Wrong Signals

Sep 16, 2012

త్వరలో ఆంద్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చీలబోతుంది. ఆంద్రా ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చిరంజీవి నియమించబడతాడు. తెలంగాణాకు కేసీయార్ ముఖ్యమంత్రి అవుతాడు.
గత చరిత్ర చూస్తే  భారతదేశంలో రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఒకటి కాశ్మీరు, రెండోది ఆంద్రప్రదేశ్. భారత దేశానికి అంతటికీ వర్తించే చట్టాలు ఈ రెండు రాష్ట్రాలకు వర్తించవు. కాశ్మీరు విషయం అందరికీ తెలిసిందేగానీ ఆంధ్రప్రదేశ్ విషయం అందరికీ తెలియదు. జరుగుతున్న విషయాలనుబట్టి మనం అర్ధం చేసుకోవాల్సిందే. నేనిలా అనుకుంటున్నాను.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర్నుండి కేంద్రం ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి ప్రేమ చూపుతుంది. వివిధ కేటాయింపులు పరిశీలిస్తే ఈ విషయం బాగా అర్ధమౌతుంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ఓ కమ్మని రాజ్యమని భావించి రెడ్డి రాజులను కేంద్రం ప్రోత్సహిస్తుంటుంది. కేంద్రం మెడలు వంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నఎంటీరామారావును వ్యతిరేకించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని తాము కోల్పోయారు చంద్రబాబు అనుచరులు.

మరెవ్వరూ లేని కారణాన తాత్కాలికంగా వైయ్యస్సార్కు నాయకత్వ అవకాశం లభించగా ఆయన దాన్న చక్కగా వినియోగించుకొని తనను తాను స్థిరం చేసుకున్నాడు. అయినప్పటికీ కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వం తెలుగు దేశం పార్టీని ఎదుర్కొనడానికి, మైనారిటీ మతానికి చెందిన రాజశేఖరరెడ్డిని వదిలించుకోవడానికీ గాను  రాష్ట్రాన్ని రెండు ముక్కలు చెయ్యాలని నిర్ణయించుకుంది. ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చిరంజీవిని , తెలంగాణాకు కేసీఆర్నూచెయ్యాలని ప్లాను వేసుకొని కేసీయార్కు సిగ్నల్స్ పంపింది.

ఆ సిగ్నల్స్ ను అందుకొని ఆంధ్రాలో చిరంజీవిగారు ప్రజారాజ్యం పార్టీ స్ధాపించి తన సామాజిక వర్గంవారిని తెలుగు దేశం, కమ్యూనిష్టు ప్రార్టీలనుండి సమీకరించుకొని ఎన్నికలలో పోటీచేసి కొంత కేడర్ ను స్థిరం చేసుకున్నాక మరలా సిగ్నల్స్ అందుకొని ప్రజారాజ్యాన్ని ఇం.కా. లో కలిపేసుకున్నాడు.

తెలుగు దేశం డెడ్ హార్స్ అయిందంటూ చంకలుకొట్టుకుంటున్న ఇం.కా. కు, జగన్ స్వంత కుంపటి పెట్టుకున్న తర్వాత మరొక కొత్త చిక్కొచ్చిపడింది. బ్రిటిష్ బానిస చట్టాల అసలు ఉపయోగం నేడు అమలౌతున్న జగన్ నిర్బంధం తో పరాకాష్టకు చేరిది. తెలంగాణాలో జగన్ను రాళ్ళతో తరిమికొట్టిన కేసీయార్కు తెలంగాణా ముఖ్యమంత్రి  పదవికి ఎంపికచేసి తెలంగాణా ప్రకటించడం, ఆంధ్రాకు చిరూపేరు ప్రస్ధావించడం జరుగుతుందని నేను అనుకొంటున్నాను. 

కానీ ఈరోజు సిగ్నల్స్ చూస్తుంటే జైపాల్రెడ్డి క్రొత్త సియ్యం అంటున్నారు. మరి తెలంగాణాకు చెందిన జైపాల్రెడ్డి పంపకాల సియ్యం అయితే తెలంగాణానుంచి మహబూబ్ నగర్, రంగారెడ్డి,హైద్రాబాదులను కొరికి రాయలసీమకు అతికించి మూడు భాగాలు చేస్తారేమో. ఏమైనాగానీ ఈ సిగ్నలింగ్ వ్యవస్త అస్తవ్యస్తంగా ఉందేమోనని అనుమానంగావుంది. పూర్వం రెండు రేడియో స్ఠేషన్లలోని కార్యక్రమాలు కలిసిపోయి హాస్యం పుట్టించినట్లుగా అనిపిస్తున్నది. ఏమంటారు?
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||