జాతీయ స్థాయిలో జరిగే విలేఖరుల సమావేశంలో సరైన సమాధానాలు ఇవ్వక పోవడం వలన చంద్రబాబు నాయుడు బలహీన పడ్డాడు. సమైక్యమా, ప్రత్యేకమా అని తేల్చి చెప్పలేకపోయారు. సమైక్యమంటే తెలంగాణా లోని పార్టీ సభ్యులు అభిమానులు పార్టీకి దూరమవుతారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఇవ్వాలంటే సీమాంధ్రులు పార్టీకి దూరమౌతారు. అయినప్పటికీ మేధావుల ఓట్లు పోయినా మిగిలిన రైతుల ఓట్లు దూరం కాకుంటే చాలునను కుంటున్నారేమో.
జగన్ చెప్పినట్లుగా సమన్యాయం చెయ్యాలని చంద్రబాబు కోరుతున్నారు. సమన్యాయం చెయ్యడమంటే హైదరాబాదు పట్టణాన్ని ఉమ్మడి రాజధానిగా చేసి , కాలేజీలలో విద్యార్ధులకు సీట్లు కేటాయించేదానిలోనూ, ఉద్యోగాల కల్పనలోనూ యధాతధ స్థితిని కల్పించాలి.
కృష్ట , గోదావరి నదుల నీటి పంపిణీ విషయంలో ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకోవడం. అసలు హైదరాబాదు తెలంగాణాతోపాటు ఇవ్వడం లేదంటేనే వాళ్ళు హైదరాబాదులేని తెలంగాణాను ఆశించరు.
కనుక చంద్రబాబునాయుడు జగన్ మార్గాన్నే అనుసరిస్తున్నప్పటికీ అది జగన్ మార్గమని చచ్చినా అంగీకరించడు.
కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్ ని కూడా విమర్శిస్తూనేవుంటాడు. చంద్రబాబు చేత సమైక్యమో,విభజనో చెప్పించడం ఢిల్లీ విలేఖరుల తరంగాదు. ఎన్ని విన్యాసాలు చేసైనా తన క్యాడర్ ను కాపాడుకుంటాడు.
జగన్ అన్నట్లుగా సమన్యాయమని అనడమేకాకుండా జగన్ చేసినట్లు దీక్ష కూడా చేయాలనుకోవడం తాను జగన్ కంటే దేనిలోనూ తక్కువ కాదని చెప్పుకోవడానికే. గ్రామీణ స్థాయిలో మాట్లాడినట్లుగా జాతీయ స్థాయిలో మాట్లాడడం చంద్రబాబుకు తగదు. ఈ విషయం ఎంతమంది చెప్పినా ఆయన వినడుగాక వినడు.
జగన్ దీక్షలో కూర్చొని వుండగా జనం తండోపతండాలుగా వస్తున్నారు. మరి చంద్రబాబు గారికి జనం వస్తారా. అదేమో ఢిల్లీ గనుక తెలుగువాళ్ళు తక్కువగా వుంటారు. సరే వచ్చిన జనాలను కౌగలించుకొని , దీవించి, పిల్లల్ని ముద్దాడి జగన్ లాగా ఓదార్చగలడా లేడా అనేది ప్రశ్న.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !