ఏడేళ్ళ బాలికను చెరిచి చంపిన ఘటనపై కొలంబియాలో ఆగ్రహం
Dec 9, 2016
కొలంబియా రాజధానీ నగరం బొగోటాలో ఆదివారం చెరిచి చంపబడిన ఏడేళ్ళ పేద బాలికను ఖననం చేశారు. యులియానా సంబోని శవం ఒక విలాసవంతమైన అంకణం ( అపార్టుమెంటు) లో దొరికింది. ఆమెను గొంతు పిసికి చంపివుంటారని భావిస్తున్నారు. పోలీసులు ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్య దేశంలోని పిల్లలపై జరిగే అత్యాచారలపైన, సాంఘీక అసమానతలపైన ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. అధ్యక్షుడు శ్రీ జుయన్ను మానుయల్లు శాంత్రోజు దీనిని ఖండించారు.
బొగోటా లోని కార్మికుల నివాసాలలోగల తన ఇంటివద్ద యులియానా సంబోని ఆడుకుంటుండగా బూడిదరంగు వ్యానులో వచ్చిన వ్యక్తి ఆ అమ్మాయిని బలవంతంగా వ్యానులో ఎక్కించుకొని పోయాడు.
కొన్ని గంటల తర్వాత ఆమె శరీరం హింసించి, చెరచబడిన గుర్తులతో ఒక ధనవంతుల అంకణంలో లభించింది. పారిపోయిన ఆ అంకణం యొక్క 38 యేళ్ళ యజమాని తరువాత సారాయి, కొకెయిన్ వంటి మత్తుపదార్ధాలను ఎక్కువ మోతాదులో తీసుకొని, ఆసుపత్రిలో చేరాడు. అతణ్ణి అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఆ మరునాడు వందలాది ప్రజలు బొగోటా లోని ఓ పార్కులో కొవ్వొత్తులతో గుమిగూడి తమ సంతాపాన్ని తెలిపారు. స్త్రీ హక్కుల సంఘాలు స్త్రీలను కామహింసలనుండి ప్రభుత్వము కాపాడాలని కోరారు.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !