చివరి ప్రయత్నం
Dec 13, 2016
కనిపించకుండా పోయిన మలేషియా విమానాన్ని వెదకడానికి చివరి ప్రయత్నంగా డచ్చివారి ఫగ్రో ఈక్వేటర్ అనే ఓడ ఆస్ట్రేలియా నుండి సోమవారం బయలుదేరింది. 2014 లో విమానం అద్పశ్యమైనప్పటినుండి అనేక ఓడలు హిందూమహాసముద్రంలో వెదికాయి. వీరికి ఏదైనా ఆచూకి దొరకకపోతే ఇకపై వెదకులాటను ఆపెయ్యాలని అధికారులు నిర్ణయించారు.
ఆ విమానానికి చెందిన చిన్నముక్క గానీ చిన్న ఆధారం గానీ ఇప్పటివరకూ దొరకలేదు. ఆచూకీ కనుగొనగలమనే ఆశతోనే ఇప్పటికీ వెదుకుతున్నామని ఆస్ట్రేలియా రవాణా మంత్రి శ్రీ డర్రెన్ చెస్టర్ పత్రికలవారితో చెప్పారు. ఆస్ట్రేలియా చైనాలతోపాటు చాలా దేశాలు సముద్రము లోపల వెదికాయి. చివరగా లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వెదికే వనిలో ప్రస్తతమీ ఓడ ఉంది. వాతావరణం అనుకూలిస్తే అనుకున్న సమయానికి పని పూర్తి చెయ్యగలమని వారు భావిస్తున్నారు. 239మంది తో చైనానుండి కౌలాలంపూరు వెళుతూ ఆవిమానము అదృశ్యమైంది. తూర్పు ఆఫ్రికా ప్రాంతములో ఆవిమానపు అవశేషాలు అని అనుమానించబడినవి కొన్ని లభించినవి. అయితే గట్టి సాక్ష్యము ఇప్పటివరకూ కనుగొనలేకపోవడంతో వారి కుటుంబాలు అధికారులపై విసుగెత్తిపోయి ఉన్నారు.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !