పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని
వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకో స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఆంధ్రరాష్ట్ర విభజన
జరిగిన తీరు తనకు నచ్చలేదని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రజలకు
పిలుపునిచ్చాడు. అయితే అంతటి ద్వేషం కాంగ్రెస్ పార్టీపై ఎందుకు పెంచుకున్నాడో
అర్ధం కావడంలేదు.
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లేదు. మునిసిపల్
ఎన్నికల్లో కూడా పోటీచేసే అభ్యర్ధులు కాంగ్రెస్ పార్టీకి లేరు. అలాంటిది ఉనికిలో
లేని పార్టీని ఓడించాలంటూ ఎగిరెగిరి ఆవేశంగా మాట్లాడడం ఎందుకో అర్దం కావడంలేదు. మన
రాష్ట్ర విభజనకు బీజేపీ సహకరించకపోతే విభజన సాధ్యం అయ్యేది కాదని పవన్ కళ్యాణ్ కి
తెలియకపోవడం మరోవింత. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర
విభజనకు సహకరించిన మోడీపార్టీకి ఓట్లు వేయమని ప్రచారం చేయడం మరింత వింతగా వుంది.
రాష్ట్రం విభజించబడినందుకు ఇంతగా చించుకుంటున్న ఈ నటునికి ఈ రాష్ట్రం విడగొట్ట బడడాన్ని వ్యతిరేకించి, దేశమంతా పర్యటించి,
అనేకమంది రాజకీయ నాయకులతో మాట్లాడి, నిరాహార దీక్షలు చేసి , సామాన్య ప్రజలచే
నీరాజనాలందుకుంటున్న ఓ ప్రముఖ యువ నాయకుడు పవన్ గారికి కనిపించక పోవడం, అతనిని
గూర్చి తలంచడమే మహాపాపమన్నట్లు కనీస ప్రస్తావన చెయ్యకపోవడం చూస్తుంటే సీమాంధ్రలో
కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు ఆ యువ సింహానికి చెందకుండా పార్లమెంటు ఓటుబాంకును
మోడీవైపు మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానించడానికి ఆస్కారం కలుగుతుంది.
మరి అసెంబ్లీ ఓట్లు బీజేపీకి అడగడం లేదు. ఎందుకంటే యువసింహానికి వ్యతిరేకమైన ఓటు
చీలగూడదని. రాష్ట్ర అసెంబ్లీ ఓటు వృద్ధనాయకునికీ, పార్లమెంటు ఓటు మతనాయకునికి
చెందేలా ఈ క్రొత్తపార్టీ నిజమైన సమైక్యవాదుల ఓట్లు చీల్చి చెండాడి చిందరవందర
చేయాలని ఎగిరెగిరి పడుతున్నాడు. ప్రస్తుతం నాయకులంతా వృద్ధుని బలపరుస్తున్నారు
గానీ సామాన్య ప్రజలు ఎక్కువాగా యువనాయకత్వాన్నే కోరుతున్నట్లు కనిపిస్తుంది.
చివరకు 4 శాతం ఓట్ల తేడాతోనైనా యువరాజ్యం ఏర్పడుతుందని చాలామంది ఆసిస్తున్నారు.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !