రోబో చిత్రంలో అంతా అనుకున్నదానికన్నా బాగానే ఉన్నదని మంచి పేరు తెచ్చుకున్నది. సంతోషం. కానీ ఒకటి రెండు విమర్శలుకూడా చేయాలనిపిస్తుంది. అందులో మొదటిది ఏమిటంటే చిట్టి ఫీలవడం నేర్చుకున్నతర్వాత ఐసూను ప్రేమిస్తాడు. అది సహించలేక తన చేతులతో తయారుచేసిన చిట్టిని తానే విరుగగొట్టి చెత్త కుప్పలో పారేస్తాడా సైంటిస్టు. ఎందుకంటే దానిలోనుండి అలా ఫీలయ్యే లక్షణాలను తొలగించడం సాధ్యంకాదు గనుక. కానీ చివర్లో విలన్ పెట్టిన చిప్పు తొలగించిన తర్వాత ఆ విషయమే మరచినట్లుగా ప్రవర్తించడం ఎలా సాధ్యమైంది? కదా..
.
ఇక రెండవ విషయం. అనేక విషయాలు తెలిసిన రోబోకి సంసారమ్ముక్కు తగిలించుకోలేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ యంత్రునికి మనిషికి బేధం చూపడానికి, శాస్త్రమును అశాస్త్రీయము ఓడించినట్లు చూపడం జరిగిం దనుకో వచ్చునేమో...మరి మీరేమంటారు?
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !