గుండెజారిగల్లంతయ్యిందే Film Review

May 9, 2013





గుండెజారి గల్లంతయ్యిందే అనే సినిమా టైటిల్ చూస్తేనే ఇదొక ప్రేమకధ అని తెలుస్తుంది. కానీ ప్రేమను కొత్తరకంగా చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. దానిలో 60శాతం విజయం సాధించాడు. ప్రేమకధలన్నీ ఇలాగే జరిగి తీరాలనే నిబంధనలు లేనికారణంగా ప్రేమ కధలతో సినిమా తీయాలనుకున్నప్పుడు సందేహించ కూడదు. అంటే ఈ విధంగా ప్రేమ కధ ఎక్కడైనా ఉంటుందా? ఉండదేమో... ఉండొచ్చేమో... ఏమో... ఇలా డైలమాలో పడిపోకూడదు. ఒక కధను ఎన్నుకున్నతర్వాత మహేష్ బాబు చెప్పినట్లు మైండ్ లో ఫిక్సయితే బ్లైండుగా వెళ్ళిపోతా అని నిర్భయంగా దూసుకెళ్ళాలి. జనానికి నచ్చుతుందో లేదో... హీరోకి చెడ్డపేరొస్తుందేమో... ఇలా అనేక విధాలుగా భయంతో, సంకోచంతో, ఆందోళనతో నిజంగా గుండెజారి గల్లంతవుతుందేమో నన్నట్లుగా తీసిన సినిమా గుండెజారి గల్లంతయ్యిందే.
హీరో అభిప్రాయంలో లవ్ అనేది ఎప్పుడు కలుగుతుందో గుర్తుపట్టడం ఎలాగో చెబుతూ ఏ అమ్మాయి నవ్వితే తన గుండె వైబ్రేట్ అవుతుందో ఆ అమ్మాయే తాను ప్రేమించడానికి తగినదని చెపుతాడు. అటువంటి అమ్మాయి కోసం తాను ఎదురు చూస్తున్నానని చెబుతాడు. చివరికి ఓ అమ్మాయి ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూంటే మన హీరోగారికి గుండె వైబ్రేషన్స్ స్టార్టవుతాయి. సెల్లుతో ఆఅమ్మాయి ఫొటోతీసి , తన స్నేహితుడికి పంపి ఆఅమ్మాయి ఫోన్ నంబరు కనుక్కొని చెప్పమంటాడు. ఎందుకో తెలియదుగానీ ఆఅమ్మాయి పేరు, ఇతర వివరాలు తెలుసుకోవాలనుకోడు. స్నేహితుడు చెప్పిన ఫోన్ నంబరు సహాయంతో ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడుగానీ ఆమెపేరు శ్రావణి అని తెలుసుకోలేడు, ఆమె తండ్రిపేరు ఇతర వివరాలు తెలుసుకోడు, తన స్నేహితునితో చర్చించడు. బహుశా తెలుసుకుంటే గుండెజారిపోతుందేమో.
 అలాగే హీరోయిన్ కు తాను ఎటువంటి వాడిని ప్రేమించాలనుకుంటుందో చూద్దాం. లవ్ చెయ్యడం తప్పుకాదు  ముక్కూ మొహం తెలియని వాడితో ఫేస్బుక్కులో ప్రేమలోపడడం తప్పు. సంపత్సరాలుగా ప్రేమించుకున్నా చివరకు అది సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు. అలాంటిది ఒక వారంరోజులు ఫేస్బుక్కులో ఛాటింగ్ చేసుకొని ప్రేమించుకోవడం ఎలా సాధ్యమౌతుంది అని తన స్నేహితురాలు అంటే,  ప్రేమకు ఇంతకాలమని ఎక్కడాలేదు. ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అవ్వొచ్చు. నా ఫాంటసీ ఏమిటంటే  ఒక ఫర్ఫెక్టు గై దొరకాలి. నేనంటే పడి చచ్చిపోయేలా వుండాలి. వాడి పిచ్చిప్రేమ చూసి నేను పిచ్చెక్కిపోవాలి. నన్ను ప్రేమించేవాడు నన్నునన్నుగా ప్రేమించాలి నన్ను చూడకూడదూ...కలవకూడదు. నా బేగ్రౌండ్ నాపేరు, నా స్టేటస్ ఏం తెలియకూడదు. ఏంతెలియకపోతే ఎందుకు ప్రేమిస్తాడు అంటే నా మనసును చూసి ప్రేమించాలి అని  హీరోయిన్ అంటుంది. అది అసాధ్యమని స్నేహితురాలంటుంది. దర్శకునికి కూడా అది అసాధ్యమేమోనని గుండె జారిపోతూఉంటే దాన్ని జారిపోనీకుండా తీవ్ర ప్రయత్నం చేశాడు.
నిజానికి నిత్యామీనన్ కంటే ఈషా తల్వారే బాగుంది. నితిన్ కి ఈడూజోడుగా చూడముచ్చటగా ఉంది. అందం అభినయం తో పాటుగా మంచి నాట్యం చేయగల ఈషాతల్వార్ తో డ్యూయట్ట్ మరీ చప్పగావుంది. ఆమె నాట్యంచేస్తే నితిన్ కాగిపోతాడని దర్శకుని అభిప్రాయంలావుంది. ఆమె పాత్ర చిత్రీకరణ బాగాలేదు.  ఆమెను మంచి శృంగార ఘట్టాల్లో లాంగ్ షాట్ లో చూపారు. ఇద్దరు హీరోయిన్ల హెయిర్ ష్టైల్ కూడా పూర్తి తేడాగావుంది. హీరో నితిన్ సక్రమంగా అవగాహన చేసుకోలేకపోవడం, ఈషా తల్వార్ చేత ఈసడించుకోబడడం, తిట్టించుకోవడం హీరో పాత్ర కు తగినదిగాలేదు. కామిడీ యాక్టర్ స్థాయికి దిగిపోయింది.

 స్నేహితుని పొరపాటు కారణంగా ఈషా తల్వార్ అనుకొని నిత్యామీనన్ తో ఫోనులో మాట్లాడుతూవుంటాడు. తన స్నేహితుడైన మధూ, ఈషా తల్వార్ ఒకరినొకరు  ప్రేమించుకోడానికి సహాయపడతాడు. తరువాత ఓ రోజు తాను ప్రేమిస్తున్న అమ్మాయినే తన స్నేహితుడు ప్రేమిస్తున్నాడని తెలుసుకొని, తమ ప్రేమ విషయం చెప్పి, ఆలీతో సాక్ష్యం చెప్పించి వాళ్ళకు నచ్చజెప్పబోతాడు, ఆమ్మాయిలను నమ్మకూడదని , ఆమె మరొకరితో డేటింగ్ చేస్తుందని ఈషా తల్వార్ ను అనేక విధాలుగా అవమానిస్తాడు. చివరికి తన తప్పు తాను తెలుసుకున్న తర్వాత కూడా ఆమెకు సారీ చెప్పడు. చివరికి ఓ రోజు ఈషా తల్వారే వచ్చి తాను నితిన్ ను ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఈ విథంగా ఓ మంచి అమ్మాయి చేత తెలివి తక్కువ పనులు చేయించాడు దర్శకుడు.

ఇక హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే చాలావుంది. తనకు నితిన్ గురించి అన్ని విషయాలు తెలుసు. హీరోని ముప్పతిప్పలు పెట్టి ఈ సినిమాలో విలన్ లేని లోటు తీరుస్తుంది. బంగారం తనకి ఫోన్ చేసి బెదిరించిందని, నితిన్ కు మాయమాటలు చెబుతుంది. హీరోని అనేక విధాలుగా బాధ పెట్టాలని చూస్తుంది. మొత్తంమీద దర్శకుడ్ని, కెమేరామాన్ ని ,హీరోని, ఇలా అందర్నీ డామినేట్ చేసింది నిత్యామీనన్.

అలాగే ఐటంసాంగ్ చేసిన బాట్మింటన్ ప్లేయర్ గట్టా జ్వాల గారిని సరిగా చూపలేదు. క్లోజప్ లో ఆమెను చూపనేలేదు. ఐటం సాంగ్ లో నిత్యామీనన్ ను బాగా క్లోజప్ లో చూపించారు. ఎన్నో ఆశలతో ఐటం సాంగ్ లో నటించిన జ్వాలకు తీరని నష్టం జరిగిందని చెప్పవచ్చు. రెండుఫైట్లు ఉన్నాయి కానీ అవి ఈ కామిడీ చిత్రానికి తగినట్లుగా లేవు.
నితిన్, నిత్యామీనన్ ల జంట బాగాలేదు. చిన్నపిల్లతో ఆడుకున్నట్లుంది. వాళ్ళ జోడీని అందంగా చూపించడంలోనే కెమేరా మేన్ తన దృష్టిని నిలిపి ఇతర పాత్రలను పట్టించుకోలేదు. హీరో పాత్ర చిత్రీకరణ, తల్వార్ పాత్ర చిత్రీకరణ బాగాలేదు. హీరో,హీరోయిన్ ల తల్లిదండ్రుల పాత్రలు నిరుపయోగంగా ఉన్నాయి. క్లైమాక్స్ కోసం కథను దాచినట్లుంది. తాగుబోతు రమేష్ బాగా నవ్వించాడు. కామిడీకోసం మూడోప్రకృతి జీవిని ప్రవేశపెట్టవలసినంత అవసరం కనిపించలేదు. ఈ సినిమా పిల్లలకు, ఆడవారికి బాగా నచ్చుతుంది.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||