2 లక్షల కోట్లు, 13 వేల 860 కోట్ల ఆదాయాన్ని ప్రకటించిన రెండు పేద కుటుంబాలు

Dec 4, 2016


Image result for poor rich


ఆదాయ ప్రకటన పధకము 2016 క్రింద ప్రకటించబడిన ఆస్తుల ప్రకటనలలో అనుమానాస్పదమైనవాటిని సరిచూడడం

కేంద్ర బడ్జెట్ 2016-17 లో ఆదాయ ప్రకటన పధకము(ఐడియస్) ప్రకటించబడింది. దాని ప్రకారం రహస్యంగా దాచబడిన ఆదాయము లేక ఆస్తులు ప్రకటిస్తే ఆ మొత్తం విలువలో 45శాతము పన్ను, అదనపు ఖర్చు, జరిమానాల క్రింద జమ చేసుకోవడానికి మిగిలినది తెల్ల ధనంగా  అంగీకరించబడుతుంది.. ఆ పధకము 2016 సెప్టెంబరు 30వ తేదీతో ముగిసినది.

2016 అక్టోబరు 1వ తేదీన 65,250,00,00,000 రూపాయలు మొత్తం 64,275 ఆదాయ వెల్లడి ప్రకటనల ద్వారా వచ్చినవి అని వాటిని సరిచూస్తున్నామని ప్రజలకు తెలియజేశారు. సరిచూసిన తరువాత అవి మొత్తం 67,382 కోట్ల రూపాయలుగానూ, ఆస్తుల/ఆదాయాల ప్రకటనలు 71,726గానూ తేల్చడం జరిగింది.

ఈ వచ్చిన ఆదాయ ప్రకటనలలో పెద్దమొత్తంలో ఉన్న రెండు ప్రకటనలు అనుమానాస్పదంగా ఉన్నవి. ఎందుకంటే వారు సాధరణ జీవనం గడిపే కుటుంబాలవారు. ఒక కుటుంబంలోని నలుగురి పేర్లతో ఇవ్వబడిన ఆదాయ ప్రకటనలో శ్రీ సయ్యద్. అబ్దుల్ రజాక్ మహమ్మద్ (యజమాని) , శ్రీ సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ అబ్దుల్ రజాక్ ( కుమారుడు ) శ్రీమతి సయ్యద్ రుక్సానా అబ్దుల్ రజాక్ ( భార్య),  కుమారి సయ్యద్ నూర్జహాన్ మహమ్మద్ (సోదరి) . వీరు ముంబాయి లోని బంద్రా, లింకింగ్ రోడ్డులో టి.పి.యస్. 3, 269 బి, జుబిలీ కోర్టు, అడుగు అంతస్తులోని 4వ ప్లాట్ లో నివసిస్తున్నట్లు చెప్పిన  వీరు 2,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపారు.

మరోక ప్రకటన అహమ్మదాబాద్ లోని జోద్ పూర్ గ్రామ శివారు మంగల్ జ్యోతి టవర్ 206లో నివసిస్తున్న  శ్రీ మహేష్ కుమార్ చంపక్ లాల్ షా గారు 13, 860 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపారు.

పై రెండు తప్పుడు ఆదాయ ప్రకటనలుగా భావించి వాటిని నిలుపుదల చేశారు. వారిపై తగు విచారణ జరిపి వారు తప్పుడు ప్రకటనలు ఇవ్వడానికి గల కారణాలను కనుగొనే పనిలో ఆదాయ పన్ను శాఖ వారు ఉన్నారు.

Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||