సాక్షి పై నిషేధమంటున్న చంద్రబాబునాయుడు

Jun 14, 2013




ఒక సంఘటన ఎలా జరిగిందో చెప్పడాన్ని న్యూస్ అంటాము: అదే ఎందుకు జరిగిందో చెప్పడాన్నే రాజకీయమంటాము.  ఇవాళారేపూ పత్రికలు ఒకరిద్దర్ని ఇంటర్వ్యూ చేసి ఆయా సంఘటనలు ఎందుకు జరిగాయో వివరిస్తున్నాయి. అది కొందరి అభిప్రాయాలను మార్చవచ్చు. ఏపత్రిక అయితే తమ వాదనలతో , అది లోపభూయిష్టంగా వున్నప్పటికీ, ప్రజలను నమ్మిస్తుందో అది విజయం సాధించినట్లే. అలా ప్రజలను నమ్మించలేని రాజకీయ పార్టీ తమ ఆయుధ శక్తిని ( తమ పత్రికల ద్వారా తమ వాదనను ప్రజలచే నమ్మించే నైపుణ్యాన్ని పెంచుకునే శక్తిని) బలోపేతం చేసుకోవాలేగాని బహిరంగ నిషేధం ప్రచారం చేయడం మంచిది కాదు.
అది తాము బలహీన పడినట్లు ప్రజలు అనుకునేందుకు ఆస్కారం కలిగిస్తాయి. నిజానికి ఈ ప్రటకన తమ పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించినది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా మతాలలాంటివే. ఒక మతం నుండి మరొక మతానికి మారడం ఎంత కష్టమో, అలాగే ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు మరొక పార్టీకి మారడం కూడా అంతే కష్టం. మొత్తం ఓటర్లలో ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు పదేశిశాతం చొప్పున వున్నారనుకున్నా దాదాపు 60, 70 శాతం ప్రజలు న్యూట్రల్ గానే వుంటారు. వారు ఏ రాజకీయ పార్టీని బలపరచే పత్రికనైనా చదువుతారు, న్యూస్ ఛానల్ చూస్తారు. కానీ కార్యకర్తలు మాత్రం తమకు సంబంధించిన పత్రికలు ఛానళ్ళు తప్పు మిగతావి పట్టించుకోరు. కనుక న్యూట్రల్ గా వున్న ఈ 60, 70 శాతం ప్రజలకు ఆసక్తికరంగా, నమ్మకం కలిగేలా చేయగలిగిన పత్రిక/ఛానల్ లు ప్రజల ఆదరణ సంపాదించగలుగుతాయి. కనుక వాటిమధ్య తప్పనిసరి పోటీ వుంటుంది. చంద్రబాబునాయుడుగారు సాక్షిపత్రికను, సాక్షి ఛానల్ను చూడవద్దని ప్రజలకు చెప్పడం మంచిదికాదు. అది ఒక ప్రచారంలాగా మారి అనేకమంది సాక్షి పత్రికను చదవడం, సాక్షి వార్తా ఛానల్ చూడడం చేసే అవకాశంకూడా వుంది.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||