వ్యాపార వర్గాలు నగదు రహిత విధానాలకు మళ్ళకపోవడానికి కారణం పన్ను ఎగవేయాలనే. ప్రతి వ్యాపారీ మొబైలు లేదా కార్డు గీకడం ద్వారా లావాదేవీలు నెరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. తక్కువ రేటులో మొబైలు ఫోనులు అందించే ప్రయత్నం చేయాలి. ప్రతి మండలములో స్కౌట్లు, యన్సీసీ సభ్యులు, తమంతటతాముగా ప్రజాసేవ చేయాలని ఆశించే యువజన సంఘాల చేత నగదు రహితం గురించి ప్రచారం చేయించాలి. ప్రతి మండలానికి, పట్టణానికి ఒకరు చొప్పున ఉత్సాహవంతుడైన యువ ప్రభుత్వోద్యోగిని అధికారికంగా నగదు రహిత కొనుగోళ్ళు చేయడానికి సహాయపడడానికి తాత్కాలిక బాధ్యతలపై నియమించాలి. వ్యాపారులు తమ వద్ద వై-ఫై ఏర్పాటు చేసుకొని, తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం ద్వారా ఫోను లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహించాలి. వ్యాపారుల క్లబ్బులకు తగు సూచనలు జారీ చేయాలి.
ప్రభుత్వ కార్యాలయాలలో పోలీసు టేషనులో అవినీతిని అరికట్టడానికి టోకెన్లు ఫోను ద్వారా పొందే పద్ధతి రూపొందిచాలి. ఆ టోకెను నంబరు ప్రకారం కార్యాలయాలలో పనులు జరగనప్పుడు వారిని సంబంధిక వృత్తినుండి దూరం పెట్టడం వంటి చర్యలు తగు ఫలితాలను ఇస్తాయి.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !