2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడే
వైయ్యస్ రాజశేఖరరెడ్డిగారి ఎశాసినేషన్ తరువాత ఆయనకు వారసునిగా
జగన్మోహనరెడ్డి ఎదుగుతాడని కాంగ్రెస్ అధిష్టానవర్గం అనుకోలేదు. తెలంగాణా ఇస్తానని
చెప్పడం ద్వారా చంద్రబాబునాయుడిని
తెలంగాణా ప్రాంతానికి దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఎలాగంటే –
తెలంగాణా ఇవ్వడానికి రాష్ట్రం లోని రాజకీయ పార్టీల మద్య ఏకాభిప్రాయం సాధించి ,
వారి అంగీకారంతో తెలంగాణా ఇస్తామని ప్రకటించుతారు. తెలుగుదేశం దానికి
అంగీకరిస్తే సీమాంధ్ర ప్రాంతం లోని తెలుగు
తమ్ముళ్ళు అలిగి కాంగ్రెస్ లో కలుస్తారు/ లేదా తెలంగాణా ఇవ్వవద్దు అని తెలుగుదేశం
అంటే తెలంగాణాలోని తెలుగు తమ్ముళ్ళు అలిగి దూరమౌతారు, తరువాత అసెంబ్లీ ఎన్నికలు
జరిపితే తెలుగు దేశం సగం ప్రాంతంలో ఉండదుగనుక వారు ఓడిపోయి సోనియా కాంగ్రెస్ అధిక
సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇది 2010నాటి కాంగ్రెస్
వ్యూహం.
కానీ ఎవరూ ఊహించని విధంగా జగన్మోహనరెడ్డి గారి ఓదార్పయాత్రకు జనం నుంచి
మంచి స్పందన లభించింది. తాము ఆశించిన విధంగా కాకుండ జగన్ పార్టీలో బలపడడం
హైకమాండుకు మింగుడు పడలేదు.వైయ్యస్సార్ స్థానంలో ఆయన కుమారుడు బలపడడం ఇష్టపడని
కాంగ్రెస్ పార్టీ జగన్మోహనరెడ్డి గారిని ఓదార్పయాత్రలు చేయవద్దని ఆదేశించింది.
వారి ఓదార్పు యాత్రలలో కాంగ్రెస్ పార్టీ జండాని ఉపయోగించరాదని నిషేధించింది.
విజయమ్మ గారు నెల రోజులు సోనయాగాంధీ ఇంటర్వ్యూ కోసం డిల్లీలోమకాం వేసినా ఆమెకు
సోనియగాంధీ అప్పాయింట్ మెంట్ లభించలేదు. పరిస్థితిని అర్ధం చేసికొని జగన్మోహన
రెడ్డిగారు పార్టీకి , పార్లమెంటు పదవికి రాజీనామా చేశారు. వైయ్యస్సార్ కాంగ్రెస్
అనే పేరుతో క్రొత్తపార్టీని స్థాపించుకున్నారు.
జగన్మోహనరెడ్డి పార్టీ పెట్టగానే కాంగ్రెస్ పార్టీలోనుండి అనేకమంది జగన్
పార్టీలోకి చేరిపోయారు. 2014 లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే జగన్మోహనరెడ్డికి
మెజారిటీ సీట్లువచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలున్నాయని సర్వేలు చెప్పాయి వెంటనే జగన్ మోహనరెడ్డిగారి ఇంటిపై, వ్యాపారాలపై ఆదాయపుపన్ను,సిబిఐ దాడులు
జరిగాయి. అంటే కక్ష్యసాధింపు చర్యలు మొదలయ్యాయి. ఎం.ఎల్.ఏ. శంకరరావు సాక్షి
దినపత్రిక, సాక్షి టివిల పెట్టుబడులపై దర్యాప్తు చేయమని కోరుతూ హైకోర్టుకు లేఖ వ్రాయగా
దానిని సుమోటోగా స్వీకరించి హైకోర్టు నోటీసులు జారీచేసింది. శంకరరావు మరొక
పిటీషను, 333 పేజీల వివరణ పత్రాలు కోర్టుకు ఇచ్చాడు. జగన్ ఆస్తులపై దర్యాప్తు
కోరుతూ టిడిపి నేతలు ఎర్రంనాయుడు, ఆశోకగజపతిరాజు, బైరెడ్డిరాజశేఖరరెడ్డి కేసులు
దాఖలు చేసారు. సోనియాగాంధీ కోరిక ప్రకారం తాను జగన్ పై ఆరోపణలు చేశానని విలేఖరులకు
శంకర్రావు చెప్పాడు. కాబట్టి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండాలంటే మిగిలిన
పార్టీలన్నీ ఏకతాటిపైకి రావలసిన అవసరం ఏర్పడింది. తెలుగుదేశం, కమ్యూనిష్టులు,
బిజెపి కలసి జగన్ పై వ్యతిరేకంగా నిలిచాయి. ఈ ఐక్యతకి సహకరించకపోతే వివిధ కేసులు
పెట్టి జైల్లో పెడతామని వారిని భయపెట్టి ఉంటారని అనుకొంటున్నాను. కనుక
తెలుగుదేశానికై తయారుచేసిన తెలంగాణా అస్త్రాన్ని జగన్ పైకి గురి మార్చబడింది.
రాష్ట్రవిభజనకు చంద్రబాబు అనుమతించాలని, అదేసమయంలో సీమాంధ్రలో సమైక్యత కోసం దీక్షలు
ధర్నాలు జరపాలని తెలుగుదేశం, ఇందిరాకాంగ్రెస్ పార్టీలు నిర్ణయించుకున్నాయి.
సమన్యాయం జరగాలని లేకపోతే సమైక్యంగా ఉంచాలని జగన్ కోరాడు. విజయమ్మగారు,
జగన్మోహనరెడ్డిగార్లు దీక్షలు చేశారు. మొత్తం మీద జగన్మోహనరెడ్డి తెలంగాణా రాష్రాన్ని వ్యతిరేకించినట్లు, తెలుగుదేశం వారు, కాంగ్రెస్
వారు అంగీకరించినట్లు తెలంగాణా ప్రజలు భావించాలనే ఎత్తుగడ సఫలమైంది
ఇక రెండవ ఎత్తుగడ ఏమిటంటే. సీమాంధ్రలో ముఖ్యపట్టణం అనే పేరుతో చిచ్చు
పెడతారు. రాయలసీమ వారు తిరుపతిని ముఖ్యపట్టణం చేయమని కోరుతారు, కొందరు విజయవాడను,
కొందరు విశాఖపట్నాన్ని ముఖ్యపట్టణం చేయమని తగాదాలు పడతారు. ఈ మూడు ప్రాంతాల లోనూ
కాంగ్రెస్ , తెలుగు దేశం వాళ్ళు ఆయాప్రాంతాలను అనుకూలంగా మాట్లాడతారు. అంటే
తిరుపతిని ముఖ్య పట్టణం చెయ్యాలని కాంగ్రెస్ వారు, తెలుగుదేశం వారు సీమప్రాంతంలోని
ప్రజలతో ఊరేగింపులు,ధర్నాలు ,దీక్షలు చేయిస్తారు. అలాగే విజయవాడలోనూ,
విశాఖ పట్నం లోనూ చేస్తారు. కానీ జగన్మోహనరెడ్డిగారు ఏదో ఒక ప్రాంతం పేరే చెబుతారు.
కనుక వారి బలం
ఆముక్కవరకే వుంటుంది. వెంటనే 2014 తాలూకూ ఎన్నికలు జరుపుతారు.
తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించాడని జగన్ గారికి తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు
తక్కువగా వస్తాయి. తెలుగు దేశం వారికి , ఇందిరా కాంగ్రెస్ వారికి ఎక్కువ సీట్లు
వస్తాయి. అలాగే ముఖ్య పట్టణం విషయంలో సీమాంధ్ర ప్రాంతంలో కూడా జగన్ గారికి తక్కువ
సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చిరంజీవిని
నిలబెడతారు. ఇక్కడ నీకు, అక్కడ నాకు అన్న పద్ధతి అమలు వీలైతే 2014లో ముఖ్యమంత్రిగా
నారా చంద్రబాబు నాయుడుగారు ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డి ఏం మంత్రం వేశాడోగానీ కమ్యూనిష్టులు చాలా భయపడ్డారు. ఇంతకు ముందు పెట్రోలు ఒక రూపాయి పెరిగితే సైకిళ్ళు
వేసుకొని పట్టణాలన్నీ తిరిగి ఊరేగి, రోడ్డుదిగ్బంధన చేసి , అరిచి,అరిచి, పోలీసులచే
తన్నించుకొని సాయంత్రానికి మళ్ళీ సైకిళ్ళేసుకొని ఇంటికి పొయ్యేవాళ్ళు . ఇప్పుడు
పెట్రోలు,డీజిలు, ఉల్లిపాయలు ఎన్ని, ఎంతెంత పెరిగినా కిక్కురుమనకుండా
కూర్చున్నారు.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !