గోవాలో రేపు 47వ అన్నిదేశాల సినిమాల పండగ 2016

Nov 19, 2016




47వ అన్నిదేశాల సినిమాల పండగ 2016 సినిమా కథలు వ్రాసేవాళ్ళకు నిజమైన పండగని ఈ పండగ నడిపే శంతిల రాజన్న గారు అన్నారు. ఇందులో మొదటిసారిగా లేజర్ ప్రొజక్టరును వాడబోతున్నారు. ఈ పండగలో 90 దేశాలకు చెందిన 300 సినిమాలు చూపించబోతున్నారు. కొరియా దేశపు సినీ నిర్మాత ఇమ్ కౌన్ టేక్ గారికి జీవితలక్ష్యసాధన అవార్డును బహూకరించబోతున్నారు. వందేళ్ళ భారతీయ సినిమా జీవి-2016 అవార్డును పాటగాడు శ్రీ యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వబోతున్నారు.


47వ అన్నిదేశాల సినిమా పండగ 2016 రేపు అనగా నవంబరు 20వ తేదీ నుండి నవంబరు 28వ తేదీ వరకు గోవాలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా షోలే సినిమా నిర్మాత శ్రీ రమేష్ సిప్పీ, నటుడు శ్రీ సుశాంత్ సింగు రాజపుట్ గారు, శ్రీ ప్రొసెన్జిత్ , శ్రీ గౌతం ఘోష్ గార్లు హాజరౌతారు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||