జిల్ స్టెయిన్
అమెరికాలో జరగబోయే రీకౌంటింగుని నిపుణులు ఎందుకని అనుమానిస్తున్నారు?
ఆకుపచ్చ పార్టీ నుండి అధ్యక్షురాలిగా పోటీచేసిన జిల్ స్టెయిను గారు విస్కోన్సినులో ఓట్లు మరలా లెక్కించాలని కోరుతూ ఐదు మిలియను డాలర్ల చందాను సేకరించారు. పెన్సిల్వేనియా లోనూ మిచిగాను లోనూ కూడా ఓట్లను తిరిగి లెక్కించాలని కోరబోతున్నారు. రీకౌంటింగు ఫీజు చెల్లించడానికి మరో రెండు మిలియను డాలర్ల డబ్బు సేకరించాల్సిఉంది.
రిపబ్లికను డోనాల్డు ట్రంపు గెలుపుకు కారణమైనది మిచిగాను లో 0.3శాతం ఓట్లు, పెన్సిల్వేనియాలో 1.2శాతం ఓట్లు, విస్కోన్సిను లో 0.7 శాతం ఓట్లు మాత్రమే.
ఒకవేళ ఈ రాష్ట్రాలలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటను గెలిస్తే ఆమెకు 46 ఎలక్ట్రోరల్ కాలేజి ఓట్ల వచ్చి ఆమె గెలుస్తారు. ప్రస్తుతం హిల్లరీ 232 ఓట్లతో ఉన్నారు 232+46= 278 ఓట్లు అవుతాయి. అదే డోనాల్టు గార్కి 290-46=244 అయి ఓడిపోతాడు అని ఆమె తెలిపారు.
కానీ ఈ రీకౌంటింగు విధానం తీవ్రమైనది, ఖరీదైనది ఎన్నిక ఫలితాలను మార్చలేనిది కనుక నిపుణులు ఇది నిజమౌతుందని నమ్మలేమంటున్నారు.
ఎన్నిక అయిపోయిందిగనుక ఎన్నికల ఫలితాన్ని అందరూ గౌరవించాలని, రీకౌంటింగ్ చేయాలని కోరడం ఒక స్కాం అని అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డు ట్రంపు అన్నారు.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !