Businessman మాఫియా అంటే ఏమిటి What is Mafia

Feb 9, 2012


బిజినెస్ మాన్ సినిమాలో మాఫియా అంటూ కొంతమంది రౌడీలను ఒకచోట చేర్చడం ద్వారా, వ్యాపారులను బెదిరించి డబ్బు సంపాదించాలనే చూపడం జరిగింది. తాను ముంబాయి వచ్చింది
ముంబాయిని ఒకటికి పోయించడానికని సూర్య చెబుతాడు. తాను అలా చేసింది ఢిల్లీనేలే రాజకీయ నాయకుణ్ణే. దీనిని బట్టి మాఫియా అంటే రాజకీయ పార్టీల నాయకులని అర్దం చేసుకోవాలి.  సూర్య భయపడేది పోలీస్ కేనని చెబుతాడు. సిటీ పోలీసు కమీషనర్ కూతుర్ని ప్రేమించడంద్వారా పోలీసులు తనను ఎన్ కౌంటర్ చేయకుండా చేసుకున్నానని చెబుతాడు. అంటే ఎంతటి మాఫియాలైనా,  తాముభయపడేది పోలీసులకేనని చెప్పేదాన్నిబట్టి చూస్తే దేశంలో పోలీసుపాలన జరుగుతుందని అర్ధమౌతుంది.
 మొదటి స్థానం పోలీసులు,
 రెండోది రాజకీయపార్టీల నాయకులు, 
మూడోది రాజకీయ పార్టీలకు లోబడినడిచే నాయకులు, 
నాలుగోది రింగులీడర్లు

మొదటగా పోలీసు మాఫియాగురించి చూద్దాం.  పోలీసు స్టేషన్లలో కొన్నిచోట్ల కేసు కోర్టుకు వెళ్ళనీయవద్దని పోలీసుల్ని ప్రాధేయపడి ఆ తీర్పేదో మీరే చెప్పండని వేడుకుంటారు. ఇక్కడ పోలీసు అధికార్లు కేసురాయడానికే ప్రాధాన్యత ఇస్తారు.కోర్టులోనే తేల్చుకొమ్మని పదేపదే చెబుతారు.కానీ ఇరువర్గాలు గట్టిగా బ్రతిమాలడం వల్ల తప్పనిసరై దాదాపు రహస్యంగా సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఆ పోలీసు అధికారి వల్ల భవిష్యత్తులో మేలే జరుగుతుందనే భరోసా ఇరుపక్షాల వాళ్ళకుంటుంది. వీరు డబ్బుగలవారియెడల అభిమానంతోమెలగుతారు. చట్టాలు అడ్డమైనా శత్రువును తుదముట్టించడానికి ఋజుమార్గాన్నైనావీడుతారు.

ఇక రెండవది పెద్దమనుషుల తీర్పులు. ఈ పెద్దమనుషులంటే మరెవరోకాదు. ప్రజాప్రతినిధులే.వీళ్ళనే మాఫియాలని అనాలి.వీళ్ళు  నా నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం నాబాధ్యత అని భావించేవాళ్ళు. వీళ్ళు అన్నిరకాల తగాదాలు తీరుస్తారు. ప్రభుత్వంనుండి కావలసిన ప్రయాజనాలు తమ వారికి ఇప్పిస్తారు. అంటే అధికారులకు లంచాలు ఇప్పించడం ద్వారా , పనులు చేయించుతారు. హత్యలు, మానభంగాలు, బెదిరింపులు వంటి పనులు వీరు చెయ్యరు. వీరివలన భవిష్యత్తులో తమకు ఏదోవిధంగా మేలు జరుగుతుందని బలంగా నమ్ముతారు ప్రజలు. వీరికి ప్రజాబలం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ మాన్ చిత్రంలో సూర్య దీనికి ఉదాహరణ. లైక్ మైండెడ్ పీపుల్ తో పార్టీని నిర్మిస్తాడు. ఆ పార్టీని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తాడు. అన్ని పార్టీలవలే పార్టీఫండు వసూలు చేయిస్తాడు. డబ్బుతో ఎన్నికలలో అధికారాన్ని సాధిస్తాడు. అతనంటే పోలీసులు భయపడరు, ప్రజలు భయపడరు. కానీ రాజకీయనాయకులు భయపడతారు. కనుక అధికారాన్ని సాధించిన రాజకీయ నాయకుడు రెండవ రకం మాఫియా.

ఇక మూడవ వర్గం వారు ప్రాక్షనిష్టులు . వీరు కూడా రాజకీయపార్టీకి చెందినవారే కానీ ఓడిపోయినవారు. అధికారంలో లేనివారు. వీరికి పోలీసు మాఫియా సపోర్టు ఉండదు. అధికారంకోసం, అవకాశంకోసం ఎదురు చూస్తుంటారు. అధికారం లేకపోయినా తమకంటూ కొంత ప్రజాబలం కలిగివుంటారు.  ఏదో ఒక ప్రాంతప్రజలను తాము కాపాడుతామని చెబుతుంటారు. ప్రజలలో చీలికలు తెస్తారు. అస్మదీయులు, తస్మదీయులని వారికి పేర్లు పెడతారు. అధికారంలో ఉన్న రాజకీయపార్టీని తప్పుపడుతుంటారు. వాళ్ళు చేసే పనులకు వంకలు పెడుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీవారు ఎంతమంచి పని చేసినా దానిని మంచి అని మెచ్చరు. పెదవి విరుస్తారు, అబ్బే అంటూ చప్పరిస్తారు. మేము అధికారంలోకి వచ్చి చేస్తామంటారు.  నిరంతరం ప్రజలమద్య తగాదాలు పెడుతుంటారు. ప్రజలను, అధికారులను, వ్యాపారులను బెదిరిస్తారు. చందా ఇవ్వమని హెచ్చరిస్తారు. వీరినే రాజకీయ పార్టీలంటారు. కాంగ్రెస్, కమినిష్టు, బిజేపి, లోకల్ పార్టీ అంటూ రకరకాల పేర్లతో ప్రజలకోసం పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంటారు.మహాసభలు పెడుతున్నామని, వరదబాధితులకు చందాలని, ఉత్సవాలు చేస్తున్నామనీ చందాలిమ్మంటారు. ప్రతి పార్టీవాడికీ వ్యాపారులు, సంస్థలు మొఖాన చిరునవ్వు పులుముకొని చందాలివ్వాల్సిందే. భవిష్యత్తులో వీరివల్ల ఏఅపాయం వస్తుందోనని ప్రజలు తప్పనిసరిగా ఏదో ఒక పార్టీని ఆశ్రయించుకొని ఉండాల్సుంటుంది.
ఇక ఈ రాజకీయ పార్టీల అండదండలతో ప్రత్యర్ధులను బెదరగొట్టే స్కీం క్రింద రహస్యంగా ఫోను ద్వారా బెదిరించి, చంపుతామని భయపెట్టి, డబ్బువసూలు చేసుకునేవాళ్లని రౌడీలనవచ్చు. వీరినే మాఫియా అనుకుంటున్నారు చాల మంది. వీరు కేవలం రౌడీలే. వీరు ప్రాక్షన్ వర్గంలోని ఛోటా నాయకులు, లేదా రింగులీడర్లు. వీరి కార్యకలాపాలు రహస్యంగా ఉంటాయి. వీరికి గాడ్ ఫాదర్లుంటారు. ఏదైనా తేడా వచ్చినప్పుడు వీరి గాడ్ ఫాదర్లే వీళ్ళని రక్షిస్తారు. అవసరమైతే కొరియర్ ద్వారా సందేశాలు పంపుతారు.  భయపెడితే దడుస్తారనుకున్నవారినే వీరు ఎంచుకుంటారు. ప్రాక్షన్ పార్టీలద్వారా, మాఫియాల ద్వారా వీరని ఎదుర్కోవచ్చు.
కాబట్టి దొంగలు, రౌడీలు మాఫియాలు కాదని గమనించాలి. బిజినెస్ మాన్ సినిమాలో మాఫియాను స్ఫష్టంగా చూపలేకపోవడం ఒక లోపంగా భావించాలి. బిజినెస్ మాన్ టులోనైనా ఆలోటును పూరీ పూరిస్తాడని ఆశిద్దాం.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||