కువైట్ లో శనివారం జరిగిన ఎన్నికలు
Nov 27, 2016
కువైట్ పోలింగులో నాలుగేళ్ళ తరువాత ఎక్కువమందిగా పాల్గొన్న ప్రతిపక్షం
ఆయిల్ ఆదాయం తగ్గినందువల్ల ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించిన తరువాత తాజా వివాదాలు చుట్టుముట్టగా జరుగుతున్న నాలుగేళ్ళ తర్వాత మొదటిసారిగా ప్రతిపక్షం పోటీచేస్తున్న ఎన్నికల పోలింగులో ఈరోజు కువైటీలు అత్యధిక సంఖ్యలో పాల్గన్నారు.
దాదాపు 80శాతం ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
గత 250 సంవత్సరాలుగా అల్ సబాహ్ కుటుంబమే అధికారంలో ఉంది. దాదాపుగా ఆల్ సబహ్ కుటుంబమే తిరిగి అధికారంలోకి రావచ్చు.
విదేశీ వ్యవహారాలూ రక్షణ వంటి మంత్రిత్వశాఖలన్నీ ఈ కుటుంబీకుల చేతుల్లోనే ఉన్నాయి. 50 పార్లమెంటు సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 300 మందిలో 30 మంది ప్రతిపక్షానికి చెందినవారు, 14మంది మహిళలు. కువాయిట్ లో మొత్తం 44 లక్షలమంది ప్రజలున్నప్పటికీ వారిలో 70శాతం మంది ఓటుహక్కులేని విదేశీలులే. ఓటర్లు కేవలం నాలుగు లక్షల 83 వేలమంది మాత్రమే.
ఓట్ల లెక్కింపు మొదలైనప్పటికీ ఫలితాలు రేపు వెలువడవచ్చు.
Labels:
Election
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !