కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..

Jul 24, 2015


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..
దేవసేన అనే సుందరిని గురించి భల్లాలదేవునికి వాని అనుచరుల వలన తెలుస్తుంది. ఆమెను మారు వేషంలో వెళ్ళి చూసి తానుకూడా మనసు పడతాడు. తన తండ్రి బిజ్జల దేవునికి తన ప్రేమ గురించి చెబుతాడు. దేవసేన ఒక పుర ప్రముఖుని కుమార్తె అని తెలుసుకొని ఆమె తండ్రికి కబురు పంపి రాజభవనానికి పిలిపించి తన కుమారుడైన భల్లాలదేవునికి ఆయన కుమార్తె అయిన దేవసేనకు వివాహం జరుపుదామని ఆమె తండ్రి ని అడుగుతాడు. తాను కూడా దేవసేనను చూడాలనుకుంటున్నానని ఆమె తండ్రికి చెప్పి పల్లకీ పంపిస్తాడు. దేవసేన విషయం శివగామినికి ఆమె భర్త బిజ్జలదేవుడు చెబుతాడు. పనిలో పనిగా బాహుబలికి కూడా మంచి సంబంధం చూసి ఇద్దరి వివాహాలూ ఘనంగా చేయాలనుకుంటారు. పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని మహాబలితో చెబుతుంది.

పల్లకీ దిగి వచ్చిన దేవసేనను చూసి శివగామిని చాలా ఆనందిస్తుంది. అదే సమయంలో మహాబలి శివగామిని వద్దకు వస్తాడు. దేవసేన, మహాబలి ఒకరినొకరు చూసుకుంటారు. తొలిచూపులోనే వారు ప్రేమలో పడతారు. రహస్యంగా వారు కలుసుకుంటుంటారు. ఒక మంచి సంబంధం కుదిరిందని శివగామిని మహాబలితో చెబుతుంది.   
మహాబలి ఆ సంబంధం దేవసేనదే అనుకుంటాడు. దేవసేన కూడా తాను పెండ్లాడబోయే వరుడు మహాబలి అనుకుంటుంది. తీరా తాంబూలాలు పుచ్చుకునే రోజున విషయం బయటపడుతుంది.  
మహాబలి తన ప్రేమ విషయం శివగామినితో చెబుతాడు. మహాబలీ, భళ్ళాలదేవూడూ ఇద్దరూ దేవసేననే చేసుకుంటామని చెబుతారు. దేవసేన తాను మహాబలినే పెండ్లాడతానని చెబుతుంది. తన కుమార్తెను మహాబలికి బదులుగా భల్లాలదేవునికి ఇచ్చి వివాహం చేద్దామని శివగామిని చేసిన ప్రతిపాదనను రాజు వీరవసంతుడు నిరాకరిస్తాడు. మాయుష్మతీ సింహాసనానికి తన కుమార్తె రాణి కావసియుండగా ఒక సేనానికి తన కుమార్తెను ఎలా ఇస్తామని రాజసేన తండ్రి నిరాకరిస్తాడు.  రాజ్యం కావాలంటే దేవసేనని ఒదులుకోవాలని బిజ్జలదేవుడు షరతు విధిస్తాడు. తన ప్రేమ కోసం రాజ్యాన్ని విడిచిపెట్టడానికి మహాబలి అంగీకరిస్తాడు. వారి వివాహం జరుగుతుంది. భళ్ళాలదేవుడు రాజౌతాడు. మహాబలికి కొడుకు పుట్టాడని తెలిసి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని చంపాలని భల్లాలదేవుడు కుట్ర పన్నుతాడు.
శివగామిని తన రహస్య అనుచరులద్వారా భల్లాలదేవుని కుట్రలను పసిగడుతూ ఉంటుంది. వందమంది మెరికెలవంటి సైనికులను కోటలోని రహస్యద్వారం గుండా జలపాతపు ఏనిగకొండలోని గుహలలో రహస్యంగా ఉంచుతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తన సంకేతం అందుకొని రహస్యద్వారం ద్వారా కోటలోనికి వచ్చి మహాబలిని రక్షించాలని ఆంతరంగిక నాయకునికి చెప్పి తగు ఏర్పాట్లు చేసి ఉంచుతుంది.
రాజ్యంలో దొంగలభయం ఉంటుందని ప్రచారం జరుగుతుంది.  ఒకరోజు రాత్రి భళ్ళాలదేవుడు మహాబలిని పిలిచి రాజ్యానికి ఉత్తర దిక్కున గల తోపులో దొంగలు దాగి ఉన్నట్లు సమాచారం వచ్చిందని రహస్యంగా వెళ్ళి వాళ్ళని బంధించి తేవాలని ఆదేశిస్తాడు. మహబలి తన ముఖ్య అనుచరులతో దొంగల వేటకు వెళతాడు. దొంగల గుంపు లాగా భళ్లాలదేవుడు తన అనుచరులతో వచ్చి మహాబలిని ఎదిరిస్తాడు . ఆ పోరులో మహాబలి భళ్ళాల దేవుడ్ని చంపబోగా సేనాని కట్టప్ప వెనుకగా మహాబలిని కత్తితో పొడుస్తాడు. భళ్ళాల దేవుడు కూడా మహాబలిని పొడిచి చంపేస్తాడు. మహాబలి కుమారుణ్ణి కూడా చంపాలని వచ్చిన వారికి మహాబలి కుమారుడు కనిపించడు.   
అప్పటికే శివగామిని ఆ బాలుడ్ని తీసుకుని రహస్యద్వారం గుండా ఏనిగకొండవైపు పారిపోతుంది. రహస్యద్వారం తెరిచివుండడం చూసి కొందరు సైనికులు మహాబలి కుమారుణ్ణి వెదుకుతూ ఏనిగ కొండవైపు వెళ్ళి వెదుకుతారు. అక్కడ ఉన్న రహస్య సైనికులు వారిని చంపేస్తారు. మహాబలి కుమారుణ్ణి గొప్పగా పెంచమని సైగచేసి శివగామిని తనువు చాలిస్తుంది. భల్లాలదేవుడు దేవసేనను సంకెళ్ళతో బంధించి రహదారిలో నిర్బంధిస్తాడు. తన తల్లి శివగామిని మహాబలి కుమారుడ్ని ఎక్కడో రహస్యంగా పెంచుతుందని భావించి వారికోసం వెదుకుతూ ఉంటాడు. దేవసేన కూడా తన కుమారుడు వచ్చి తనని విడిపిస్తాడని ఆశతో ఎదురు చూస్తూఉంటుంది.     



Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||