కొలంబియాలో ఇంధనం లేనందున కూలిపోయిన విమానం
Dec 2, 2016
బ్రెజిలు ఫుడ్బాల్ టీములో ఎక్కువమంది ఆటగాళ్ళ చావుకు కారణమైన విమానప్రమాదం ఆ విమానంలో తగినంత పెట్రోలు లేనందువల్ల జరిగింది. టేపులో వినిపించిన పైలెట్ల మాటలను బట్టి ఈ విషయం తెలిసింది. ఒక పైలెట్టు విమానంలో పెట్రోలు లేదని విద్యుత్తు లేదని తప్పనిసరిగా విమానాన్ని క్రిందికి దించాల్సిన అవసరము ఉందని పదేపదే అంటున్న మాటలు వినిపించాయి.
మొత్తం 77 మంది ప్రయాణీకుల్లో ఆరుగురు మాత్రమే బ్రతికారు. విమాన సిబ్బందికీ కొలంబియాలోని విమాన రాకపోకల నియంత్రణాధికారికి మధ్య జరిగినట్లుగా బయటికి పొక్కిన సంభాషణలు విమాన ప్రమాదం తప్పించుకోలేనిదనే భయాందోళనలతోకూడిన అస్ఫష్టమైన విచారకరమైన స్వరంతో వున్నాయి. విమానము క్రింద పడిపోయినప్పుడు ఎటువంటి పేలుడూ జరగలేదని కనుక దానిలో పెట్రోలు లేదని అర్ధమోతుందని కొలంబియా మిలిటరీ అధికారి చెప్పారు. కానీ విమానంలో పెట్రోలు ఎందుకని లేదో తెలియలేదు. ఒకవేళ విమానానికి ఏదైనా బొగడ (తూటు) పడిందా లేక తగినంత నింపలేదా అనేది తెలియడం లేదు. పూర్తి పరిశోధన జరిగి సరైన కారణం తెలియాలంటే దాదాపు నెల రోజులు పట్టవచ్చు
ఒక ఆటగాని వీడియో గేం కోసం వెదుకుతూ విమాన సిబ్బంది 20 నిముషాలు ఆలస్యం చేసారు. కొబిజా విమానాశ్రయంలో అర్ధరాత్రి తర్వాత ఇంధనం నింపరు. కనుక ఇంధనం లేకుండానే విమానం అక్కడనుండి బయలుదేరింది.
పైలెట్ మిగుయల్ క్విరోగా తో ఫుడ్బాల్ టీం ఆటగాళ్ళు
Labels:
సంతాపం
"కొబిజా విమానాశ్రయంలో అర్ధరాత్రి తర్వాత ఇంధనం నింపరు. కనుక ఇంధనం లేకుండానే విమానం అక్కడనుండి బయలుదేరింది"
ReplyDelete---------------
అదేం రూలు? 🤔. అటువంటి తలాతోకాలేని రూల్ అన్ని ప్రాణాలు బలి తీసుకుందా?