జగన్ భవిష్యత్తు ఏమిటి?

Apr 16, 2011


చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త లేకుండా, వచ్చిన అవకాశాలను జారవిడుచుకొని, మూడున్నర ఏళ్ళపాటు మీరెన్ని తప్పులు చేసినా మిమ్మల్నేమీ అననంటూశత్రువులకు అవకాశం ఇవ్వడం వంటి జగన్ రాజకీయ మార్గాన్ని పరిశీలిస్తే కొంత ఆందోళన కలుగుతుంది. ఎన్నికల బరిలో రాజకీయాలు చేయకుండా రాముడు మంచి బాలుడు తరహాలో ఎన్నికల యుద్ధంలోకి జగన్ ప్రవేశించినట్లు కనిపిస్తుంది. ప్రస్తుత అవినీతి మయమైన రాజ్యంలో కుట్రలు, కుయుక్తులు లేకుండా రాజకీయాలు ఊహించడానికే భయంగా ఉంది.
 ఎన్నికలలో జగన్ ను ఓడించడం జీవన్మరణ సమస్య సోనియాకాంగ్రెస్ వారికి, కు.రాజనీతి దురంధరుడైన చంబా కు . కనుక వారిరువురూ కలిసికట్టుగా నిలవడం జగన్ కు ఎన్నికలలో ఎదురు దెబ్బే. కాంగ్రెస్ పార్టీ వారు భ్రమలు కల్పించడంలో నేర్పరులు. వారు ఈ ఎన్నికలలో ఓడిపోతే రేపు జనరల్ ఎన్నికలలో కూడా తప్పనిసరిగా ఓడిపోతారు. కనుక ఈ యన్ని ఈ ఎన్నికల్లో ఈ ఒక్క నియోజకవర్గంలో ఓడించగలిగితే రేపు రాష్ట్రమంతా ఓడించడం సులువు. కనుక అనేక ఎత్తుగడలు ప్రయోగించి జగన్ వర్గాన్ని డిఫెన్స్ల్ లో పడవేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహనరెడ్డి అనే పేరుగలిగిన వారిని పోటీపెట్టడం ద్వారా జగన్మోనహనరెడ్డికే మీ ఓటు కుండ గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, జగన్మోనహనరెడ్డికే మీ ఓటు బండి గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, జగన్మోనహనరెడ్డికే మీ ఓటు ఆకు గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, జగన్మోనహనరెడ్డికే మీ ఓటు ఏనుగు గుర్తుకే ఓటెయ్యంటని ఒకసారి, ఇలా ఓటర్లని అయోమయానికి గురిచేయడం, మంత్రులను అందర్నీ మోహరించి ప్రజల్ని ప్రలోభపెట్టడం, వీధిలోని రింగులీడర్ల మొదలు ఎంపీల దాకా తమ గ్రిప్పులో పెట్టుకోవడం, జగన్మోహనరెడ్డి ఓటర్లకు అధికమొత్తంలో ఓటుకు నోట్లు ఇవ్వబోతున్నాడని ప్రచారం చెయ్యడం – తద్వారా ఓటర్లను నిరుత్సాహానికి గురిచేయడం, ఓటర్లను సారాలో ముంచడం, మహిళలకు ఏటియం కార్డులంటూ ఊరించడం, బర్రెలు గొర్రెలు, లోన్లంటూ ఉచ్చులు బిగించడం, జగన్ అనుయాయులపే అనేక అక్రమ కేసులు బనాయించడం. వైయ్యస్ మంచివాడేగాని జగన్ అసమర్ధుడని ప్రచారం చేయడం, జగన్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని కనుక తమ పరువును నిలుపుకోవడం కోసం అంటూ మీ ఓట్లనివేస్తే చాలునంటూ ఓటుబ్యాంకును కొల్లగొట్టడానికి ఎత్తులు వేస్తారు.
ఇదే పరిస్తితులు తెలుగుదేశం పార్టీకి కూడా ఉన్నాయి. జగన్మోహనరెడ్డిని ఎన్నికలలో గెలవగలిగే పరిస్తితులు చంద్రబాబుగారికి లేదని తేలిపోవడంతో తెలుగు దేశం నాయకునిగా చంద్రబాబు తప్పుకొని జూనియర్ ఎంటీఆర్ ను నిలపాలని కొందరు పోరాడుతున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారేకి మద్దతు ప్రకటించిన నేటితరం అంతతేలికగా కాంగీ,తేదేల ఎత్తుగడలకు లొంగుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Share this article :

2 comments:

  1. గమ్మత్తే౦ట౦టే చదువుకున్న వాళ్ళు సమాజానికి మ౦చి చెప్పాల్సిన వాళ్ళు
    కూడా జగన్ ని అమాయకుడు, స్వచ్ఛమైన వాడు అని మానసిక౦గా మోస౦
    చేసుకు౦టున్నారు. అభిమాన౦ వేరు ఆత్మవ౦చన వేరు. ఏ పార్టీ అయినా కోట్ల
    అవినీతి లో మునిగి తేలుతో౦ది, అవినీతితోటే పెనవేసుకుని వు౦టున్నాయి.
    ఈ రాచకీయులు సమాజానికి మే౦ మ౦చి చేస్తామ౦టే కాదు కూడదు మేమే మ౦చి
    చేస్తామని... ఎ౦త బాధ్యతో, ఎ౦త నిబద్దతో. పిల్లి కళ్ళు తెరుచుకునే పాలు తాగుతో౦దని
    తెలిసికూడానా!
    అన్నీ ఆ తానులో ముక్కలే ఆచ౦ట మల్లన్నా.

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||