Physics (భౌ...భౌ...తికమక శాస్త్రం) Go Back

May 2, 2012




నేడు మన ప్రాంతంలో భౌతిక శాస్త్రమనే మాట వినబడితేనే జనం భౌ,భౌ మని ఎగబడుతున్నారు. మన సంసృతీసాంప్రదాయాలను విడచి , విదేశీయులవలే శాస్త్రీయ పద్థతులని , ఆధునిక ధోరణులని పులిన చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా  ప్రస్తుతం ఎన్నో ఆశలతో , నూతన ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న
యువకుల ఆశలపై నీళ్ళు పోశారు. ఆంగ్లంలో నూటికి 96, సంస్కృతంలో నూటికి 97, లెక్కల్లో 75కు 75, కెమిస్ట్రీలో 60 కి 57 చొప్పున వస్తే హు. . . ఫిజిక్స్ లో 60కి కేవలం 16 మార్కులట. ఏమిటీ అన్యాయం? ఎక్కడుంది లోపంఇలా జరగడం ఇదే మొదటి సారి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫిజిక్స్ పరీక్ష పేపరు కష్టముగా ఇచ్చినందున లక్షాఎనభైవేలమంది తప్పారు. కార్పోరేటు కళాశాలల్లోని విద్యార్ధులు పాసయ్యారుగానీ మార్కులు తక్కువగా వచ్చాయి. ఇంతమంది విద్యార్ధులు పరీక్ష తప్పడానికి కారణాలు ఎవరికివారు వెతుక్కున్నారు. విద్యార్ధులు, వారిని రుబ్బిన అధ్యాపకులు, పెట్టుబడిపెట్టిన తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపారు. సాధారణంగా ప్రస్తుత భారతీయ గ్రైండింగ్ విద్యావిధానం ప్రకారం గత సంవత్సరాలలో ఇచ్చిన ప్రశ్నలలోనుంచే ఇవ్వడానికి బదులుగా గతంలో ఇవ్వని ప్రశ్నలు ఇచ్చారు. అలా ఇవ్వడం తప్పా అంటే తప్పేయని గయ్యిమంటారు అందరూ. ప్రభుత్వం కూడా తప్పయిపోయిందని చెంపలు గట్టిగా వాయించుకొని స్పెషల్ డ్రైవ్ విధానాలకు పూనుకుంది. అంటే గత సాంప్రదాయ పద్ధతిలో రుబ్బింగ్ చేయబడిన ప్రశ్నలే 16వ తేదీన రావచ్చు. శాస్త్రీయ విధానంలో పరీక్షించే సాహసం మరోసారి చెయ్యరుగాకచెయ్యరు.

1985లో ఇందిరాగాంధీ హత్యానంతరం మన విద్యావిధానం మారింది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల కాలంలో శాస్త్రీయ విద్యావిధానం ఉండేది. అప్పుడు మన దేశంలో అనేకమంది సైన్టిస్టులు తయారైనారు. కానీ, ఇందిరాగాంధీ హత్యానంతరం మనకు మరొక శాలివాహన ప్రభువు అధికారంలోకి వచ్చాడు. తద్వారా మత విద్యను 1986 నూతన విద్యా విధానం పేరుతో ప్రవేశ పెట్టారు. ఈ విద్యా విధానం వల్ల చెవిలో పువ్వులు పెట్టుకునేవారు తయారౌతారు. అన్ని మతాల క్షేత్రాలు కిటకిట లాడు తుంటాయి. మత్తుమందు లాంటి ఈ విద్యను వొంటపట్టించుకున్నవారు గ్రుడ్డి  వానికి ఎవరో ఒకరు దారి చూపినట్టుగా ఎవరు ఎటు చెబితే అటు నడుచు కుంటూ వుంటారు. ప్రతి దానికీ ఇతరులమీద ఆధారపడతారు. మనసు నిండా భయ సందేహాలతో ఉంటారు. రకరకాల రక్షారేకులు ,బొమ్మలు, తాయిత్తులు, తాళ్ళు, గుర్తులు వంటి ఆయుధాలతో ఉంటారు. నో అని చెప్పే శక్తిని కోల్పోతారు. ఎంటీ రామారావు ను వెన్నుపోటు పొడవడం తప్పకాదా? అంటే తప్పేనంటారు, చంద్రబాబు ఎంటీ రామారావు విగ్రహానికి పూలమాల వేయడంలో తప్పేముంది?  అంటే...  అవును తప్పుకాదంటారు. నెహ్రూ చనిపోయాక ఇందిర, ఇందిర మరణించాక రాజీవ్ , రాజీవ్ తర్వాత ఆయన భార్యా అధికారంచేపడుతూ, రాజ శేఖర రెడ్డి తర్వాత జగనుకు ఇవ్వకుండా కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడమేమిటని అర్ధం చేసుకోలేరు. ఈ సబ్బువాడితే అందంగా ఉంటారంటే ఎగబడి కొని వాడేస్తారు. టివీల్లో, కంప్యూటర్లలో, బజారులో ఎటు చూస్తే అటొక ప్రకటన కనిపించేది అందుకే.

కనుక నేను చెప్పేది ఏమంటే ఎవరో చెప్పేది వినడమే తప్ప ఎలాగూ మనం స్వంతంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే సమర్ధత ఈ విద్యా విధానం వలన లోపించినది గనుక , ఫిజిక్స్ సబ్జక్టును సిలబస్ లోనుంచి తీసివేసి, జ్యోతిశాస్త్రము, శకునశాస్త్రము , యోగ శాస్త్రము వంటి మంచి ఉపయోగకరమైన సబ్జెక్టులు పెడితే విద్యార్ధులకు తేలికగా వుంటుందీ, మన దేశము ముందుకు దూసుకు పోతుంది. ప్రస్తుతం మనం ఆశించి నట్లుగానే మన దేశ విద్యార్ధులెవ్వరూ సైంటిష్టులు కావడం లేదు. ఎందుకంటే సైంటిస్టులైతే ఆలోచించాల్సొస్తుంది మరి. కదా!!!
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||