దుమ్ముగా మారబోతున్న లైబ్రరీ
Dec 10, 2016
చెన్నై లోని 204 సంవత్సరాల చరిత్రగల పాత మద్రాసు లైబ్రరీ సొసైటీ యువ వాలెంటీర్లు, సోషల్ మీడియాల సహకారంతో కొత్తగా మారబోతుంది.
నేల మీద నుండి ఇంటి కప్పు వరకూ గల అరలలో నిండుగా పుస్తకాలతో చూడడానికి పుస్తక జలపాతంలా వుంటుందా లైబ్రరీ. ఈ లైబ్రరీలో 55 వేల పుస్తకాలు, 150 నుండి 300 సంవత్సరాల పాత అతి పెద్ద గ్రంధాలతో నిండివుంది. ఇది 1905 లో కట్టబడిన భవనము. 19వ శతాబ్ది నాటి ఇండోగోతిక్ విధానంలో బ్రిటీషు ఇంజనీర్లచే కట్టబడింది. మొదట 1812లో ఈస్టిండియా కంపెనీ వారు తమ ఉద్యోగులకు పరిపాలనలో, భాషలో, చట్టంలో, మతవిషయాలలో, స్థానిక ఆచారవ్యవహారాల గురించి తగు సమాచారంతో వారికి ఉపయోగపడే ఉద్దేశ్యంతో సెయింటు జార్జి కోటలో 1812 నుండి 1845 వరకూ నడిపి తరువాత ఈ భవనంలోకి 1905లో ఆ లైబ్రరీని మార్చారు.
ఈ లైబ్రరీలో ఉన్న పాత గ్రంధాలలో 1729లో ఐజక్ న్యూటన్ సిద్ధాంత గ్రంధం 'ది మాధమేటికల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ నాచురల్ ఫిలోసఫీ' అనే గ్రంధం ఉంది.1898లో బ్రిటిష్ అధికారులచే వ్రాయబడిన బహింగ్ హాం కాలువ నిర్మాణ చరిత్ర గురించిన జ్ఞాపకాలు ఉన్నాయి. తగినంత మంది సిబ్బంది, తగినన్ని నధులు కొరవడినందున కొన్ని విలువైన గ్రంధాలు దుమ్ముగా మారబోతున్నాయి. వీటిలో 5వేలనుండి 12వేల రూపాయల ఖరీదు చేసే పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకూ పాడైనాయి.
ఇప్పుడు యువ వాలటీర్లదళం తగు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. 2015 జూన్ నెల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది.
ప్రస్తుతం ఈ లైబ్రరీకి ప్రతియేటా 850రూపాయల చొప్పున చందా చెల్లించే 350 మంది సభ్యులున్నారు. మేము ఈ సంఖ్యను 1000 మందికి పెంచడానికి కృషి చేస్తున్నామని ఆ లైబ్రరీకి గౌరవ సెక్రటరీగా పనిచేస్తున్న 73 సంవత్సరాలు వయసు గల శ్రీ మోహనరామన్ బిబిసి విలేఖరితో చెప్పారు.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !