తెలుగులో విద్యా బోధన ఎందుకు

Jun 24, 2008

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మనదేశంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు ప్రవేశపెట్టింది. మాతృభాషలోనే బోధన జరగాలని మనం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వొప్పించాం. ఫలితంగా ఆయా రాష్టాల్లో ఆయా మాతృభాషల్లోనే విద్యాబోధన జరిగింది. స్వాతంత్ర్యానంతరం మన మాతృభాషల్ని మనం సుసంపన్నం చేసుకోవడానికి ప్రయత్నిచాలి. అంతేగానీ ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రవేశపెట్టకూడదు.
మాతృభాషలోనే విద్యాబోధన జరిగితే విషయం (subject) బాగా అర్ధం అవుతుంది. అదే ఇంగ్లీషు మీడియంలో చదివిన పిల్లలకు కంటెంటు అర్ధంకాదు. ఇంగ్లీషు మీడియం లో చదివితే ఇంగ్లీషు బాగా మాట్లాడగలుగుతారనే నమ్మకం మనలో చాల మందిలో ఉంది. కానీ ఇంగ్లీషులో బాగా మాట్లాడగలగడానికి, ఇంగ్లీషు మీడియంలో చదువునేర్చుకోవడానికి సంబంధం లేదు. ఇంగ్లీషు మీడియంలో చదివినవారినీ , మాతృభాషా మీడియంలో చదివినవారినీ పరీక్షించి చూసినప్పుడు మాతృభాషా మీడియంలో చదివినవారికి పాఠ్యాంశాల విషయఅవగాహన బాగా ఉందని తెలిసింది. మన ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు నిజానికి కోళ్ళఫారాల్లాగుంటాయి. తెలుగు మీడియంలో అరకొరగా చదివినవారే బోధకులు. వారే ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడలేరు. ఇక పిల్లలకేం చెప్పగలరు? -కేరళ ఉపాధ్యాయులచే బోధన- అని ప్రకటనలు ఇస్తూవుంటారు. వారి ప్రొనౌన్షియేషన్ చాలా తప్పులతడక. వారికి కొన్ని పదాలు పలకవు. వాస్తవానికి ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యం వలన గాక, యాజమాన్యం వారి సమర్ధత ద్వారా ప్రయివేటువారికి పేరు వస్తుంది. ప్రయివేటు యాజమాన్యాలవారి ఎత్తులు జిత్తుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదని భావిస్తున్నాను.
అయితే కొన్ని కార్పోరేట్ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చక్కని బోధన జరుగుతుంది. ఆ పాఠశాలల్లో సీటు దొరకడం చాలా కష్టం. మూడున్నరేళ్ళ వాడు ఇంగ్లీషు మాతృభాషగా గల వానివలే ఇంగ్లీషులో మాట్లాడగలిగి వుండాలి. బహు కఠినమైన ఇంటర్వ్యూను ఆ చిన్నారులు ఎదుర్కొనాల్సివుంటుంది. అతని పేరు పిలవగానే తన తల్లిదండ్రులను వదలి ఒక్కడే ప్రిన్సిపాల్ గదిలోనికి వెళ్ళాలి, ఇంగ్లీషులో ఆ ప్రిన్సపాల్ గారితో మాట్లాడాలి. ఆల్ఫాబేట్సూ, నంబర్లూ, కలర్సూ చెప్పగలిగివుండాలి. ఆ ఇంటర్వ్యూలో నెగ్గితేనే – సీటు. చూడండి. ఆ వయసులో ఆబాలుడి పోరాటం. దానికై ఆ తల్లిదండ్రులెంత డ్రిల్లింగ్గిచ్చారో. ఒక పశువుకి సర్కస్ ఫీట్లు నేర్పడంకన్నా ఇది మరింత ఘోరం.
కనుక తెలుగు మాతృభాషగా గలవాడు ఇంగ్లీషు మీడియంలో చదవలేడు, ఒకవేళ చదివినా పాఠం అర్ధంకాదు. శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించినప్పుడు మాతృభాషా మాధ్యమంలో చదివినవారు చక్కని అవగాహనా నైపుణ్యము గలవారిగానూ, విద్యావంతులుగానూ తయారౌతుండగా – ఇమాజినరీ ఇంగ్లీషు మీడియంలో చదివినవారు విషయ జ్ఞానశూన్యుడై, బైహార్టు చేసి , పరీక్షలలో గట్టెక్కేవారుగావుంటున్నారు, అందువలన 1వ తరగతినుండి 10వ తరగతి వరకు గణితం, సైన్సు, సోషలు సబ్జక్టులు మాతృభాషలోనే బోధించాలి. ఆంగ్లభాషను ‘ డిస్కోర్సు మెథడులో ’ బోధించితే వారు ఇంగ్లీషు భాషను చక్కగా, అనర్గళంగా మాట్లాడగలిగేవారుగా తయారౌతారు.
కనుక ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషుమీడియం లో బోధించాలనుకోవడం ప్రజలకు మేలు చేస్తున్నామని భ్రమపడి, వారికి కీడు చేయడమే. బాలల విద్యాహక్కును నిరాకరించబోవడం ప్రాథమిక హక్కుల వుల్లంఘనే అని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.
State సిలబస్ లో పాఠాలు మన రాష్ట్రానికి సంబంధించినవి, ఉదాహరణకు- మన రాష్ట్రం, ఉనికి, మన ఆహారపుటలవాట్లు, పంటలు, మన పండుగలు ఇలా... వుంటాయి. అదే సెంట్రల్ సిలబస్సయితే మన దేశానికి సంబంధించి పాఠాలుంటాయి. State సిలబస్ లో తెలుగు మీడియంలోని పాఠాలే ఇంగ్లీషులోకి ట్రాన్సిలేట్ చెయ్యబడి వుంటాయి.కనుక టీచర్లు తేలిగ్గా చెప్పగలమసుకుంటారు. అదే సెంట్రల్ సిలబస్సయితే క్రొత్త పాఠాలు , క్రొత్త మీడియమాఫ్ ఇన్సష్ట్రక్షన్ , ఇన్నాళ్ళూ తెలుగు మీడియంలో చదివి, తెలుగు మీడియంలో చెప్పి, ఇప్పుడు, ఇంగ్లీషు మీడియంలో కొత్త పాఠాలు చెప్పమంటుందీ ప్రభుత్వం, వాఁ..... అంటూ వారంరోజుల్లో ఇంగ్లీషులో బోధించడం నేర్చుకొని ఈ వయసులో ఎలా చెప్పాలో తెలియక కొందరు టీచర్లు జుట్టు పీక్కుంటున్నారు.
Share this article :

16 comments:

  1. మీ వ్యాసం బాగుంది. అయితే, అసలీ వ్యాసం ఎందుకు రాయవలసివచ్చిందో కొంత ఉపోద్ఘాతం రాసి ఉంటే మరింత బాగుండేది. చాలామంది పాఠకులకు ఆంప్ర ప్రభుత్వం వారి ఇటీవలి ఉత్తర్వు గురించి తెలిసి ఉండకపోవచ్చు కదా.

    నన్నడిగితే, మన రాష్ట్రంలో అన్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలోనూ తెలుగు తప్పనిసరిగా ఓ పాఠ్యాంశంగా చేర్చాలనే నిబంధన ఉండాలంటాను. మన ప్రభుత్వం వారిదంతా రివర్సు బేరం. తెలుగు మీడియం స్కూళ్లలో ఇంగ్లీషులో బోధించమనటమేమిటి? తమిళులని చూసి ఈ విషయంలో నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది.

    ReplyDelete
  2. అవును.మన స్కూల్స్ లో పిల్లలు 3 భాషలు నేర్చుకోవాల్సివుంటుంది. మరి ఉత్తరాది రాష్ట్రాల వారైతే 2 భాషలు చదివితే సరిపోతుంది. మరి మన రాష్ట్ర పాలకులు మనకీ భారం ఎప్పుడు దించుతారో ...

    ReplyDelete
  3. అబ్రకదబ్ర గారు,
    ఈ టపాకి ఉపోద్ఘాతంగా మాస్టారి ముందు టపాకు నేవ్రాసిన కామెంటును గమనించగలరు.
    మాస్టారు,
    మాస్టారు, ఇక్కడ నా అభిప్రాయలన్ని వ్యక్తిగతంగా మీపైన కావనీ, మీరు లేవనెత్తిన అంశంపై నని దయచేసి భావించగలరు.


    మాతృభాష వేరు, శాస్త్రీయ పరిజ్ఞానం వేరు. ఇంగ్లీషు అనెడిది మన మాతృభాష కాదు. మాతృభాషలో మనకుండేటి పట్టు పరాయిభాషలో ఉండవు. ఇవన్నీ సత్యాలే.
    కానీ ఈ రోజు ఇంగ్లీషు భాష ప్రపంచభాష. ప్రపంచమే ఒక కుగ్రామంగా అయిపోతున్నటువంటి ఈ రోజులలో, ప్రపంచ పరిజ్ఞానానికి మనం ఓపెన్ కావాలంటే తప్పని సరిగా ఇంగ్లీషు పరిజ్ఞానం ఉండాలి. దీన్ని కాదనే వారు, కూపస్థ మండూకాలు.

    మాతృభాషలో చదివిన వారికి విషయ అవగాహన బాగా ఉందని తెలిసింది అంటున్నారు, అంటే వీరు చాలా తెలివైన విద్యార్ధులని ఒప్పుకుంటున్నారన్నమాట. వీరిని అంతర్జాతీయ భాషకు ఎక్స్పోజ్ చెయ్యండి, ఆ స్థాయిలో అద్భుతాలు సృష్టించగలరు.

    ఇంగ్లీషు మీడియం స్కూళ్లు కోళ్ల ఫారాల లాగ ఉంటాయి అనటం మీ వ్యక్తిగతమైన కామెంటులా కనిపిస్తుంది. మరి అలాంటి కోళ్ల ఫారాలలో చదువుకొని, ఈ రోజు ప్రపంచంలో వివిధదేశాలలో ఉద్యోగాలు చేస్తూ, ఈ తెలుగు బ్లాగులలో తెలుగు వ్రాస్తున్న ప్రవాస భారతీయులందరూ, అలాగవచ్చినవారేగా. ప్రభుత్వ దుంపల బడిలో తెలుగుమీడియంలో చదువుకొని, (డిగ్రీ వరకూ కూడా) నేడు అమెరికాలో ఉంటున్న వారి ఎవరిపేర్లైనా చెప్పగలరా? (అమెరికాకు వెళ్లటమే వికాశం కాకపోవచ్చు, కానీ దాన్ని సూచికగా తీసుకోవచ్చుగా)
    కేరళ ఉపాధ్యాయులు, ఆంగ్లోఇండియనులు అనేవి, ప్రైవేటు కాంన్వెంట్లు ఆడిన జిమ్మిక్కులు. ప్రస్తుతం అలాంటి ట్రెండు నడుస్తుందని అనుకోను. ఇప్పుడు ఇంగ్లీషు మీడియం లలో చదువుకొని, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తరం వచ్చేసింది. ఇక ఆంగ్లో ఇండియన్ల, కేరళ టీచర్ల అవసరం మనకు లేదు. (పల్లె టూర్లలో తప్ప )
    సిలబస్ మారటం వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పలే్డనటం, వారిని అవమానించటమే. ఎందుకంటే, ఇక్కడ ఉద్యోగం రానివాడే ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీషులో చెప్పగాలేనిది, సమాజాన్ని మెప్పించగా లేనిది, వీరు చెప్పలేరు వీరివల్ల కాదు అని అనటం డిఎస్.సి. లో మెరిట్ లో సెలెక్ట్ అయిన వీరి ఆత్మగౌరవాన్ని కించపరచటమేనన్న విషయం ఎప్పటికి తెలుసుకుంటారు?

    విద్యాధికులైన తల్లితండ్రుల సంతానానికే ప్రైవేటు కాన్వెంటులో సీటు దొరకటం కష్టమంటున్నారే, మరి ఒక రిక్షాపుల్లర్, ఒక రైతుకూలీ, ఒక దినసరి కార్మికుడి పిల్లలకు అటువంటి కాన్వెంటులలో సీటుదొరకగలదా (ఆర్ధిక విషయాలు పక్కనపెట్టండి). మరి వారి పిల్లలు ఇంగ్లీషులో విద్యనభ్యసించటానికి అవకాశం ఇక ఈ జన్మలో వారికి రాదా? మాతృభాషలోనే వారు చదువుకోవాలా? (అంటే ఒరేయ్ అబ్బాయిలూ మీరు ఉన్నతచదువులకు అర్హులు కారని ముందే నిర్ణయించేయటం కాదూ?
    " కనుక తెలుగు మాతృభాషగా గలవాడు ఇంగ్లీషు మీడియంలో చదవలేడు, ఒకవేళ చదివినా పాఠం అర్ధంకాదు" అని అంటున్నారు మరొక్క సారి చదువుకున్నారా ఈ వాక్యాన్ని. ఎంతవికృతంగా ఉందో?
    ఇటువంటి అర్ధరహిత భావజాలాన్ని, ప్రచారం చేయవద్దు.
    తెలుగు మీడియంలో చదివిన వాడికి ఎప్పటికీ ఇంగ్లీషు ఒక హేండీ కేప్ గానే ఉంటుంది. తప్ప ఇంగ్లీషు మీడియంలో చదివిన వాడికి విషయ పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది అనుకోవటం, అమాయకత్వం. భారతదేశం యొక్క బలం, బలహీనత ఏమిటంటే, ఒకె వ్యక్తి మూడు, నాలుగు భాషలను నేర్చుకోవలసి రావటం.

    తెలుగు భాష పట్ల గొంతుచించుకొని వాదిస్తున్నవారు, వారి వారి పిల్లలను ఎందుకు ఇంగ్లీషు మీడియంలలో చదివిస్తున్నారు? (ఒకలిద్దరు ఎక్సెప్షన్లు ఉండొచ్చు, నేమాట్లాడేది జనబాహుళ్యం గురించి). ఎందుకంటే చెప్పేవి శ్రీరంగ నీతులు్........ అనే విధంగా.

    వ్యాసంలోని చివరి పేరాగ్రాఫును చూసినట్లయితే, నా కనిపించేదేమిటంటే, పాఠాలు చెప్పలేకే ఇంగ్లీషు మీడియం ని వ్యతిరేకిస్తున్నారేమోనని. ఇంగ్లీషు మీడియంలో భోధించాలనుకోవటం ప్రజలకు ముమ్మాటికీ మేలుచెయ్యటమే అని నా అభిప్రాయం.


    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. @బాబా గారికి

    తెలుగు మీడియంలో చదివి అమెరికాలో స్తిరపడిన వారి పేర్లు అడిగారు కనుక చెబుతున్నాను, మా భందువుల్లో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళలో సగం మంది ఇలా తెలుగు మీడియం లో చదువుకుని ఐటి బూం తో అమెరికా పోయిన వాళ్ళే ....

    ఇక పోతే మీరు చెప్పినట్టు ... పేదలు - ఇంగ్లీష్ చదువులు విషయానికి వస్తే .. ఎంతమంది పేదల పిల్లలు ఆ ఉచిత బళ్ళలో చదువు పూర్థిగా కొనసాగిస్తున్నారు ...?? అలా చదివి పైకి వచ్చిన వారిలో ఎంతమందికి ఇంగ్లీష్ రాలేదు .... బాగ చదివే పేద విధ్యార్ధికి ఇంగ్లీష్ ఒక సుభ్జెక్త్ గానె వుండి రాణిస్తున్నాడు .... చదవని వారు మధలో మానివెస్తున్నారు ...

    కనుక మధ్య తరగతి పేదల స్థాయిలో ఇంగ్లీష్ భోధన చేస్తే ... తల్లి ఒక ప్రాధమిక గురువు అన్న గొప్ప భావనను పిల్లవాడికి దూరం చేసిన వారవుతారు ... ఎందుకంటే ..... ఈ రెండు తరగతులకు చెందిన పిల్లలు పరిసరాలనుండి , తమ తమ తల్లి డడండ్రుల నుండి విషయపరిఘ్రహణ శక్ఠి, వివేకం, వ్యక్థిత్వం వణ్తి వాతితోబాటు ... అనేకం నేర్చుకుంతారు ... ఒకటి నుంచి ఐదు వరకు చదివే పిల్లలకు పరిసరాలు - తలిదణ్ద్రులు - ఆ స్తయిలో వుదే పర్యవేక్షకులు మాత్రమే ఎక్కువ షాతం ఉపయోగ భొదన చేస్తారు ... కనుక ... భారత సంస్క్రుతి సాంప్రదాయం మాట అటుంచితే ...... మొదటికే మోసం వాస్తుండి .......


    Finally .... that boy thinks like " Todays problems are yesterdays short sited solutions ...."

    ReplyDelete
  5. what i asked is those who studied upto Degree in telugumedium, not upto tenth class. if you consider this your list may shrink down.

    your views are idealistic but not practical. refer my comment to master's previous post sir.

    what i wish to say is english medium doesnot hinder character building (by putting this argument forward, are insulting all those who studied in english medium. according to your views all these people should be characterless fellows. are you ready to accept this?)
    with regards.

    ReplyDelete
  6. బాబాగారి మాటల్లో అవసరం,ఆర్తి వినిపిస్తే చంద్రమౌళి వాదనల్లో అలౌకిక ఆదర్శం వినిపిస్తున్నాయి. నా ఓటు మాత్రం అవసరానికీ,ఆర్తికే.

    ఇంగ్లీషు చదువులు అవసరమే కానీ, అవి ప్రవేశపెట్టడానికి ఒక పంధా అవసరం అని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రభుత్వం చేసిన నిర్ణయం కొంత అవసరమైతే,మరికొంత వారి ఆర్థిక సౌలభ్యం కారణం.

    ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యలేక చాలా మంది ప్రైవేటు వాటికి వలస పోతున్న నేపధ్యంలో, ఈ నిర్ణయం జరిగినా,సెంట్రల్ సిలబస్ వెనుక ఉన్నది ఆర్థిక కారణమే అని గ్రహించాలి. ఈ CBSC సిలబస్ పెడితే కేంద్రప్రభుత్వం 12వ తరగతి వరకూ కొన్ని రాయితీలూ,ఫండ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అవి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపరిస్థితుల్లో చాలా అవసరం.

    ఇక పంధా గురించి మాట్లాడితే, చంద్రమౌళిగారి బాధ సహేతుకం కాదు అనిపిస్తుంది. ఆంగ్ల మాధ్యమం 6 వ తరగతి నుండీ ప్రవేశ పెడుతున్నారేకానీ 1 నుండీ కాదు కదా? 5 వతరగతి వరకూ దర్జాగా తెలుగు,ఆంగ్ల,హిందీ భాషలు (three language formula) నేర్చుకుని 6 కొచ్చేసరికీ ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోవచ్చు అది పెద్ద సమస్య కాదు.తెలుగుకీ,సంస్కృతికీ వచ్చిన డోకా ఏమీలేదు.

    ఉదాహరణకి నవోదయ విద్యాలయం లలో తెలుగు మీడియం నుండీ వచ్చిన విధ్యార్థులకు 6-7-8 తరగతులలో ఆంగ్లం నేర్పి 9 నుండీ ఆంగ్లమాధ్యమంలోకి మార్పించి 10-11-12 తరగతులు (CBSC) లో బోధన చేస్తారు. అక్కడ తెలుగు భాషకొచ్చిన ప్రమాదమేమీ ఇప్పటివరకూ లెదు. దానికి సజీవ ఉదాహరణ నేనే!

    సక్రమంగా అమలు చేస్తే ఈ నిర్ణయం భావి తరాలకు చాలా ఉపయోగకరమని నా నమ్మకం.

    ReplyDelete
  7. Your blog is classified as adult content - please verify the settings.

    ReplyDelete
  8. అవునండీ. నేను లాగినైన ప్రతిసారీ వార్నిగ్ మెసేజ్ అంటూంది. నేనేమైనా సెట్టింగ్సలో మార్పులు చేసానేమోననుకుంటున్నాను. దీన్ని ఎలా సరిచేసుకోవాలో కాస్త చెప్పండి.

    ReplyDelete
  9. బాబాగారు,మహేష్ గారు,ఇంకా ఇతర మిత్రులు ఈ అంశం మీద బాగా ఆలోచించి చెప్పినట్లుగావుంది.నిజానికి 75 శాతం మంది టీచర్లు ఇలాగే ఆలోచిస్తున్నారు. చంద్రమౌళిగారు మాతృభాషామాధ్యమంలో బోధనలో తల్లి పాత్ర, సమాజం పాత్ర గురించి చక్కగా వివరించారు. అవును.నిజమే. ఈ వ్యాసం గురించి కొంత ఇంట్రడక్షన్ యిచ్చివుంటేనే బావుండేది.మాతృభాషామాధ్యమంలో బోధన అనే అంశంపై టీచర్లు 4 రకాలుగా అభిప్రాయ పడుతున్నారు. 1) మాతృభాషలోనే బోధన జరగాలనే వారు , 2) ఆంగ్లభాషామాధ్యమంలో బోధన జరపవచ్చు కానీ అది state సిలబస్ లోనే ఉండాలి అనేవారు, 3) ఆంగ్లభాషామాధ్యమంలో బోధన జరపవచ్చు కానీ అది సీబీయస్సీ సిలబస్ లోనే ఉండాలి అనేవారు, 4) ఆంగ్లభాషామాధ్యమంలో బోధన జరపవచ్చు అది CBSC అయినా, STATE సిలబస్ అయినా ఫరవాలేదు అనేవారు . ఇక్కడ కూడా మా అభిప్రాయాలను అనుకూలించేవారూ, వ్యతిరేకించేవారూ ఉన్నారు.ఇంగ్లీషు మీడియం కాన్వంటుల్లోని పిల్లలు పాఠాన్ని సరిగా అవగాహన చేసుకోలేరనే విషయంపై ఒక వివరణ. మినిమం లెవల్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రకారం ఆయా తరగతుల్లో కొన్ని ప్రత్యేక సామర్ధ్యాల్ని పిల్లలు సంపాదించాల్సుంటుంది.ఆ సామర్ధ్యాలు తెలుగు మీడియం పిల్లల్లో 75 శాతం గానూ, ఇంగ్లీషు మీడియం పిల్లల్లో 25 శాతంగానూ ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించవలసినదిగా మనవి.

    ReplyDelete
  10. Try out these options to get rid of the 'content warning'.

    1. Login to your Blog
    2. Go to Settings->Basic and then look for 'Adult Content' and make sure the value is 'No'

    If this didn't work, here is another one.

    At the very top of your blog, you can see a 'NavBar' and see if 'Flag Blog' is clicked.

    Keep in mind it's not just you, if any (definitely not just 1 or 2 but unfortunately as our blogs are in Telugu, Blogger can't verify it so it relies on user's feedback) of your Blog visitors clicked this option (may be accidentally) and Blogger will issue this content warning.

    If neither of those options didn't work then let's troubleshoot in a different way.

    Hope this helps. Good luck.

    ReplyDelete
  11. సమకాలీన ప్రపంచంలో భారతియులు అనేక రంగాలలో తెలివైన వారుగా పేరు తెచ్చుకుంటున్నారు. దీనికున్న అనేక కారణాలలో మాతృభాష, భారతీయ సంస్కృతి విశేష ప్రాధాన్యాన్ని కలిగున్నాయి.

    మాతృభాషలో చదివిన విద్యార్థులు మరో భాషను నేర్చుకునేటప్పుడు వాటి మద్య సంభంధాలను, వైవిధ్యాన్ని గుర్తించే క్రమంలో బుద్దికుశలత మెరుగు తేలుతుంది. మాతృభాషలో భోధన విషయావగాహనను పెంచితే ఆంగ్ల భాషా భోధన సమకాలీన విషయఙ్ఞానన్ని వేగంగా, ప్రపంచీకరణకు అనుగుణంగా నేర్చుకునేందుకు దోహదపడింది. అలాగే భారతియులు అనేక సంస్కృతులను ఔపోసన పట్టి అనేక మానసిక, భౌతిక వైవిధ్యాలను అర్థం చేసుకుని తమలో ఇముడ్చుకొని మనుగడ సాగిస్తున్నారు.

    దీనివల్ల సమకాలీన ప్రపంచంలోని సంక్లిష్టతలను భారతియులు త్వరగా అర్థం చేసుకుని అనేక రంగాలలో అద్బుతమైన పరిష్కారాలను ఆవిష్కరిస్తున్నారు. స్వాతంత్ర్యానంతర కాలంలొ అతి తక్కువ వ్యవధి లోనే పూర్వపు విఙ్ఞాన వైభవాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో మన ప్రఙ్ఞకు మూలకారణమైన భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని వీడకుండా, మాతృభాషనూ, మట్టివాసననూ ఇనుమడింప చేస్తూ ముందుకు సాగడమే ఉత్తమ విధానంగా అగుపిస్తోంది.

    ReplyDelete
  12. అయ్య బొల్లోజి గారు, మీరు చూసిందే ప్రపంచం అనుకుంటే ఎలాగండి, స్వయాన నా తమ్ముడు సుధాకర్, తెలుగులోనే డిగ్రీ వరకు చదువుకున్నాడు తర్వాత I.C.W.A చేసి వొరాకిల్ తో లండన్ వెల్లి ఓ రెండు సంవత్సరాలు ఉన్నాక ఇండియాకి తిరిగొచ్చి, ఇక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి ఎం.డి గా ఉన్నాడు, మా తమ్ముడే కాదు అతని బ్యాచ్ లో వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉన్నారు. ఇంకా మీకు ప్రూఫ్ కావాలంటే ఇస్తాను కూడ.

    ReplyDelete
  13. kamal gaaru
    dont put forward stray incidents. say about janabaahulya vishayaalu.

    మీరు చూసిందే ప్రపంచం అనుకుంటే ఎలాగండి,

    what i am saying is the same.

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. బాబా గారు. ఓహో, జనభాహుళ్యం కాని వారు తెలుగులో డిగ్రీ చదివి, మీరంటున్న విదంగా వొమిరికా వెల్లి మంచి స్థితిలో ఉన్నా కూడ వారికి ప్రాముఖ్యత ఉండదు..? అంటే మీ దృష్టిలో అలా జనం లో బాగా పేరున్న వారినే గుర్తిస్తారా..? హ హ హ హ ఇదేమి తిరకాసు..? అంతేలేండి, కొన్ని " స్థిర అభిప్రాయాలు" పెట్టుకొని వాటి చుట్టూ అనుగునంగా వాదనలు తయారు చేసుకుంటారు. ఇది నిత్యం జరిగే విషయమే.

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||