అంతరిక్షంలో చాలా వ్యర్ధపదార్ధాలు ఉన్నాయి. వాటిని అయస్కాంతశక్తితో తొలగించడానికి జపాన్ దేశ శాస్త్రజ్ఞులు కార్గో షిప్పుద్వారా 700మీటర్ల పొడవున వున్న వ్యర్ధపదార్ధాలను తొలగించారు. ఓక చేపల వలలు తయారుచేసే కంపెనీ వారి సహకారంతో ఆ పరికరం తయారు చేయబడింది.
భూకక్ష్యలో పాత ఉపగ్రహాలు, పరికరాలు, రాకెట్ల ముక్కలు వంటివి దాదాపు 10 కోట్ల వ్యర్ధపదార్ధాల ముక్కలు ఉంటాయని అంచనా. అవి గంటకు 28000 కిలోమీటర్ల వేగంతో భూమిచుట్టూ తిరుగుతున్నాయి. వీటివల్ల పెద్ద ప్రమాదాలు జరగవచ్చును సమాచార వ్యవస్ధకు నష్టం కలుగవచ్చును. 1957లో రష్యావారు స్ఫుత్నిక్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దగ్గర్నుండి అంటే దాదాపు 50 సంవత్సరాలనుండి నిరంతరం భూకక్ష్యలోకి వ్యర్ధపదార్ధాలు చేరుతూనే ఉన్నాయి. ఉపగ్రహాలకు ఉపగ్రహవిధ్వంసక ఆయుధాలకు మధ్య సమన్వయం లేనందున సమస్య మరింత జటిలంగా తయారౌతుంది.
జపాను భాషలో స్రోకు లేదా కౌనోటొరి అని పిలిచే తనంతటతానుగా తిరిగే కార్గో షిప్పు ఏదైతే అంతరిక్షంలోని వ్యర్ధపదార్ధాలను సేకరిస్తుందో అది అన్నిదేశాల అంతరిక్ష కేంద్రాలకు అనుసంధానించబడి తనేగషిమ అనే ఉత్తర ఫసిఫిక్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబడింది. ఈ కార్గో షిప్పుకు గల చైతన్యవంతమైన కందెన గల తాడుకు అంతరిక్షంలోని వ్యర్ధ పదార్ధాలను ఆకర్షించ వాటిని భూవాతావరణంలోకి నెట్టివేసి అవి కాలిపోయేలాగా చేసే శక్తి ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
చేపల వలలు తయారుచేయడంలో 106 సంవత్సరాల అనుభవంగల నిట్టో సెయిమో కంపెనీ సహకారంతో జపాను అంతరిక్షఏజన్సీ వారు వల వంటి వస్తువును తయారుచేశారు. నరాలవంటి రోబోల సహాయంతో అంతరిక్షంలోని వ్యర్ధవదార్ధాలను ఆకర్షంచి వాటిని భూవాతావరణంలోకి నెట్టి అవి మండిబూడిద అయిపోయేలాగాచేసి సమాచారవ్యవస్ధకు ,వాతావరణానికి ప్రపంచానికి మేలుచేసే ఈ కృషి అభినందనీయం.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !