యుక్రెయినుకు చెందిన వ్లాడిస్లావ పోడ్చాప్కో అనే 20 యేళ్ళ తల్లి తన మూడేళ్ళలోపు వయసుగల ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ తొమ్మిది రోజులు ఉండి తిరిగి ఇంటికి వచ్చింది. వారికి తినడానికి ఆహారం కూడా ఉంచకుండా వెళ్ళింది. ఆరు రోజులకు సంవత్సరం పదకొండు నెలల వయసు గల కొడుకు డానియేలు ఆకలితో చనిపోయాడు. మూడేళ్ళ వయసుగల కూతురు అన్యా చనిపోయిన తమ్ముడి శవంతో మూడురోజులు ఆగదిలోనే గడిపింది. తల్లి వచ్చే సరికి చావుబ్రతుకుల్లో ఉంది. ఆసుపత్రిలో ఇన్సెంటివు కేరు లో ఉన్న అన్యా ప్రస్తుతం కోలుకుంటుందన యుక్రేనియను అధ్యక్షునికి బాలల హక్కుల సలహాదారు అయిన శ్రీ కులేబా గారు చెప్పారు.
ఈమెకు మొత్తం వేర్వేరు తండ్రులుగల ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఒకరు తన తండ్రితోనే ఉంటున్నది. ఈమెకు ఎనిమిదేళ్ళ జైలు శిక్ష పడవచ్చని అనుకుంటున్నారు.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !