Showing posts with label POLITICS. Show all posts
Showing posts with label POLITICS. Show all posts

కాంగో నిరసన ప్రదర్శనలో 26 మంది మృతి, 45 మందికి గాయాలు, అనేకుల నిర్బంధం

Dec 21, 2016



కాంగో నిరసన ప్రదర్శనలో 26 మంది కాల్చి చంపినట్లు హక్కుల సంస్థ చెప్పింది.

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పై అవినీతి ఆరోపణలు

Dec 18, 2015



కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డి‌డి‌సి‌ఏ అధ్యక్షులుగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి వివరాలను ఏఏపి ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏఏపి కి చెందిన వివిధ నేతలు, మంత్రులు ఈ రోజు (డిసెంబర్ 17, 2015) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ అవినీతి వివరాలను వెల్లడి చేశారు. ఢిల్లీ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీవ్ర అవినీతి నేరాల పరిశోధనా సంస్థ (సీరియ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ – ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ) లతో పాటు డిడిసిఏ అంతర్గత విచారణ కమిటీ కూడా జైట్లీ నేతృత్వంలోని డి‌డి‌సి‌ఏ అవినీతికి పాల్పడిన సంగతిని నిగ్గుదేల్చడం విశేషం. ఈ మూడు విచారణ సంస్థలు మరియు కమిటీలు సమర్పించిన అవకతవకల నివేదికపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బట్టి జైట్లీపై ఆరోపణలను తొక్కిపెట్టారని స్పష్టం అవుతోంది.

వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు



వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -వి శేఖర్]
***********
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు. కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ ను లక్ష్యంగా చేసుకుంటూ ఢిల్లీ సచివాలయంలో సోదాలు నిర్వహించే సమయంలో కేంద్ర ఏజన్సీ (సి.బి.ఐ) మెరుగైన వివేకాన్ని ప్రదర్శించి ఉండవలసింది. ఎందుకంటే తద్వారా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా సోదా చేశారన్న అభిప్రాయాన్ని అది కలిగించింది.
సోదా జరిపే ప్రదేశం నుండి మీడియాను దూరం పెట్టడం సాధారణమే. కానీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆయన కార్యాలయానికి వెళ్లకుండా దూరంగా ఉంచడం ద్వారా ఆయన కార్యాలయాన్ని కూడా తనిఖీ చేశారన్న ఊహాగానాలకు సి‌బి‌ఐ తావిచ్చింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా తనిఖీలు నిర్వహించినందుకు సి.బి.ఐని తప్పు పట్టడం కష్టమే కావచ్చు. కానీ సమాఖ్య సంబంధిత వ్యవస్ధలో అధికారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ ఆవరణలలో తనిఖీలు నిర్వహిస్తే అది తప్పనిసరిగా అనుమానంతోనే చూడబడుతుంది, ముఖ్యంగా అధికార ముఖ్యమంత్రి ఆ తనిఖీకి లక్ష్యం కానప్పుడు! సెప్టెంబర్ లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై సి.బి.ఐ సోదాలు నిర్వహించింది. కానీ (అప్పటికే) ఆయన విచారణలో ఉన్నారు. కనుక దాచిపెట్టుకున్న దురుద్దేశాలను (ఆ తనిఖీలకు) ఆపాదించడానికి తావు లేదు, ఒక్క రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించడం తప్ప.
నవంబర్ 15 – డిసెంబర్ 15 కాలానికి చెందిన ఫైల్ మూవ్ మెంట్ రిజిష్టర్ ను కూడా సి.బి.ఐ స్వాధీనం చేసుకుందన్న కేజ్రీవాల్ ఆరోపణ నిజమే అయితే సి.బి.ఐ సోదాలు రాజేంద్ర కుమార్ 2007-2014 కాలంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినంతవరకే పరిమితం కాలేదన్న ఆరోపణలకు సాక్ష్యం లభించినట్లే. కానీ తన ప్రిన్సిపల్ సెక్రటరీ సాకుతో తననే లక్ష్యం చేసుకున్నారన్న ఆరోపణలకు మరిన్ని రుజువులు కావాలి. ఈ లోపు ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సి.బి.ఐని వాడుకుంటున్నారన్న అవగాహన పట్టు కోల్పోక కొనసాగుతూనే ఉంటుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి “పిరికిపంద” అనీ, “సైకోపాత్” అనీ నిందిస్తూ కేజ్రీవాల్ విరుచుకుపడడం, అధికారం నెరుపుతున్న ఒక ముఖ్యమంత్రి స్ధాయికి తగనిది. జన లోక్ పాల్ కు అపరిమిత అధికారాలు ఇవ్వాలని కోరిన వ్యక్తే ఒక పరిశోధనా సంస్ధను ప్రశ్నించవలసిన వైపరీత్యాన్ని చూస్తున్నారా అన్న నిబిడాశ్చర్యాలకు అటువంటి గర్జనలు దారితీస్తాయి. మోడి వ్యతిరేక కూటమికి జాతీయ ముఖంగా తనను తాను నామినేట్ చేసుకోగల అవకాశాన్ని చూడడంలో కేజ్రీవాల్ వేగంగా వ్యవహరించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సుపరిపాలనా సూత్రాల కోసం తనకంటే ఎన్నోరెట్లు పెద్దవైన శక్తులతో తలపడుతున్నానని చాటుకోవడం ద్వారా తన రాజకీయాల వెంట సమీకరణా అవకాశాన్ని పెంచుకోవడం కేజ్రీవాల్ వ్యూహంలో ఒక భాగంగా ఉంటోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి ఏఏపి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, అనేక అంశాలపై తన వెనుక వరుస కట్టేందుకు ఇతర పార్టీల నాయకులు  సిద్ధంగా ఉండడం తప్పనిసరిగా లాభిస్తుంది. సోదాల గురించి తమకు ముందుగా తెలియకున్నప్పటికీ బి.జె.పి ప్రతినిధులు, మంత్రులు తమవంతుగా (ప్రజల) ముందు ఉంచిన ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయంటే స్వయం ఓటమికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. రాజకీయంగా తన పోరాటాన్ని తన షరతుల ప్రకారమే వారివద్దకు కొనిపోయేందుకు, తాము ఆత్మ రక్షణలో పడిపోయేందుకు కేజ్రీవాల్ కు వారు అవకాశం ఇచ్చారు – రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట్ల ఆ ప్రభుత్వాలతో సమాఖ్య చైతన్యానికి సంబంధించి తమ సమీకరణం ఏమిటో వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వారిపైనే ఉన్నది.

(http://teluguvartalu.com)



పాతసారా పవర్

Mar 28, 2014



పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకో స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఆంధ్రరాష్ట్ర విభజన జరిగిన తీరు తనకు నచ్చలేదని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. అయితే అంతటి ద్వేషం కాంగ్రెస్ పార్టీపై ఎందుకు పెంచుకున్నాడో అర్ధం కావడంలేదు.

జగన్ బాటలోకి చంద్రబాబు

Oct 7, 2013



జాతీయ స్థాయిలో జరిగే విలేఖరుల సమావేశంలో సరైన సమాధానాలు ఇవ్వక పోవడం వలన చంద్రబాబు నాయుడు బలహీన పడ్డాడు. సమైక్యమా, ప్రత్యేకమా అని తేల్చి చెప్పలేకపోయారు. సమైక్యమంటే తెలంగాణా లోని పార్టీ సభ్యులు అభిమానులు పార్టీకి దూరమవుతారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఇవ్వాలంటే  సీమాంధ్రులు పార్టీకి దూరమౌతారు. అయినప్పటికీ మేధావుల ఓట్లు పోయినా మిగిలిన రైతుల ఓట్లు దూరం కాకుంటే చాలునను కుంటున్నారేమో.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే

Oct 4, 2013



2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే
వైయ్యస్ రాజశేఖరరెడ్డిగారి ఎశాసినేషన్ తరువాత ఆయనకు వారసునిగా జగన్మోహనరెడ్డి ఎదుగుతాడని కాంగ్రెస్ అధిష్టానవర్గం అనుకోలేదు. తెలంగాణా ఇస్తానని చెప్పడం ద్వారా చంద్రబాబునాయుడిని  తెలంగాణా ప్రాంతానికి దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఎలాగంటే – తెలంగాణా ఇవ్వడానికి రాష్ట్రం లోని రాజకీయ పార్టీల మద్య ఏకాభిప్రాయం సాధించి , వారి అంగీకారంతో తెలంగాణా ఇస్తామని ప్రకటించుతారు. తెలుగుదేశం దానికి అంగీకరిస్తే  సీమాంధ్ర ప్రాంతం లోని తెలుగు తమ్ముళ్ళు అలిగి కాంగ్రెస్ లో కలుస్తారు/ లేదా తెలంగాణా ఇవ్వవద్దు అని తెలుగుదేశం అంటే తెలంగాణాలోని తెలుగు తమ్ముళ్ళు అలిగి దూరమౌతారు, తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిపితే తెలుగు దేశం సగం ప్రాంతంలో ఉండదుగనుక వారు ఓడిపోయి సోనియా కాంగ్రెస్ అధిక సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇది 2010నాటి కాంగ్రెస్ వ్యూహం.

ప్రత్యేకం కోసం ప్రత్యేకం

Jun 15, 2013


కేసీయార్ బందుకు పిలుపు ఇవ్వడం కొందరు తెలంగాణా వాదనాయకులకు కోపం తెప్పించింది. అందరూ కలిసి ఆలోచన చేసి తెలంగాణా జేఏసి తరఫున బందు ప్రకటన ఇచ్చివుంటే బాగుండేది అని వారి ఆలోచన. అందరిమీదా చెప్పమని కోరుతున్నారు. కానీ

సాక్షి పై నిషేధమంటున్న చంద్రబాబునాయుడు

Jun 14, 2013




ఒక సంఘటన ఎలా జరిగిందో చెప్పడాన్ని న్యూస్ అంటాము: అదే ఎందుకు జరిగిందో చెప్పడాన్నే రాజకీయమంటాము.  ఇవాళారేపూ పత్రికలు ఒకరిద్దర్ని ఇంటర్వ్యూ చేసి ఆయా సంఘటనలు ఎందుకు జరిగాయో వివరిస్తున్నాయి. అది కొందరి అభిప్రాయాలను మార్చవచ్చు. ఏపత్రిక అయితే తమ వాదనలతో , అది లోపభూయిష్టంగా వున్నప్పటికీ, ప్రజలను నమ్మిస్తుందో అది విజయం సాధించినట్లే. అలా ప్రజలను నమ్మించలేని రాజకీయ పార్టీ తమ ఆయుధ శక్తిని ( తమ పత్రికల ద్వారా తమ వాదనను ప్రజలచే నమ్మించే నైపుణ్యాన్ని పెంచుకునే శక్తిని) బలోపేతం చేసుకోవాలేగాని బహిరంగ నిషేధం ప్రచారం చేయడం మంచిది కాదు.

కర్ణాటకలో ఫలించిన ఇంకాం ఎత్తుగడ

Jun 9, 2013






కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఇంకాం ఘన విజయం సాధించింది. కేంద్రంలో తనకున్న అధికారం సహాయంతో తాను ప్రాబల్యం కోల్పోయిన రాష్ట్రాలలో ఆపరేషన్ కొండవీడు ద్వారా లబ్ది పొందాలని చేసే  ప్రయత్నాలు సఫల మౌతున్నాయి. రెండుముక్కల సిద్ధాంతం ద్వారా అంటే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని బలహీనపరచి, ఆంధ్రప్రాంతానికి చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడంద్వారానూ, అలాగే కేసీయార్ సహకారంతో తెలంగాణా రాష్ట్రంలోనూ అధికారాన్ని అందుకోవాలనే 2009 నాటి ఎత్తుగడ జగన్ కారణంగా మార్చుకోవలసివచ్చింది.

త్వరలో తెలంగాణా రాజ్యం

Jan 27, 2013




ఆంధ్రప్రదేశ్ లో సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి గనుక ఈ ఎన్నికల అనంతరము విభజన ప్రకటన వెలువడవచ్చును. ఆంధ్రప్రదేశ్ అనే పేరు మారే రోజొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చాలిగనుక వారిని ఢిల్లీకి పిలిపించుకొని లాంఛనప్రాయంగా మరణమృదంగం వినిపిస్తారు.

Wrong Signals

Sep 16, 2012

త్వరలో ఆంద్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చీలబోతుంది. ఆంద్రా ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చిరంజీవి నియమించబడతాడు. తెలంగాణాకు కేసీయార్ ముఖ్యమంత్రి అవుతాడు.

నేటి రాజకీయం చలనచిత్రాత్మకం (ఆపరేషన్ కొండవీడు)

Aug 20, 2012


నేటి రాజకీయం తీరుతెన్నులు చూస్తుంటే ఓ కాల్పనిక చలన చిత్రం చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రాజకీయాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏదేశంలోనూ ఇలాంటి పరిస్ధితులు లేవు.

ఆపరేషన్ బురిడీ అనే నిస్సహాయ ఎత్తుగడ

Nov 7, 2011


మన దేశంలో యుపియే నాయకత్వంలోని ప్రభుత్వం బలహీనమైనదని మీకూ తెలుసు. అది తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అనేక తంటాలు పడుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వానికి ఈ ప్రమాదాలనుండి బయటపడే మార్గాలకోసం చూస్తుంది.
మనం సినిమాల్లో చూస్తుంటాంగదా హీరోబృందం విలన్ వలలో చిక్కుకొని తప్పించుకొనే దారిలేక వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతున్నట్లు నటిస్తారు. విలన్ మరియు అతని అనుచరులు ఈ డ్రామాను నిజమనుకొని వెఱ్ఱిమొహాలేసుకుని చూస్తుంటారు. అదను చూసి విలన్ చేతిలోని తుపాకీని ఎగరగొట్టి హీరోగారి బృందం ఆపదనుండి తప్పించుకుంటుంది. కదా.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ ట్రిక్కునే ప్రయోగించింది. కేంద్రమంత్రి రాజా తప్పుచేశాడని మరోకేంద్రమంత్రి పత్రికా ప్రకటన ఇస్తాడు. సిబిఐ వారు ఆమంత్రిని అరెష్టుచేసి జైలులో పెడతారు. మంత్రుల అవినీతికి ఆధారాలున్నాయని వాటిని త్వరలో బయటపెడతామని , వారికి  జీవిత ఖైదు , ఉరిశిక్ష పడవచ్చేమో అంటూ పత్రికలలో వ్యాఖ్యానాలు వస్తాయి. ఇదంతా నిజమేనని పాపం బిజేపి, కమ్మనిష్టులు వంటి మతమనే మత్తులోవున్న పార్టీలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఇక వీళ్ళ నెత్తిన మొట్టడమే తరువాయి . తరువాత కథ ఏం జరగబోతుందో మీకు అర్ధమైందిగదా...
అదే డ్రామాని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆడించాలని చూశారు. మంత్రి శంకరన్న తన తోటి మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశాడు. కానీ మన కోర్టులు అంగీకరించలేదు. బహుశా ఇక్కడివాళ్ళు ఈ కహానీలు నమ్మరనీ , అనలుకే మోసమొస్తుందనుకున్నారేమో. ఏమంటారు...

జగన్ భవిష్యత్తు ఏమిటి?

Apr 16, 2011


చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త లేకుండా, వచ్చిన అవకాశాలను జారవిడుచుకొని, మూడున్నర ఏళ్ళపాటు మీరెన్ని తప్పులు చేసినా మిమ్మల్నేమీ అననంటూశత్రువులకు అవకాశం ఇవ్వడం వంటి జగన్ రాజకీయ మార్గాన్ని పరిశీలిస్తే కొంత ఆందోళన కలుగుతుంది. ఎన్నికల బరిలో రాజకీయాలు చేయకుండా రాముడు మంచి బాలుడు తరహాలో ఎన్నికల యుద్ధంలోకి జగన్ ప్రవేశించినట్లు కనిపిస్తుంది. ప్రస్తుత అవినీతి మయమైన రాజ్యంలో కుట్రలు, కుయుక్తులు లేకుండా రాజకీయాలు ఊహించడానికే భయంగా ఉంది.
 ఎన్నికలలో జగన్ ను ఓడించడం జీవన్మరణ సమస్య సోనియాకాంగ్రెస్ వారికి, కు.రాజనీతి దురంధరుడైన చంబా కు . కనుక వారిరువురూ కలిసికట్టుగా నిలవడం జగన్ కు ఎన్నికలలో ఎదురు దెబ్బే. కాంగ్రెస్ పార్టీ వారు భ్రమలు కల్పించడంలో నేర్పరులు. వారు ఈ ఎన్నికలలో ఓడిపోతే రేపు జనరల్ ఎన్నికలలో కూడా తప్పనిసరిగా ఓడిపోతారు. కనుక ఈ యన్ని ఈ ఎన్నికల్లో ఈ ఒక్క నియోజకవర్గంలో ఓడించగలిగితే రేపు రాష్ట్రమంతా ఓడించడం సులువు. కనుక అనేక ఎత్తుగడలు ప్రయోగించి జగన్ వర్గాన్ని డిఫెన్స్ల్ లో పడవేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహనరెడ్డి అనే పేరుగలిగిన వారిని పోటీపెట్టడం ద్వారా జగన్మోనహనరెడ్డికే మీ ఓటు కుండ గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, జగన్మోనహనరెడ్డికే మీ ఓటు బండి గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, జగన్మోనహనరెడ్డికే మీ ఓటు ఆకు గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, జగన్మోనహనరెడ్డికే మీ ఓటు ఏనుగు గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, ఇలా ఓటర్లని అయోమయానికి గురిచేయడం, మంత్రులను అందర్నీ మోహరించి ప్రజల్ని ప్రలోభపెట్టడం, వీధిలోని రింగులీడర్ల మొదలు ఎంపీల దాకా తమ గ్రిప్పులో పెట్టుకోవడం, జగన్మోహనరెడ్డి ఓటర్లకు అధికమొత్తంలో ఓటుకు నోట్లు ఇవ్వబోతున్నాడని ప్రచారం చెయ్యడం – తద్వారా ఓటర్లను నిరుత్సాహానికి గురిచేయడం, ఓటర్లను సారాలో ముంచడం, మహిళలకు ఏటియం కార్డులంటూ ఊరించడం, బర్రెలు గొర్రెలు, లోన్లంటూ ఉచ్చులు బిగించడం, జగన్ అనుయాయులపే అనేక అక్రమ కేసులు బనాయించడం. వైయ్యస్ మంచివాడేగాని జగన్ అసమర్ధుడని ప్రచారం చేయడం, జగన్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని కనుక తమ పరువును నిలుపుకోవడం కోసం అంటూ మీ ఓట్లనివేస్తే చాలునంటూ ఓటుబ్యాంకును కొల్లగొట్టడానికి ఎత్తులు వేస్తారు.
ఇదే పరిస్తితులు తెలుగుదేశం పార్టీకి కూడా ఉన్నాయి. జగన్మోహనరెడ్డిని ఎన్నికలలో గెలవగలిగే పరిస్తితులు చంద్రబాబుగారికి లేదని తేలిపోవడంతో తెలుగు దేశం నాయకునిగా చంద్రబాబు తప్పుకొని జూనియర్ ఎంటీఆర్ ను నిలపాలని కొందరు పోరాడుతున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారేకి మద్దతు ప్రకటించిన నేటితరం అంతతేలికగా కాంగీ,తేదేల ఎత్తుగడలకు లొంగుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

జగన్ భవిష్యత్తు ఏమిటి?

Jul 18, 2010







నేడు ప్రపంచమే పూజారుల సలహాలపై నడుస్తుంది. ఇండియాలో భ్రాహ్మణపూజారుల పెత్తనం కొనసాగుతుంది. ఇది అన్ని పార్టీలవలే కాంగ్రెస్ లో కూడ తెరవెనుకనుండి సోనియాను , తద్వారా భారత రాజకీయాలను కూడా శాసిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కీ.శే.డా..రాజశేఖరరెడ్డిగారిది పార్టీలో కిరస్తానీ విభాగం. కనుకనే గతంలో కూడా హిందూ నాయకులు చిత్తుగా ఓడి చతికిలబడ్డతర్వాతే కిరస్తానీ విభాగపు నాయకునికి అధికార పోరులో గెలిచేందుకు పార్టీ ఆంధ్ర సంస్థానాధీశునిగా భాధ్యత అప్పగించబడింది. అయితే రాజశేఖర్రెడ్డిగారు అప్రతిహతంగా అపరచాణుక్యుడైన నారావారిని కట్టడిచేయగల ఏకైక నాయకునిగా ఎదగడమే కాకుండా కేంద్రనాయకత్వ పగ్గాలుకూడా చేజిక్కించుకునేంత ప్రమాదమేర్పడిన తరుణంలో రానున్నప్రమాదాన్ని గుర్తించిందా అన్నట్లుగా సదరు వర్గం ముఖ్యమైన నాలుగు పార్టులు పెకలించివేయబడిన తూనీమానంతో అతణ్ణి కాషాయగ్యాసర్తో అశాసినేట్ చేయించినతర్వాత ప్రస్తుతము అవకాశమున్నదిగనుక వాని వారసునికి గద్దెనందనీయక సహజవ్యాపారివేత్తను బానిసరాజుగా నియమించడంకూడా ఆ పూజారివర్గం సలహాపై ఆధారపడిచేసినవే . ఒకవేళ జగన్ మతంమార్చుకుంటే అతనికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడానికి అధిష్ఠానజోరీగలకు అభ్యంతరములుండకపోవచ్చునుగాక. లేనియడల మరలా హిందూప్రతినిధులంతా తుక్కుకిందగా నాచంబానా చే కొట్టబడిన తర్వాత గానీ ఈ కిరస్తానీ రెడ్డిగారికి నాయకత్వబాధ్యతలు అప్పగింపబడే అవకాశం రాదు. ఈ విషయం జగన్ కు తెలుసుగనుకనే ఎవరెంత రెచ్చగొట్టినా, నెట్టినా, తిట్టినా రోషం తెచ్చుకోక, చూరుపట్టుకు వేలాడుతున్నాడు.  ఇతడు ఏనాటికీ పార్టీని వీడడు, తన పోరాటం ఆపడు. మడిమ తిప్పడు.

రాజకీయాల్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి...

Apr 10, 2009

ప్రజాస్వామ్యమంటే ప్రజల నుండి, ప్రజల కొరకు , ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, అంటే, అవును పైకి కన్పిస్తున్నవిధంగా ఇది ఒక్కరి చేత నిరంకుశంగా పాలింపబడడం కాదు , ప్రతి నిర్ణయం వెనుక అనేకమంది ఉన్నారు అని సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారనే ఉద్దేశ్యంతో ఈ టపా రాస్తున్నాను.
కొన్ని విషయాలు మీరు కూడా అంగీకరిస్తారు. ప్రజల కొరకు అంటే వ్యాపారుల కొరకు లేదా ధనవంతుల కొఱకు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఏమని ప్రామిస్ చేస్తాడంటే ‘ వస్తువుల ధరలు పెంచకుండా వ్యాపారులనూ, ధనవంతులనూ కంట్రోలు చేస్తానని పేదలకు వాగ్దానం చేస్తాడు, అలాగే పేదలు తిరగబడి తన్నకుండా మిమ్మల్ని కాపాడుతానని ’ వ్యాపారులకూ, ధనవంతులకూ వాగ్దానం చేస్తాడు. అయితే వ్యాపారులనూ, ధనవంతుల పక్షాన్నే ఎక్కువగా ఉంటాడు.
ప్రజల నుండి అంటే ప్రజలు ఎవరైనా ఎన్నికలలో పోటీచేయవచ్చుననుకోకండి. వాడు 5వేలో 10వేలో ధరావత్తు చెల్లించగలవాడై యుండాలి. అతడ్ని ప్రపోజ్ చేసేవాళ్ళు కూడ ఉండాలి. పదివేలున్నాయిగదాని నామినేషను వేయబోయేరు గనుక , జాగ్రత్త ఇరగదంతారు. ఎప్పుడైనా ఏదైనా టెండరు వేసివుంటే గనుక అనుభవం వచ్చివుండును. గతంలో రాచరిక పద్ధతుల ప్రకారం రాజు కొడుకు రాజయ్యేవాడు. నేటి ప్రజాస్వామ్యం ప్రకారం రాజులు, వారి వారసులూ, భూస్వాములూ, జమీందారులూ వారి ప్రాంతాలనుంచే కాకుండా దేశంలో ఎక్కడ నుంచైనా పోటీచెయ్యవచ్చునని అర్థం. నేడు చాలామంది రాజకీయాలను అపార్థం చేసుకుంటున్నారు. నేను పార్టీలో ముందునుంచీ ఉన్నానుగదా, చిరు సినిమా రిలీజుకు పోష్టర్లు కట్టానుగనుకా... ఇవి పోటీ చేయడానికి క్వాలిఫికేషన్స్ కావు.
ప్రజల చేత అంటే మనంతా మనకు నచ్చిన భూస్వామినో, ధనవంతుడినో , జమీందారునో ఓటు ద్వారా ఎంచుకోవచ్చు. కనుక లోకసత్తాలాంటి మాటల పార్టీవాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించడం దండగ. ( డబ్బు గలవారికి సీటు ఇచ్చిఉండకపోయుంటే )
ఇది పేరుకి ప్రజాస్వామ్యమే గాని నిజంగా ప్రజా ప్రతినిధులు పరిపాలనా విషయాల్లో కలుగజేసుకోరు. నిర్ణయాన్ని పైవారికే వదిలేస్తారు. ఒక రాజు ఎడల సేవకుడు ప్రవర్తించినట్లు లొంగుబాటు ప్రదర్శిస్తారు. తమ క్రింది వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుతూంటారు. తెలంగాళా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం సోనియాగారే చేయాలని కోరడానికి కారణం ఇదే. దేశానికి రాజు లేక రాణి సోనియా అనుకుంటే , ఆ స్థాయిలో గతంలో పోటీ పడిన పి.వి., శరద్‌పవార్,సంగ్మా వంటివారు దీనికి ఉదాహరణ. మన రాష్ట్రంలో వైయ్యస్సు కు డియ్యస్సు, హనుమంతు, వగైరాలు పోటీ . వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఎంచుకొని అధికారం అప్పగించే అవకాశం సోనియా వద్ద ఎప్పుడూ ఉంటుంది. అలాగే మన జిల్లాల్లో మంత్రులుగా ఎంచుకునేందుకు ప్రతి ప్రాంతం నుండి నలుగురైదుగురుంటారు . వారిలో ఎవరో ఒకర్ని ఎంచుకునే స్వేచ్చ వైయ్యస్కు ఎప్పుడూ ఉంటుంది. అధికారం అలా అంచలంచలుగా పైకీ క్రిందికీ నిర్మాణమై యుంటుంది. ప్రతి ప్రాంతంలో ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి పైస్థాయికి సంబంధించిన ఆయానాయకుల తాలూకూ ప్రాతినిధ్యం ఉండాలి. అంటే వైయస్సార్ తాలూకూ ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులూ, డియ్యస్కు సంబంధించిన ఎస్సీ,ఎస్టీ,మహిళ, మైనార్టీ, ప్రధాన కులానికిచెందిన నాయకులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులూ .... ఇలా నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఆయా స్థాయీలలో ఎల్లప్పుడూ నాయకత్వంకై పోరాటం జరుగుతూ ఉంటూంది. అంటే ప్రతి నాయకుడికీ ఓ గాడ్‌ఫాదర్ పైస్థాయిలో ఉండాలి . కాబట్టి ఓటువేసే ప్రతివ్యక్తికి కూడా పైస్థాయిలో ఓ నాయకుడు కావాలి. అంటే మన వీధిలో లేక వార్డులో ఉన్న ఛోటా నాయకులలో ఎవర్నో ఒకర్ని మనం ఎంచుకోవాలి. అతనితో ఇలా చెప్పాలి. సార్. మీరు ఎవరికి ఓటు వెయ్యమంటే మేము వారికి వేస్తాము. మీరు ఎప్పుడు ఎ మీటేంగుకు రమ్మంటే అప్పుడు మా పని మానుకుని వస్తాము. ( దానికి పేమెంటు అతడిస్తాడు . డోంట్ వర్రీ ) మాకు ఏదైనా ప్రభుత్వసహాయం కావాల్సివచ్చినా మీరు ఇప్పించాలి. రౌడీలనుంచీ , పోలీసులనుంచి మమ్మల్ని కాపాడాలి. అని మనం ఓ అణు వొప్పందం లాంటి అగ్రిమెంట్ చేసుకోవాలి . నేనెందుకు ఓటెయ్యాలి అని ఎవరైనా నిర్లక్షంగా ప్రవర్తిస్తే వాళ్ళకే నష్టం . మనం కూడా ఓమాదిరి నాయకుడిలాగా మారాలి. మన ఇంటిప్రక్కన ఉండేవాళ్ళని బాగా మంచిచేసుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి మన కంట్రోలులో పెట్టుకోవాలి . కనీసం నలుగురైదుగురుతో ఓజట్టు కడితే తద్వారా మన వీధి నాయకుడి నుంచి మంచి గౌరవం లాభం పొందవచ్చు. ఇది ఒకటవ రాజకీయ పాఠం. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి వ్యాఖ్యానంతో సంప్రదించండి.
సదా మీ సేవలో ,
ఇట్లు,
మీ ఏరియా రింగ్ మాస్టర్.

మెగాస్టార్ చిరంజీవి గారు సిఎం అయితే అవినీతిని అరికట్టగలడా?

Jul 4, 2008

మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయపార్టీ నిర్మిస్తున్న క్రమం వ్యూహాత్మకంగా, ముచ్చటగా ఉంది. ఠాగూర్ సినిమాలోలాగా అవినీతిని అంతంచేయగల ఏకైక నాయకుడుగా చాలామంది ప్రజలు నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది. చిరంజీవి గారు ఒక రాజకీయ పార్టీకి కావలసిన అన్ని హంగులూ ఏర్పరచుకుంటున్నట్లుగావుంది. నా అంచనా ప్రకారం వైయ్యస్సార్ గారు నేటి నుండి అవినీతిపై అవిశ్రాంత పోరు చేస్తానికి సిద్ధమౌతున్నట్లుగావుంది.కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యంకాకపోవచ్చు. చిరంజీవిగారి ఎత్తుగడ కూడా అవినీతిలేని పాలన హామీగా ఎన్నికలబరిలోకి దూకి, ఆన్ని ప్రతిపక్షాల సహకారంతో రాజ్యాధికారం చేపట్టాలని కొండంత ఆశతో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అది అడియాసే కావచ్చు. ఎందుకంటే...
మనదేశ చట్టాలను గమనించండి. బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించడానికి కొన్ని చట్టాలను చేశాడు.అవే బానిస చట్టాలు. చట్ట ప్రకారం ప్రభుత్వరహస్యాలు వెల్లడించరాదు. ప్రభుత్వం నుండి ప్రజలెవరైనా సహాయం పొందాలంటే కొంత లంచంగా సమర్పించుకోవాల్సివచ్చేది. పోలీస్ సహాయం కోరితే పోలీసువారికీ, న్యాయ సహాయం కోరితే పీ.పీ గారికీ, ఆస్తి కొన్నా,అమ్మినా రిజిష్టారువారికీ..... ఇలా అన్నిరకాల ప్రభుత్వాధికారులకు కొంత మొత్తం లంచంగా చెల్లించితేనే అధికారులు పనిచేసేవారు. అలా ఆయాశాఖలవారు తాము వసూలు చేసిన మొత్తాలను( 90శాతం ) తమ పై అధికారులకు అందిస్తారు. అలా అధికారులందరివద్దనుండి డబ్బు వసూలు చేసే అధికారినే కలెక్టర్ అంటారు.ఆ విధంగా బ్రిటీష్ వారికి డబ్బు ముట్టేది. మనకి స్వాతంత్ర్యం వచ్చినా చట్టాలు మారనందున తమ పాత అలవాట్ల ప్రకారం నేటికీ లంచం అడగబడుతూంది.
ఇక మెగాస్టార్ సియ్యం అయ్యాడనే అనుకుందాం. తాను చట్టాలు మార్చగలడా? రాష్ట్రాలను పాలించడానికి రాజప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు వందమందికి పైగా ఐఏయస్సులూ, ఐపీయస్సులూ, ఐయ్యస్సెఫ్ లూ వస్తారు.ఆ వచ్చిన వారిలోనుండే మనం పరిపాలింపబడాలి. వారికి కొద్దిమందికైనా ఎంతో కొంత లంచంగా యివ్వందే మనం చెప్పినట్లు పనిచేస్తారా? .....ఏమో..... చెయ్యకపోవచ్చనుకుంటున్నాను. మీరేమంటారు?

అణు ఒప్పందం మీకు అంగీకారమేనా ?

Jun 30, 2008

అమెరికా ఇండియా దేశాల మధ్య అణు ఒప్పందం జరగాలని, వద్దని రెండు విధాలుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు?
నాకు తెలిసినంతవరకూ అమెరికా పాకీస్థాన్ వైపూ, రష్యా ఇండియా వైపూ ఉండేవి. ఇండియా అలీనదేశాలకు నాయకత్వం వహిస్తుంది.ఇప్పుడు అమెరికా మన విద్యుత్ అవసరాలను కోసం అణువిద్యుత్తు తయారుచేసుకునే పరిజ్ఞానాన్ని మనకు ఇవ్వడానికి తహతహ లాడుతుంది. ఎందుకు?
ఈ అణు ఒప్పందం అమలు 4 దశలుగా జరగాలి. 1.అణుఇంధనాన్ని సప్లై చేసే గ్రూపు ( NSG ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. 2.అంతర్జాతీయ అణు సంస్ధ ( IAEA ) ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. ( ఇప్పుడు జరగబోయే సీను ఇదే.)3. భారతదేశ కేంద్ర ప్రభుత్వం అమెరికా షరతులకు అంగీకరించాలి. 4. పై మూడు ఒప్పందాలను పరిశీలించాక అమెరికా పార్లమెంటు అంగీకరించి చట్టం చెయ్యాలి.
ఇప్పటివరకూ 25 దేశాలతో అమెరికాకు అణు ఒప్పందం కుదిరింది. వాటిల్లో కమ్యూనిష్టులు అభిమానించే చైనా దేశం కూడా ఉంది. మరి కమ్యూనిష్టులు ఈ అణు ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ 25 పెద్దదేశాలు సంతకాలు చేసి అంగీకారం తెల్పిన తర్వాత 2007లో Hyde చట్టాన్ని అమెరికా తయారుచేసి అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలూ ఆమోదించింనాయి, అమెరికా ప్రసిడెంటు జార్జి బుష్, కూడా సంతకం చేసాడు. దానికంటే ముందు 2005 జూలై నెలలో మన ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అణు ఒప్పందం విషయం బుష్ ప్రతిపాదించాడు. 2006 మార్చి లో ఢిల్లీలో భారత ప్రధాని మనమోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. మనం చాలా ఆనందించాం, ఆశ్చర్యపోయాం ఎందుకు ఆయాచితంగా ఈ వరాన్ని ప్రసాదిస్తున్నారా అని. తర్వాత తెల్సిందేమిటంటే ఇరాన్ దేశం నుండి పాకీస్థాన్ , ఇండియా మీదుగా చైనా దేశానికి గ్యాసు పైపు లైను నిర్మించి , తక్కువ ధరకు గ్యాసు మనకు లభించేలాగా, తక్కువ ఖర్చుతో మనం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలిగేలాగా చైనా, పాకీస్థాన్ , ఇరాన్ లతో మనం ఒక ఒప్పందం చేసుకొని ఉన్నాం. ఈ ఒప్పందాన్ని చెడగొట్టాలని అమెరికా ఎత్తుగడ పన్నింది. పాకీస్థాన్ ఎటూ అమెరికా మాట కాదనదు, మరి మనల్ని ఒప్పించాలంటే ఈ ఉచిత అణువిజ్ఞానబదలాయింపు అనే అస్త్రం ద్వారా మనల్ని పడగొట్టింది. ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా మనచేత ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయించింది. వెనుకబడిన దేశాలతోఒప్పందంగా భావించి, Hyde చట్టాన్ని దీనితో జతచేశారు.Hyde చట్టం ప్రకారం మనం ఇతర దేశాలతో చర్చలు జరపాలంటే అమెరికా అధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ఏసమయంలో అయినా తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలా ఈ Hyde చట్టం లోని సెక్షన్ 103, 104, D2 మొదలైనవి భారతదేశానికి ఇబ్బంది కలిగించే అంశాలు. “ చట్టంలో అలా వుంది గానీ నేను ఆ అధికారాన్ని వినియోగించను ” అని జార్జి బుష్ గారు అంటున్నారు.
మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ అణు ఒప్పందం బాగానేవుంది అన్నారు. కానీ మనదేశ అణుశాస్త్రవేత్తలు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం మైనారిటీగావున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఆమోదం పొందకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరోసారి తెల్లవానికి తాకట్టుపెట్టడం మంచిదంటారా?
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||