. దాదావు ఓ వెయ్యి కిలోల బరువుంటుందేమో కూర్చుంటేనే ఫోను పగిలిపోతుంది. హౌ?
కొద్దిసేవు తనకు భార్యగా నటించడానికి ఒప్పకుంటుంది. ఎలా? హౌ? క్లైమాక్స్ లో నాగార్జున చేసిన ఫీట్లు ఇది తెలుగు సినిమా అని బలంగా బాది గుర్తుచేసింది.    

నారాయణ కామిడి ఫరవాలేదు.పాటలు బాగున్నాయి. ఓనాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూవుండంగా అనే పాట ఆహ్లాదకర సన్నివేశాన్నిచూపింది. నేనిన్నది నిజమేనా అనే పాటలో చరణ్ స్టెప్పులు కామిడీగా వున్నాయి. ఓ జూనియర్ని అనుసరించాల్సినంత అవసరంలేదేమో.


విలన్లను గురించి చూస్తే కోటా శ్రీనివాసరావు, ఆషిస్ విద్యార్ధి పాత్రలు విలన్ కు తగిన పనులు చేయడానికి చాలినంత సందర్భం లేదనిపిస్తుంది.  బ్రహ్మానందంతో విలన్ పనులు చేయించడం- కింగ్ సినిమాలోలా –పెద్దగా పేలలేదు.
నాగబాబు, శరత్ కుమార్ వంటి హీరోలకు కూడా ఒకటి రెండు డైలాగులతో సరిపెట్టాల్సివచ్చింది. వేణుమాధవ్, ఆలీ, నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జయప్రకాష్ రెడ్డి వంటి గొప్పనటులకు సరైనదీ వారిస్థాయికి తగినదీ కానప్పటికీ బలవంతంగా నటింపజేసినట్లుంది. కింగ్ చిత్రంలో కూడా ఇలాంటి టెక్నిక్కునే వాడినట్టంది. ఏదిఏమైనా ఈ పాత్రకు ఇతడు/ఈమె కాకుండా అతడు/ఆమె అయితే బాగుండేదన్నఅవసరం లేకుండా నడిచింది సినిమా. ఏమంటారు?
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||