సలింగ సంయోగులకూ,కొజ్జాలకూ ప్రత్యేక బాత్రూముల నిర్వహణ విషయమై ఉత్తర కరోలినాలో రగడ

Dec 22, 2016


సభలో గంటల తరబడి జరుగుతున్న వాదప్రతివాదనలతో తలపట్టుకొని కూర్తున్న రిపబ్లికన్ సెనేటర్ నార్మన్ శాండర్సన్ 

ఉత్తర కరోలినా బాత్రూం బిల్లు బుధవారం నాడు  రెండు ముఠాలవారూ ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయినందున వెనక్కి తీసుకోవాల్సివచ్చేలావుంది. సలింగ సంయోగులూ, కొజ్జాలు మొదలైనవారికి చట్టంలో రక్షణలు తక్కువగా ఉన్నాయి.


 వ్యాపారస్తులు, కళాకారులు, ఆటగాళ్ళు తమ విధులు బహిష్కరించి ఉత్తర కరోలినాలో ఈ బిల్లు గురించి తమ నిరసనను తెలిపారు. కాని రాష్ట్ర శాసనకర్తలు మొదట అనుకున్న వాటకి అదనంగా చేర్చబడిన అంశాల విషయమై ఒక ఒప్పందానికి రాలేకపోయారు. హెచ్చిబి2 చట్టంలో సలింగ సంయోగులూ, కొజ్జాలకు ప్రత్యేక బాత్రూముల ఏర్పాటు విషయమై వారి జననధృవీకరణ పత్రములో అది నమోదై యుండాలని బిల్లులో ఉన్నది. దానిని ఆర్డినెన్సు ద్వారా సవరించాలని రిపబ్లికను సెనేటర్లు ప్రయత్నం చేశారు.  బుధవారం నాటి బిల్లులో రిపబ్లికన్లు చేర్చిన నిబంధన ప్రకారం యల్జీబీటీలకు రక్షణ పేరుతో ఏ నగరపాలక సంస్థలూ కూడా ఇటువంటి ఆర్డినెన్సులు జారీ చెయ్యరాదని పేర్కొన్నారు.

జాతీయ బాస్కెట్ బాల్ సంఘం ఆ నగరంలో ఆడాల్సిన ఆటను వేరే నగరానికి మార్చుకుంది.
బ్రూస్ స్ప్రింగుస్టీన్ వంటి వారు తమ కచేరీలను అక్కడ రద్దు చేసుకున్నారు. పేపాల్ సంస్థ 400 మంది ఉద్యోగులతో  విస్తరించాలనుకున్న వ్యాపార ప్రయత్నాన్ని విరమించుకుంది. అమెరికా న్యాయశాఖ ఈ బిల్లుపై న్యాయవిచారణకు ఆదేశించింది. 
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||