ఇంగ్లీష్ మీడియం లో బోధన

Jun 23, 2008

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో 6వ తరగతి నుండి బోధించాలని నిర్ణయించుకోవడం విచారకరం. కొంతమంది ప్రజలు , కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిని అపార్ధం చేసుకుంటున్నారు. కొందరు ఇంగ్లీషు మాధ్యమానికి ( మీడియానికి ) ఓకే. కానీ అది స్టేట్ సిలబస్ లో అయితేనే చెబుతాం అంటున్నారు. మరి కొందరు కొత్తగా ఇంగ్లీషు మీడియం పెట్టినప్పటికీ తెలుగు మీడియం ఎలాగూ ఉంది గనుక , ఇంగ్లీషు మీడియంలో చదవడం ఇష్టం లేని వారు తెలుగు మీడియంలోనే చదువుకోవచ్చుగదా , మరింకేమిటి – సెంట్రల్ సిలబస్ అయితే మాత్రం ఏం - అంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇంగ్లీషు మీడియం పెట్టడం మంచిది కాదు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు మాతృభాషలో విద్య నేర్చుకోవడం మంచిదని కొఠారీ కమీషన్ కూడా సూచించింది. బాగా కోపం తెచ్చుకున్నకొందరైతే – మీ ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదవాలా ? పాపం పేదల పిల్లలు మాత్రం తెలుగులో చదవాల్నా? ఏం న్యాయంజెబుతున్నారండీ..... అంటూ నిరసిస్తున్నారు. దయచేసి వారు అర్దం చేసుకోవలసినదేమిటంటే ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాలున్నాయి. వాటిల్లో చేరి చదువుకోవచ్చు. కానీ ప్రభుత్వము తనంతట తానుగా , నిస్సిగ్గుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం విడ్డూరం, రాజ్యాంగ విరుద్ధం.
Share this article :

6 comments:

  1. కాస్త విశదీకరించండి.

    ReplyDelete
  2. Idi chaala Nijam.

    ReplyDelete
  3. శుభం. ఈ దెబ్బతో ఎవడడ్డుకున్నా తెలుగు ప్రాచీన భాషల్లో చేరిపోటం ఖాయం. ఇంకో రెండో మూడో తరాలు గడిచేసరికి తెలుగు మాట్లాడేవాళ్లెవరుంటారు గనక?

    ReplyDelete
  4. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం విడ్డూరమైతే కావచ్చు, కానీ రాజ్యాంగ విరుద్ధమైతే కాదు.

    చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వం స్కూళ్ళలో తమ పిల్లల్ని మానిపించి ప్రైవేటు స్కూళ్ళలో చేర్చడానికి కారణం ఇంగ్లీషు భాషా భోధన అన్న విషయం మనకు తెలిసినదే.మరి ప్రభుత్వం దానిని అరికట్టడానికి చర్య తీసుకుంటే మనకు ఇంత కినుక ఎందుకో?

    ఇక స్టేట్ సిలబస్ Vs సెంట్రల్ సిలబస్ చర్చ నిజానికి చాలా అప్త్రస్తుతం. కాకపోతే ప్రభుత్వ పరంగా చూస్తే, ఇలా సెంట్రల్ సిలబస్ పెట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధిల్ని తేరగా దండుకోవచ్చు. మీరు ఇది వద్దన్నారో..ఈ ఖర్చును మరింత పన్ను రూపంలో మీదగ్గరే వసూలు చేస్తారు. దానికి మీరు తయారుగా ఉంటే,ఈ పరిణామానికి వ్యతిరేకంగా ఉద్యమించండి.

    ReplyDelete
  5. 1970 లలో ఇచ్చిన కొఠారి కమిషన్ ను, ప్రస్తావించటం, ఇప్పటి కాలమాన పరిస్థితులకు అన్వయించబూనటం అన్యాయం.
    ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్ధులలో, 95% పేద, బడుగు వర్గాలకు చెందిన వారై ఉండటం అసత్యం కాదా? వీరిలో అధికశాతం, వారివారి కుటుంబాలలో మొదటి తరం అక్షరాశ్యులు కాదా?
    ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషుకు ఉన్న ప్రాముఖ్యతను ఎవరూ కాదనలేని సత్యం.
    ఒక తెలుగుమీడియం విద్యార్ధి, తన ఇంటర్ లోనో, లేక డిగ్రీ స్థాయిలోనో ఇంగ్లీషు మాద్యమానికి మారి, ఎంత మానసిక వేధనను అనుభవించాల్సి వస్తుంది. ఇక్ పి.జి. లో ఇంగ్లీషు ఎలాగూ తప్పదు.
    ఇవన్నీ, సమాజంలోని ఒకవర్గాన్ని ఇంగ్లీషుకి దూరంగా ఉంచి, తద్వారా ఉన్నతచదువులకు, ఉన్నత ఉపాధికి, దూరంగా ఉంచాలని ప్రయత్నంగా భావించటంలో తప్పేముంది?
    పైపెచ్చు ఇలా ఇంగ్లీషు మీడియంను నిస్సిగ్గుగా వ్యతిరేకించటం ఒక కుట్రలా అనిపించటంలేదూ?

    ఇంగ్లీషు మీడియం కావలసిన వారు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవచ్చని ఒక జుగుప్సా కరమైన, హేళన ను ముందుకు తెచ్చారు. మింగమెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనే అన్న రీతిలో. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు ముందుగా చెప్పినట్లు గా బిలో పోవర్టీ లైను లోని వారందరికీ, ప్రభుత్వ పాఠశాలలే గతి తప్ప వేరే చాయిస్ ఉన్నదా?
    ఈ వాదనలన్నీ ఒక వర్గాన్ని, ఇంగ్లీషుకు, తద్వారా వచ్చే వికాశానికి దూరం చేయటమే అని నా అభిప్రాయం.

    అన్ని సమస్యలకూ ఇంగ్లీషే పరిష్కారం అని నేను అనను, కానీ ఇంగ్లీషు సరిగ్గారాని వాడికి ఒక కార్పొరేట్ ఉద్యోగం రాగలదా?, మనరాష్ట్రం, దేశం దాటి గ్రీనర్ పాస్చర్స్ కై , వాడు చేసే ప్రయత్నాలలో విజయం సాధించగలడా?

    ఆలోచించండి? ఒక సామాజిక భాద్యతతో ఆలోచించండి. కంపాస్సనేట్ గా వ్యవహరించండి.

    ఇక పోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సిబిఎస్సి సిలబయస్ పైన నావద్ద సరైన సమాచారం లేదు. అది అంత అవసరం లేదేమో నని అనిపిస్తుంది. స్టేట్ ఇంగ్లీషు సిలబస్ తో కొనసాగించటానికి అభ్యంతరం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు.
    ఎవరివద్దైనా సమాచారం ఉంటే పచుకోగలరు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్ధులలో, 95% పేద, బడుగు వర్గాలకు చెందిన వారై ఉండటం అసత్యం కాదా?
    అన్న వాక్యాన్ని ఇలా చదువుకోవలసినదిగా ప్రార్ధన --- ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్ధులలో, 95% పేద, బడుగు వర్గాలకు చెందిన వారై ఉండటం సత్యం కాదా?
    తప్పు టైపింగుకు క్షమించగలరు.

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||