మహేష్ బాబు తన కుమారునితో కలిసి నటించిన చిత్రం నేనొక్కడినే. బిజినెస్
మాన్ లో ఆగ్రహం చూపిస్తే నేనొక్కడినేలో ఆందోళన చూపించాడు. చిన్నతనంలోనే
తల్లిదండ్రులను ముగ్గురు వ్యక్తులు వచ్చి చంపి తనను కూడా చంపబోతుంటే పారిపోయి ఓ
అనాధగా నిరంతరం ఆ ముగ్గురు తనను చంపబోతున్నారని భయంతో భ్రమతో బ్రతికే ఓ మానసిక
సంఘర్షణ లో జీవించే వ్యక్తి కధే నంబర్ వన్ నేనొక్కడినే.
ఆ ముగ్గురిని తాను గుర్తుంచుకుంటాడు. తాను పెరిగి పెద్దవాడై రాక్
ష్టార్ గా పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఇంగ్లాండులో ఆ ముగ్గురులో ఒకడిని గుర్తించి
తన తల్లిదండ్రులను ఎందుకు చంపారో తెలుసుకోబోతుండగా ప్రమాదవశాత్తు ఓ కారు ప్రమాదం
జరిగి ఆ ముగ్గురిలో ఒకడు చనిపోతాడు.
తనను చంపడానికి వచ్చిన మిగిలిన ఇద్దర్ని కూడా తాను చంపానని భ్రమించి
పోలీసులకు లొంగిపోతాడు. ఐ న్యూస్ జర్నలిష్టు మరియు హీరోయిన్ ప్రత్యేక
చిత్రీకరణవల్ల రాక్ ష్టార్ భ్రమలో ఉన్నాడని లోకానికి తెలుస్తుంది. డాక్టర్
పరీక్షలవల్ల, పోలీసుల ,జర్నలిష్టుల పరిశోధనల వల్ల
ఇతని చరిత్ర ప్రపంచానికి
తెలుస్తుంది.
పోలీసులకు జర్నలిష్టులకు దూరంగా వుండాలని గోవా వెళ్ళిన హీరోను
వెదుకుకుంటూ హీరోయిన్ తన బృందంతో గోవా వస్తుంది. అక్కడ హీరోతో పరిచయం పెంచుకునే
సమయంలో మూడు సార్లు హీరోయిన్ను ప్రమాదాలనుండి హీరో కాపాడతాడు. హీరోయిన్ ప్రాణాలకు
ప్రమాదం జరగబోతుందని ఊహించిన హీరో ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూవుంటాడు. ఆ
సమయంలోనే హంతకులబారినుండి హీరోయిన్ను కాపాడతాడు. ఆమెను చంపడానికి వచ్చిన పోనీటైల్
విలన్నికూడా భ్రమలో ఉన్నాననుకుని చంపేస్తాడు. పోనీటైల్ విలన్ వద్దవున్న ఫోన్ నంబర్
ప్రకారం మూడవ హంతకుణ్ణి పట్టుకొని తన తల్లిదండ్రులను ఎందుకు చంపారో చెప్పమంటాడు.
తాను ఇటీవలే హీరోను గురించి తెలుసుకొని తనను కలుసుకోవాలని ప్రయత్నించానని అయితే కుదరలేదని చెబుతాడు. అయితే హీరో అనుకుంటున్నట్లుగా తాను హంతకుడిని కాదని, తాను ఒక కారు డ్రైవరునని, ఇద్దరు దొంగలు తన కారులో వచ్చి హీరో తల్లిదండ్రులను చంపి హీరోను కూడా చంపబోయారని, హీరో తండ్రి తనకు ఓ సంచి ఇచ్చి తన కుమారునికి ఇమ్మని చెప్పి చనిపోయాడని, తాను ఇన్నాళ్ళకు తనని గురించి తెలుసుకొని వచ్చానని, ఆ సంచిని ఇచ్చి, అతని తల్లిదండ్రులను సమాధిచేసిన చోటును చూపిస్తాడు. తన తల్లిదండ్రులను చంపిన ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు గనుక ఆ మూడవవాడు డ్రైవరు కనుక తనకు ఇక ఎవరూ శత్రువులు లేరని అయితే తన తల్లిదండ్రులను గురించి తెలుసుకోవడంకోసం తన తండ్రి ఇచ్చిన మూడు వస్తువుల్లో ఒకటి బ్రిటిష్ వారి నాణ్యం గనుక ఇంగ్లాండు వెళ్ళి పరిశోధించాలనుకుంటాడు.
తాను ఇటీవలే హీరోను గురించి తెలుసుకొని తనను కలుసుకోవాలని ప్రయత్నించానని అయితే కుదరలేదని చెబుతాడు. అయితే హీరో అనుకుంటున్నట్లుగా తాను హంతకుడిని కాదని, తాను ఒక కారు డ్రైవరునని, ఇద్దరు దొంగలు తన కారులో వచ్చి హీరో తల్లిదండ్రులను చంపి హీరోను కూడా చంపబోయారని, హీరో తండ్రి తనకు ఓ సంచి ఇచ్చి తన కుమారునికి ఇమ్మని చెప్పి చనిపోయాడని, తాను ఇన్నాళ్ళకు తనని గురించి తెలుసుకొని వచ్చానని, ఆ సంచిని ఇచ్చి, అతని తల్లిదండ్రులను సమాధిచేసిన చోటును చూపిస్తాడు. తన తల్లిదండ్రులను చంపిన ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు గనుక ఆ మూడవవాడు డ్రైవరు కనుక తనకు ఇక ఎవరూ శత్రువులు లేరని అయితే తన తల్లిదండ్రులను గురించి తెలుసుకోవడంకోసం తన తండ్రి ఇచ్చిన మూడు వస్తువుల్లో ఒకటి బ్రిటిష్ వారి నాణ్యం గనుక ఇంగ్లాండు వెళ్ళి పరిశోధించాలనుకుంటాడు.
అక్కడికి వెళ్ళగానే తనపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ
వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో తానొక సింబల్ ను చూస్తాడు. అది తన తండ్రి ఇచ్చిన
వస్తువులలో క్యూబ్ పై గీచి ఉంది. అది ఒక బాంకు గుర్తు. ఆ బాంకు లో తన తండ్రి తాను
కనిపెట్టిన గోల్డన్ రైస్ మూలకాన్ని దాచాడు. కనుక దానికోసమే తన తండ్రిని
చంపివుంటారని ఊహించి తనపై ఎవరో హత్యాయత్నంచేసి తన ప్రియురాలిని కిడ్నాప్ చేసారని
నాటకమాడి పోలీసుల కష్టడీలో ఉంటాడు. అతనికోసం ఇద్దరు వస్తారు. వారిద్వారా నాజర్
తాను డ్రైవర్ అని అబద్ధం చెప్పాడని అసలైన హంతకుడు అతడేనని గ్రహించి అతడ్ని
చంపేస్తాడు. హీరో తల్లదండ్రుల గురించిన సమాచారం చెప్పకుండానే నాజర్ చనిపోతాడు.
నిరాశతో వెనుదిరిగిపోతున్నహీరోకు ఓ స్కూలు బస్ లో పిల్లలు పాడుకునే రైం విని ఏవేవో
జ్ఞాపకాలలోతేలిపోతాడు. తన తల్లిదండ్రులకు చెందిన రహస్యాన్ని ఎలా కనుక్కున్నాడో
వెండి తెరపై చూడాల్సిందే.
చిన్నప్పటి గౌతంగా నటించిన మహేష్ బాబు కుమారుడు గౌతం కృష్ట చక్కగా
నటించాడు. సంతోషం, భయం చక్కగా అభినయించాడు. నవ్వుతుంటే సూపర్ స్టార్ కృష్ణ గార్ని
చూసినట్లుగా
ఉంది.
మహేష్ బాబు అప్రమత్తతగా ఉండడం, భయంగా ఉండడం, తన ప్రియురాలిని
రక్షించుకోవనిపడే తపన, ఏకాగ్రత లను చక్కగా పండించారు. తనను ఎవరో చంపబోతున్నారనే
భయం వలన కలిగిన అప్రమత్తతవలన తన ప్రియురాలిని ప్రాణాపాయాలనుండి కాపాడగలిగారు.
సముద్రంలో చేసే విన్యాసాలు వళ్ళు గగుర్పాటును కలిగించాయి. హీరోయిన్ ను చంపడానికి
ఆమె ఇంటికి వచ్చిన పోనీ టైల్ విలన్ అక్కడ హీరోను చూసి ఖంగుతినడం, హీరో తాను భ్రమలో
ఉన్నాననుకొని విలన్ని కల్చేయడం చాలాబాగుంది.క్రికెట్ మాచ్ లో రీ ప్లే కి, రియల్ ప్లే కి ఆర్ అనే లోగో లాంటిది తిరుగుతూ ఉండేలా చూపెడతారు . దానితో ఓహో ఇది లైవ్ కాదు రీ ప్లే అని తెలుస్తుంది. సుకుమార్ గారు అలాంటి గుర్తులేమీ లేకుండా ప్రేక్షకులను కన్ ఫ్యూ్జ్ చేయాలను కున్నాడేమో ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అయినట్లు నటించారు. నంబర్ వన్ అభిమానులా మజాకానా. పాటల్లో హూఆర్యూ, చెలిచెలిచెలియ,
జానీజానీ పాట పల్లవి బాగున్నాయి. నేపద్యసంగీతం బాగుంది. లైటింగ్, కెమేరా బాగుంది. హీరోయిన్ బాగుంది. గోవా బాగుంది. తల్లిదండ్లుల సెంటిమెంటుతో కధ చాలా చాలా బాగుంది.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !