ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి భారతదేశంలో విద్యాహక్కు చట్టం అమలులోనికి వచ్చింది. దీని గురించి అంటే 3-5 మధ్య గల ప్రీ ప్రైమరీ స్థాయి లోని బాలబాలికలకు పౌష్టికాహారం లభించే అవకాశం పోతున్నందుకు, 9వ తరగతి నుండి ఇంటర్ వరకూ గల ఉచిత విద్యా అనేస్కీము రద్దు అవుతున్నందులకూ దాదాపు ఆందరు ఉపాధ్యాయులు తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఆరవ సంవత్సరం నుండి పదమూడవ సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు మాత్రమే ఈ హక్కు కల్పించబడిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. దీని పేరు లో హక్కు అనే శబ్దాలు ఉన్నప్పటికీ ఇది హక్కుకాదు. ఎందుకంటే హక్కు అంటే కావాలనడానికీ వద్దనడానికీ అవకాశం ఉండాలి. 8-13 సంవత్సరాల మద్య వయసు గల వారు చదువుకుంటాను అనే హక్కుమాత్రమే ఉంది కానీ చదువుకోను అనేహక్కులేదు. దీనికి మరో వచిత్రమైన పేరు నిర్బంధవిద్యాహక్కు అని. పై పటంలో చూపిన చిత్తు కాగితాలు ఏరుకునే బాలబాలికలు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీం క్రింద పనిచేసుకుంటున్నారు. ఇకనుండి వీరు స్కూలుకు వెళ్ళి చదువుకోవాలట. వారికి స్కూలుకు వెళ్ళడం ఇష్టము లేకపోయినట్లయితే వారిని మనం స్కూలుకు రమ్మన్నా రారు. దూరంగా పారిపోతారు.
కనుక ఇప్పుడు చిదంబరం గారు ఏం చెయ్యాలి... జూనియర్ గ్రే హౌండ్స్ దళాల్ని ఏర్పాటు చెయ్యాలి. కనీసం ఇదన్నా వాళ్ళవల్ల అవుతుందా...నాకుడౌటే
.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !