ఇప్పటికి 427 కోట్ల 2 వేల రూపాయల కాగితాలు అచ్చువేసిన ఆర్బియై

Dec 12, 2016



 రిజర్వు బాంకు 2016 నవంబరు 10వ తేదీనుండి 2016 డిసెంబరు 7వ తేదీ వరకూ 4,27,684 కోట్ల రూపాయలను అనగా 427 కోట్ల 2వేల రూపాయల నోట్లను ముద్రించి బాంకు కౌంటర్ల ద్వారా, ఏటియమ్ముల ద్వారా ప్రజలకు అందించానని ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రతి మనిషికి రోజుకు ఒక 2వేల నోటు గానీ, వారానికి 5 రెండువేల నోట్లుగానీ తీసుకోవచ్చునని ప్రకటించింది కానీ బ్లాక్ మార్కెట్ దార్లకు ఎక్కువ మొత్తంలో 2వేల నోట్లు చేరినందుకు గాను పాలకులు సిగ్గు పడుతున్నట్లు కనిపించడం లేదు.
పది వేలకంటే అదనంగా డబ్బు కలిగి ఉన్న వారిని శిక్షించితే  పేద ప్రజలకు నోట్ల కష్టాలు తీరతాయి. రిటైల్ వ్యాపారులు తప్ప మిగిలిన వ్యాపారులంతా నగదు రహిత పద్ధతి ద్వారా లావాదేవీలు నిర్వహించాలనే నిబంధన విధించడానికి సంశయమెందుకో అర్ధం కావడం లేదు.  ఏ సీరియల్ నంబరు గల నోటు ఎవరికి ఇవ్వబడిందో నమోదుచేయడం దర్భరమైనదేంకాదు. మూడు వేలకు మించిన లావాదేవీలు నగదు రహిత పద్ధతి ద్వారా జరగాలని చెప్పగలగాలి.
ప్రభుత్వమూ, రానాలు (రాజకీయ నాయకులు) స్టేటుమెంట్లు మాత్రం ఇస్తున్నారుగానీ వ్యాపారులకు స్వైపింగు మిషన్లు అందించడం లేదు. వ్యాపారులను కలిసి వారికి నగదు రహిత లావాదేవీలను గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం లేదు. ఇంటింటికీ యాత్ర లాగా ప్రతి వ్యాపారినీ కలిసి మాట్లాడే కార్యక్రమం ప్రభుత్వం, అధికారులు చేయగలరా?
స్వచ్చ భారత్ కు అంబాసిడర్లు ఉన్నట్లుగా నగదు రహిత లావాదేవీలకూ ఏర్పరచాలి. ప్రభుత్వానికి పన్ను వచ్చేలా చూడడం దేశభక్తిలో భాగమని తెలియజెప్పాలి. ప్రస్తుతం అటువంటి దేశభక్తులు అవసరం భారత దేశానికి ఎంతో వుంది.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||