మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయపార్టీ నిర్మిస్తున్న క్రమం వ్యూహాత్మకంగా, ముచ్చటగా ఉంది. ఠాగూర్ సినిమాలోలాగా అవినీతిని అంతంచేయగల ఏకైక నాయకుడుగా చాలామంది ప్రజలు నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది. చిరంజీవి గారు ఒక రాజకీయ పార్టీకి కావలసిన అన్ని హంగులూ ఏర్పరచుకుంటున్నట్లుగావుంది. నా అంచనా ప్రకారం వైయ్యస్సార్ గారు నేటి నుండి అవినీతిపై అవిశ్రాంత పోరు చేస్తానికి సిద్ధమౌతున్నట్లుగావుంది.కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యంకాకపోవచ్చు. చిరంజీవిగారి ఎత్తుగడ కూడా అవినీతిలేని పాలన హామీగా ఎన్నికలబరిలోకి దూకి, ఆన్ని ప్రతిపక్షాల సహకారంతో రాజ్యాధికారం చేపట్టాలని కొండంత ఆశతో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అది అడియాసే కావచ్చు. ఎందుకంటే...
మనదేశ చట్టాలను గమనించండి. బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించడానికి కొన్ని చట్టాలను చేశాడు.అవే బానిస చట్టాలు. చట్ట ప్రకారం ప్రభుత్వరహస్యాలు వెల్లడించరాదు. ప్రభుత్వం నుండి ప్రజలెవరైనా సహాయం పొందాలంటే కొంత లంచంగా సమర్పించుకోవాల్సివచ్చేది. పోలీస్ సహాయం కోరితే పోలీసువారికీ, న్యాయ సహాయం కోరితే పీ.పీ గారికీ, ఆస్తి కొన్నా,అమ్మినా రిజిష్టారువారికీ..... ఇలా అన్నిరకాల ప్రభుత్వాధికారులకు కొంత మొత్తం లంచంగా చెల్లించితేనే అధికారులు పనిచేసేవారు. అలా ఆయాశాఖలవారు తాము వసూలు చేసిన మొత్తాలను( 90శాతం ) తమ పై అధికారులకు అందిస్తారు. అలా అధికారులందరివద్దనుండి డబ్బు వసూలు చేసే అధికారినే కలెక్టర్ అంటారు.ఆ విధంగా బ్రిటీష్ వారికి డబ్బు ముట్టేది. మనకి స్వాతంత్ర్యం వచ్చినా చట్టాలు మారనందున తమ పాత అలవాట్ల ప్రకారం నేటికీ లంచం అడగబడుతూంది.
ఇక మెగాస్టార్ సియ్యం అయ్యాడనే అనుకుందాం. తాను చట్టాలు మార్చగలడా? రాష్ట్రాలను పాలించడానికి రాజప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు వందమందికి పైగా ఐఏయస్సులూ, ఐపీయస్సులూ, ఐయ్యస్సెఫ్ లూ వస్తారు.ఆ వచ్చిన వారిలోనుండే మనం పరిపాలింపబడాలి. వారికి కొద్దిమందికైనా ఎంతో కొంత లంచంగా యివ్వందే మనం చెప్పినట్లు పనిచేస్తారా? .....ఏమో..... చెయ్యకపోవచ్చనుకుంటున్నాను. మీరేమంటారు?
మెగాస్టార్ చిరంజీవి గారు సిఎం అయితే అవినీతిని అరికట్టగలడా?
Jul 4, 2008
Labels:
POLITICS
నాయకులకు అవినీతిని అరికట్టాలని అలోచన వున్నా సహకరించడానికి ప్రభుత్వ యంత్రాంగ సహకారం ఉండాలి కదా! అవినీతితో తల పండిపోయిన వాళ్ళకు బుద్ది చెప్పే సాహసం మన నాయకులకు వుందా!చిరంజీవి పార్టీ లో చేరే నాయకులకు వుందా ముందు ఆ ఆలోచన ?చూద్దాం ముందుముందు ఏమిజరుగుతుందో.
ReplyDeleteచిరంజీవికి రాజకీయాలంటే పెద్ద ఆసక్తి ఉన్నట్టు కనిపించదు. నిజం మాట్లాడితే చిరంజీవి అభిమానులకు కోపం వస్తుందేమో గానీ, రక్త దానం వంటి సేవా కార్యక్రమాలు కూడ మొదట అభిమానులు 'డిఫరెంట్ ' గా ఉండాలని మొదలు పెట్టినవే గానీ చిరు initiate చేసినవి కావు! ఆయన్ని ఎలాగైన రాజకీయాల్లోకి తీసుకురావాలని అల్లు అరవింద్, నాగ బాబు ఇంకా మరికొంత మంది మిత్రులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు!
ReplyDeleteపైగా చిరంజీవి చాలా plain personality గా కనిపిస్తాడు. గొడవలు పెట్టుకోవడం, చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే మానసిక శక్తి లేకపోవడం ఆయన బలహీనతలు. వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పడానికి ఆయన ఎంత pressure, anxiety, tension, అనుభవించారో అందరికీ తెలుసు. అలాగే శ్రీజ వ్యవహారంలో కూడా, టివిలో బహిరంగ ప్రకటన ఇచ్చే సమయానికి ఆయన ఆహార్యం ఏ స్థితిలో ఉందో అందరూ చూసిందే!
ఇప్పుడైనా చిరంజీవి వెనక వ్యూహాలు, పన్నాగాలూ సిద్ధం చేస్తుంది ఆయన బదులు ప్రకటనలు ఇచ్చే బంధువులూ, మిత్రులే తప్ప ఆయన కాదు.
మొహాన ఉమ్మేస్తే తుడుచుకుని వెళ్ళగలిగే సిగ్గులేని తనం, అవసరమైతే కారణం లేకుండా అవతలి వాడిని బూతులు చెరిగే తెంపరితనం రాజకీయాలకు అర్హతలుగా ఉన్న ఇవాల్టి రోజుల్లో ఆయన రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తారో చెప్పలేం! ఆయన ముఖ్య మంత్రి అయితే అవినీతిని అంతమొందిచడం సంగతి అలా ఉంచి, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు మరింత బాగుపడే అవకాశం వస్తుంది.
నేన్రాను మొర్రో అని గింజుకుంటుంటే,"వీల్లేదు, నువ్వు రావాలసిందే" అని బలవంతంగా లాక్కొస్తున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఆయనకున్న చరిష్మా అలాంటిది మరి!
చివరగా....ఆయన పార్టీ పెడితే సీట్లు బాగానే వస్తాయిగానీ, మెజారిటీ రాదు. ప్రతిపక్షంలో కూచోవాల్సిందే అని నా అభిప్రాయం.
సుజాతగారి అభిప్రాయాలతో నేనుచాలావరకు ఏకీభవిస్తాను. మళ్ళీ పాత అవినీతి రాజకీయ నాయకులు ఈ పార్టీలోకి ప్రవేసించే సూచనలు బలంగా ఉన్నాయి. ఇది మరో "కుల పార్టీ" అవుతుందని నా అనుమానం.అధికారులవ్లన రాజకీయనాయకులు చెడిపోవడం లేదు. రాజకీయ నాయకులే తమ స్వప్రయోజనాలకు వారిని అలా తయారు చేస్తున్నారు.
ReplyDeleteసుజార గారు చెప్పినవి చాలా హేతుకంగా ఉన్నాయ్! కాకపోతే ఆ మాత్రం స్పందన, సిగ్గూ, బిడియం, ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అభిలణీయమే. He would be better than many present day politicians.
ReplyDeleteఇక అవినీతంటారా...అది చిరంజీవి కాదు గాంధీ మళ్ళీ బ్రతికొచ్చినా పోయేది కాదు. now its an internal part of our democracy and daily lives. కానీ ప్రయతం చేసేవార్ని హర్షించాల్సిందే! అది చింజీవైనా, జయప్రకాష్ నారాయణ్ అయినా సరే.