కేసీయార్ బందుకు పిలుపు ఇవ్వడం కొందరు తెలంగాణా వాదనాయకులకు కోపం తెప్పించింది. అందరూ కలిసి ఆలోచన చేసి తెలంగాణా జేఏసి తరఫున బందు ప్రకటన ఇచ్చివుంటే బాగుండేది అని వారి ఆలోచన. అందరిమీదా చెప్పమని కోరుతున్నారు. కానీ
ఈ ఆలోచనలో అలసట కనిపిస్తుంది. ఒక నిరాశాపూరిత వాతావరణం కనిపిస్తుంది. మమ్మల్నికూడా కాస్త కలుపుకుపోండి అనే దీనమైన అభ్యర్ధన వినిపిస్తుంది. గాఢాంధకారంలో తమను ఒంటరి వాళ్ళను చేసి అంతా ఎటో వెళ్ళిపోయినట్టు, తామెటు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్లుగా ఆక్రోశిస్తున్నారు. కేసీయార్ ఒక్కడే బందుకు పిలుపునివ్వడం అంటే తెలంగాణా జేఏసీని కబ్జా చేసినట్లేనని భావిస్తున్నారు. తానొక్కడే తెలంగాణా కోసం పని చేస్తున్నట్లూ, మిగతా వారంతా పనిచేయకుందా మందుగొట్టి తొంగున్నారా అని జనం చేత తిట్టించడానికి, ప్రజలనుండి తమను దూరం చేయడానికే కేసీయారు ఈ పని చేశాడని మండిపడుతున్నారు. కానీ బందుకు పిలుపు ఇవ్వడం తప్పుకాదు. అనేక రాజకీయ పార్టీలవారున్నారు. అందరూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు. ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్తులను చేయడానికి తద్వారా తమ పనితనాన్ని పెంచుకోవడానికి, మంచి ఉద్యమాలు చేసే పార్టీ అని అందరి చేత మెప్పుపోందడానికి కేసీయార్ ప్రయత్నించడం తప్పు అని ఎలా చెప్పగలరు? ఎవరి శక్తి కొద్దీ వారు పనిచేయడం మంచిదే. మరో పార్టీ వారు పికెటింగ్ చెయ్యొచ్చు. జైల్ భరో చెయ్యొచ్చు, నిరహారదీక్ష చెయ్యొచ్చు. అందరికోసం తాము వండి పెట్టడం కాకుండా, ఎవరో వండితే తినిపెడతానికి సిద్ధం అంటే ఎలాగా. ఒంటిచేత్తో ఉద్యమాలు చేసి వాటిని సక్సెస్ చేయగల సత్తావున్న వాడని నిరూపించుకోవడానికి ఇలాంటి ప్రత్యేక కోసం ప్రత్యేకోద్యమాలు ఎంతగానో వుపయోగపడతాయి. తెలంగాణా జేయేసీలో తమ ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఇలాంటి ఉద్యమాలు ఉపయోగపడతాయి. ప్రతి వారం ఏదోఒక పార్టీవారు ఏదో ఒక పోరాట రూపంతో ప్రజలను ఉద్యమంలో కలుపుతూవుండాలి. ఎవరో ఒక రాజకీయ పార్టీ వారు చేసిన పనిని అందరూ కలసి చేశాం అని చెప్పుకోవాల్సినంత అవసరంలేదు. కేసీయార్ చేస్తున్న ఈ పనులను సమర్ధించి తాము కూడా ఏదోఒక మంచి ఉద్యమం చేయాలని రాపాలను (రాజకీయ పార్టీలను) కోరుచున్నాను. జై తెలంగాణా......
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !