మహేష్ బాబు నటించిన
బిజినెన్ మాన్ సినిమా పైకి చూడడానికి మాఫియా కధలాగా కనిపించినాగాని నిజానికి ఒక
మాఫియా చిత్రం చూసిన ఫీలింగ్ నాకు కలగలేదు. పగ ప్రతీకారం అనే అంశమే తప్ప మాఫియా
విషయం లేదు. పగ వేరు, మాఫియా విధానం వేరు.మాఫియా అంటే ఏమిటో కమీషనర్ తో
హీరో చెబుతాడు. అది ఆచరణలో సరిగా చూపలేదు.
మాఫియా అంటే సెటిల్మెంట్లు చెయ్యడం లేదా
తగాదాలను తీర్చడం. అనధికారమైన కోర్టుతో సమానం. సమాజంలో నేడు రెండు విధాలుగా
మాఫియాలు చలామణిలో ఉన్నాయి. ఒకటి పోలీస్ మాఫియా, రెండవది పెద్దమనుషుల మాఫియా.
కోర్టులో కేసులు తేలడానికి చాలా సమయం పడుతుందిగనుక తమ సమస్య త్వరగా పరిష్కారం
కావాలంటే వారు పోలీసుల తీర్పునో, పెద్దమనుషుల తీర్పునో కోరుతారు. తీర్పు తమకు
అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా దానికి కట్టుబడి ఉంటామని , తగవు
తీర్చినందుకు ఎంతోకొంత సంతోషంగా ముట్టజెబుతారు. ఈ సినిమాలో అవేవీ లేవు. ఒక వ్యక్తి
మరో వ్యక్తిపై పగ తీర్చుకుంటాడు. తాను మాట్లాడేమాటలకు జరిగే సంఘటనలకు సంబంధం లేదు.
తాను ముంబాయిని భయపెట్టడానికి వచ్చానంటాడు. కానీ అతనంటే ఎవరూ భయపడరు.
కానీ లవ్ ట్రాక్ నడిచినవిధము మాత్రం నూతనంగా
ఉంది. పరిచయం చేసుకోవడానికే చిత్రను తిడుతున్నాడని ప్రేక్షకులకు అర్ధమౌతుంది. ఆ
తిట్లలోనే తాను పెద్ద బిజినెస్ ఉన్నవాడినని , రోజుకో దేశం తిరుగుతుంటానని, ఫెస్
బుక్, ట్వట్టర్, ఫోన్ మెసేజిలద్వారా తనను వేధిస్తున్నావని తిట్టడం, మర్నాడు
సారీచెప్పడం బాగుంది. మధ్యమధ్య సీరియస్ సీన్లొచ్చినప్పటికీ ప్రేక్షకుడు ఆ
ప్రేమకధనే మధురానుభూతిగా మననం చేసుకునేలా ఉంది. రీళ్ళు కాస్త పొడవైనాగానీ ప్రేమ
సీన్లు మరికాసేపుంటే ఎంత బాగుండునోగదా అనిపించేంత స్వీట్ గా ఉన్నాయి.
ప్రేమ సీన్లలోఎంత
ప్లాన్డుగా , నిబ్బరంగా అమ్మాయిని గెలిచాడో అదే కాన్ఫిడెన్స్ తో భాయిగా నిలదొక్కుకున్న
తీరు ఆశ్చర్యంగొలిపేవిధంగా ఉంది. భాయి కావడమంటే ఇంత వీజీనా అనిపించేలా ఉంది.
ఎంతైనా తెలుగు సినిమా అనిపించింది. రౌడీల్ని కొట్టి వొప్పించడం, మాటకుమాట బదులు
చెప్పగల నేర్పుకలిగివుండడం, నిర్భయంగా , తిరుగులేని నమ్మకంతో మాట్లాడడం, సీరియస్
గా వుండడం సినిమా విజయానికి కారణాలని చెప్పవచ్చు. మరీ యువకులైతేతప్ప నాలాంటి
పెద్దలకు ఆలోచించుకునేంత సమయం కూడా ఇవ్వకుండా వేగంగా కధ నడుస్తుండడం, సంగీతం
మోడరన్ గా ఉండడం, ముద్దుసీనుండడం మరింత బలాన్నిచ్చాయి. పాపం మత్తులో ఉండగా
ఆఅమ్మాయిని ముద్దాడడం అన్యాయం . ఎంతైనా దొంగబుధ్ధి పోనిచ్చుకున్నాడుకాదు. కారుడ్రైవరు
డైరెక్టరేమో కదా. వీడికి బ్రెయిన్
ఎక్కువైపోయింది కొంచం కట్ చేసి కంట్రోల్లో పెట్టమంటూ దేవుణ్ణి వేడుకోవడం బాగుంది.
మాఫియా అంటే సెటిల్మెంట్లు చెయ్యడం లేదా తగాదాలను తీర్చడం అన్నారు. అది మాఫియాకు సరియైన నిర్వచనం కాదు. విన్సెంట్ థెరెసా అని ఒకతను మాఫియాలో నెంబర్2 పోలీసులుకు చివరకు లొంగిపోయాక వ్రాసిన ఆత్మకధ ఒకటుంది. చాలా యేళ్ళ క్రిందట చదివాను. మాఫియా అంటే నేర సామ్రాజ్యం. దయా దాక్షిణ్యం లేకుండా నేరాలు చేస్తుంటారు - నేరాలు సమాజంలో ఋజువు కాకుండా ఉండటం కోసం సమాజం లోని అన్ని వర్గాల ప్రజల నుండి మాఫియాలో సభ్యుల ఉండి పని చేస్తుంటారు. ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, లాయర్లు, న్యాయమూర్తులు... ఇలా అన్ని రంగాల వాళ్ళు సొమ్ము పుచ్చుకుంటూ మాఫియాకు తోడ్పడుతుంటారు. ఒక సారి మాఫియాకు లొంగాక పైకి పోవటమే కాని వేరే రకంగా బయటపడటం కుదరదు.
ReplyDelete