మన దేశంలో యుపియే నాయకత్వంలోని ప్రభుత్వం
బలహీనమైనదని మీకూ తెలుసు. అది తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అనేక తంటాలు
పడుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వానికి ఈ ప్రమాదాలనుండి బయటపడే మార్గాలకోసం
చూస్తుంది.
మనం సినిమాల్లో చూస్తుంటాంగదా హీరోబృందం విలన్
వలలో చిక్కుకొని తప్పించుకొనే దారిలేక వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతున్నట్లు
నటిస్తారు. విలన్ మరియు అతని అనుచరులు ఈ డ్రామాను నిజమనుకొని వెఱ్ఱిమొహాలేసుకుని
చూస్తుంటారు. అదను చూసి విలన్ చేతిలోని తుపాకీని ఎగరగొట్టి హీరోగారి బృందం
ఆపదనుండి తప్పించుకుంటుంది. కదా.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ ట్రిక్కునే
ప్రయోగించింది. కేంద్రమంత్రి రాజా తప్పుచేశాడని మరోకేంద్రమంత్రి పత్రికా ప్రకటన
ఇస్తాడు. సిబిఐ వారు ఆమంత్రిని అరెష్టుచేసి జైలులో పెడతారు. మంత్రుల అవినీతికి
ఆధారాలున్నాయని వాటిని త్వరలో బయటపెడతామని , వారికి జీవిత ఖైదు , ఉరిశిక్ష పడవచ్చేమో అంటూ
పత్రికలలో వ్యాఖ్యానాలు వస్తాయి. ఇదంతా నిజమేనని పాపం బిజేపి, కమ్మనిష్టులు వంటి మతమనే
మత్తులోవున్న పార్టీలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఇక వీళ్ళ నెత్తిన మొట్టడమే
తరువాయి . తరువాత కథ ఏం జరగబోతుందో మీకు అర్ధమైందిగదా...
అదే డ్రామాని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆడించాలని
చూశారు. మంత్రి శంకరన్న తన తోటి మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశాడు. కానీ మన
కోర్టులు అంగీకరించలేదు. బహుశా ఇక్కడివాళ్ళు ఈ కహానీలు నమ్మరనీ , అనలుకే
మోసమొస్తుందనుకున్నారేమో. ఏమంటారు...
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !