భూమి కక్ష్యలో తిరిగిన మొదటి అమెరికా ఖగోళశాస్త్రవేత్త జాను గ్లెన్న మరణం
Dec 9, 2016
భూమి కక్ష్యలో తిరిగిన మొదటి అమెరికా ఖగోళశాస్త్రవేత్త జాను గ్లెన్న 95వ యేట నిన్న చనిపోయాడు.
1962లో భూమిచుట్టూ ప్రదక్షిణం చేశాడు.
తన 77 యేళ్ళ వయసులో మరోసారి అంతరిక్షం లో కి ప్రయాణించి అంతరిక్షంలో ప్రయాణించిన అత్యధిక వయస్కునిగా రికార్ఢు నెలకొల్పాడు. తన చిన్ననాటి స్నేహితురాలు యాని కేస్టర్ ను పెండ్లాడాడు. డేవిడ్, లియన్ అనే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. గ్లెన్న భార్య ఇప్పటికీ తాను 1942 వేడుకనాటి 125 డాలర్ల ప్రదానపు ఉంగరాన్నే ధరించివుంటుంది.
గ్లెన్న కేవలం 5 గంటల్లో మూడుసార్లు భూగోళాన్ని చుట్టివచ్చాడు. 2011లో గ్లెన్న జాతీయ అత్యున్నత పౌరుని అవార్డు అయిన కాంగ్రెషనల్ బంగారు పతకాన్ని పొందాడు. 2012లో అధ్యక్ష్యుడు బరాక్ ఒబామా చేత అధ్యక్షుని స్వేచ్చా పతకాన్ని పొందాడు. నాసా సంస్థ గ్లెన్ను ఒక నిజమైన అమెరికా హీరో అని పొగిడింది.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !