కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఇంకాం ఘన విజయం సాధించింది. కేంద్రంలో
తనకున్న అధికారం సహాయంతో తాను ప్రాబల్యం కోల్పోయిన రాష్ట్రాలలో ఆపరేషన్
కొండవీడు ద్వారా లబ్ది పొందాలని చేసే ప్రయత్నాలు సఫల మౌతున్నాయి. రెండుముక్కల సిద్ధాంతం ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం
ద్వారా తెలుగుదేశం పార్టీని బలహీనపరచి, ఆంధ్రప్రాంతానికి చిరంజీవిని ముఖ్యమంత్రిని
చేయడంద్వారానూ, అలాగే కేసీయార్ సహకారంతో తెలంగాణా రాష్ట్రంలోనూ అధికారాన్ని
అందుకోవాలనే 2009 నాటి ఎత్తుగడ జగన్ కారణంగా మార్చుకోవలసివచ్చింది.
2009 ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రెండు భాగాలయిందా
అన్నట్లుగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోకి సగంమంది తెలుగుతమ్ముళ్ళు
చేరిపోయినందున అది బలహీనపడింది. జగన్ పార్టీ
పెట్టగానే ఇంకాం పార్టీలోని కార్యకర్తలంతా జగన్ పార్టీలో చేరారు. ఇంకాం లో జైకొట్టడానికి జనంలేని కారణంచేత
తప్పనిసరై ప్రజారాజ్యాన్ని కొనుక్కోవాల్సివచ్చింది. సారీ, కలుపు కోవాల్సి వచ్చింది.
కనుకనే ఉపఎన్నికలలో తెలుగుదేశం, ఇంకాం ల బలాబలాలు తెలిసిపోయాయి కనుక అధికారాన్ని
నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్షాలను ఏకం కాకుండా చూడాల్సి వచ్చింది. కనుకనే ప్రజాబలం
అధికంగా ఉన్న జగన్ పార్టీకి వ్యతిరేకంగానూ, బలహీనమైన తెలుగుదేశం పార్టీకి
అనుకూలంగానూ ఇంకాం వాళ్ళు పావులు కదిపారు.
ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా తెలుగుదేశం, వైకాం పార్టీలు కలసి పోరాటం
చేయాల్సిఉంది. అలా చేసేక్రమంలో అవిశ్వాసం పెట్టి ఇంకాం ప్రభుత్వాన్ని గద్దె దించి,
ఎన్నికలు జరిపించి ఉండాల్సింది. కానీ తెలుగుదేశానికి భవిష్యవాణి ఎలా కనిపించిందంటే
ఎన్నికలు జరిగినా తనకు ప్రతిపక్షమే కనిపించింది. ఏమిచెయ్యాలో తోచని స్థితిలో
కొట్టుమిట్టాడుతూ , అవిశ్వాసానికి సహకరించి ప్రభుత్వాన్ని పడగొట్టినా తమకు
ప్రతిపక్షమే గతియని తేలిపోయింది గనుక గతంలో బిజేపీ ప్రభుత్వాన్నుండి
పిండుకున్నట్లు ఇప్పుడు ఇంకాం ప్రభుత్వం నుండి పిండుకోవడమే సముచితమని , తెలంగాణా ఇవ్వకుండా
ఉండేలా చూసుకోవచ్చునని, చిదంబరంతో సిటింగేసి కమిట్టయ్యుంటారు.
తెలుగుదేశం నేతలు ఢిల్లీ వెళ్ళివచ్చిన వెంటనే జగన్ పై ఏదో వొక చర్య
తీసుకోబోవడం వల్ల అమాయకులున్నూ, నోటిలో వేలు పెట్టినా కొరకలేనివారున్నూ అయిన
సోనియా కోటరీలు ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వెనుక తెలుగుదేశంవారి సలహాలే
కారణమనే వైకాం వారి ఆరోపణలు చూస్తే వారికి ఇంకాం వారి ఎత్తుగడలు బాగా
తెలీనట్లుంది. అసలు జగన్ అక్రమ ఆతుల లెక్కింపు కేసు ను జాగ్రత్తగా పరిశీలిస్తే
దీనివెనుక తేదేవారు ఎన్టీయార్ని వెన్నుపోటు పొడిచినట్లుగా , ఇంకాం వారు
వైయ్యస్సార్ను వెన్నుపోటు పొడిచినట్లేగదా. వైయ్యస్సారు అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం
కోసం కేబినెట్టు మంత్రులచేత జివోలిప్పించారని కేసు పెట్టడమంటే అంతేగదా. అప్పుడు
తేదే వారు వెన్నుపోటు వల్ల లబ్ది పొందారుగనుక ఇప్పుడు ఇంకాం వారు కూడా లబ్ది
పొందగలమని ఆశిస్తున్నారు. బ్రిటీష్ బానిస చట్టాల ప్రకారం తమకు నచ్చని వారిని
కారాగారంలో ఎన్నాళ్ళైనా బంధించే అవకాశం ఉన్నందున జగన్ని ఎన్నికలయ్యేతవరకూ
జైల్లోఉంచి అతని నోరు నొక్కి ఎన్నికల్లో లబ్ది పొందవచ్చుననే ఆలోచన తేదే వారికి
ఉండడం విడ్డూరం.
తెలుగుదేశం నేతలు దూరదృష్టితో ఆలోచించడంలేదు. తె.దే.పార్టీ కాంగ్రెస్ పార్టీకి
వ్యతిరేకంగా పుట్టింది. ఎటు అవకాశం వస్తే అటు తాత్కాలిక లబ్దికోసం ఆశపడరాదు. ఒకవేళ
జగన్ పార్టీ పెట్టకపోయినా తెలుగుదేశాన్ని తొక్కివేయడానికే ఇంకాం పార్టీవారు రెండుముక్కల సిద్ధాంతాన్ని అమలు చేస్తారు. తమ
పార్టీనుండి చీలిపోయి , ప్రజారాజ్యం పేరుతో ఇంకాంలో చేరినివారికే సహకారం
అందించాల్సిరావడం నిజంగా తేదే వారి దౌర్భాగ్యం. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా
కుయుక్తులతో నెగ్గుకురావాలనుకోవడం మంచిదికాదు. వెన్నుపోటు బృందం ఇప్పుడు మూడు
ముక్కలైంది. ఒకటి చిన్నమ్మ వర్గం, బావ బావమరది వర్గం, బుడ్డోడి వర్గం. తేదే
పార్టీని బలహీనపరచే ఎత్తుగడలో భాగంగా చిన్నమ్మ వర్గాన్ని ఇంకాం వాళ్ళు తమలో
కలుపుకున్నారు. తన కుమారుడిని వారసునిగా చేయాలనే తపన బాబును తప్పటడుగు
వేయిస్తుంది. తేదే నిర్మాత ఎంటీవోడు కూడా వారసురాలిగా లక్ష్మీ పార్వతిని చేయాలనే
తపనవల్ల వెన్నుపోటుకు గురయ్యాడు. 2014లో తేదే పార్టీ ఓడిపోవడం ఖాయం గనుక తనకు
పార్టీ పగ్గాలు అందించక తప్పదని గోతికాడ నక్కలా జూనియర్ ఓర్పుగా కాచుక్కూర్చున్నాడు.
ఇంకాం వారి ఎత్తుగడలకు తేదే పార్టీ బలౌతుంది.
ఇంకాం పార్టీ వారు జగన్ ను ఎదుర్కోవడానికి వైయ్యస్సార్ వెన్నుపోటు ఎత్తుగడ అనుసరిస్తుంటే
దాన్ని తేదే వాళ్ళు సమర్ధించడం సమంజసం కాదు. దానివల్ల ప్రతిపక్షం బలహీన పడుతుంది.
తద్వారా ఇంకాం లబ్దిపొందుతుంది. కనుక తేదే పార్టీ జగన్ పార్టీతో కలసి ఇంకాంపై
పోరాడితే ఎక్కువ అసెంబ్లీసీట్లు, పార్లమెంటు సీట్లు ఇంకాంకు వ్యతిరేకంగా జగన్ పార్టీ, తేదే పార్టీలకే
లభించుతాయి. తద్వారా మైనారిటీ మోడీ ప్రభుత్వంనుండి ఎక్కువ రాయితీలను మన
రాష్ట్రానికి తెప్పించవచ్చు. ఎంటీయార్ కూడా ‘ జూనియర్ తెలుగుదేశం ’ పేరుతో జగన్ పార్టీని
సమర్ధించి 2014 ఎన్నికల్లో తన వర్గానికి ఎక్కువ స్థానాలు పొందవచ్చు. 2014
ఎన్నికల్లో రాష్ట్రప్రభుత్వాన్ని జగన్ గెలుచుకున్నా సమర్ధపాలన అందిస్తాడనే
గ్యారంటీలేదుగనుక, అవకాశాలు కలిసివస్తే 2019 నాటికి జూనియర్ సారధ్యంలోని తేదే
పార్టీకి రాష్ట్ర అధికారం దక్కవచ్చు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజేపీ ప్రభుత్వానికి అసమ్మతి వర్గమైన గాలి
జనార్ధనరెడ్డి వర్గాన్ని ఇంకాం పార్టీ ముప్పతిప్పలు పెట్టింది. బిజేపి వాళ్ళు
ఇంకాం పార్టీతో కలసి తమను ఇబ్బంది పెడుతున్నారని గాలి వర్గం భావించి ఎన్నకలలో
ఒకరినొకరు ఓడించుకున్నారు. తద్వారా ఇంకాం కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అదే
ఎత్తుగడ ప్రకారం కేంద్రంలోని మోడీకి వ్యతిరేకంగానూ, అద్వానీకి అనుకూలంగానూ
వ్యవహరిస్తుందా అన్నట్లు ఇంకాం పార్టీ ప్రవర్తిస్తుంది. కనుక రాబోయే పార్లమెంటు
ఎన్నికలలో అద్వానీ వర్గం, మోడీ వర్గం ఒకరినొకరు ఓడించుకొని ఇంకాం పార్టీకి
మెజారిటీ ఇస్తారనే ఆశతో ఇంకాం పార్టీ ఉంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా తేదే పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం
ద్వారా, తేదే పార్టీవాళ్ళ సలహాల ప్రకారమే జగన్ను జైలులో పెట్టారని వైయ్యస్సార్
పార్టీ వాళ్ళు అనుమానించేవిధంగా ప్రవర్తించడం ద్వారా ప్రతిపక్షాలను కలవనీయకుండా చేసి, రాబోయే
ఎన్నికలలో రాష్ట్రం జగన్ కు పోయినాగానీ, పార్లమెంటు సీట్లు వీలైనన్ని ఎక్కువ
సంపాదించుకోవాలని ఇంకాం పార్టీవారి ఎత్తుగడ. వీరి ఎత్తుగడ ఫలిస్తుందా?
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !