హంతకుడు అనిస్ అమ్రి
బెర్లిన్ మార్కెట్టులో ఒక ట్రక్కుతో ప్రజలను తొక్కించి 12 మంది చావుకు 49మంది గాయపడుటకు కారణమైన అనుమానితుడు అనిస్ అమ్రి మిలన్ లో పోలీసులచే కాల్చి చంపబడ్డాడు.
అనిస్ అమ్రి రైలులో ఫ్రాన్సు నుండి టురిను కు, అక్కడినుండి మరో రైలులో మిలాను కు ప్రయాణం చేశాడు. సెంట్రల్ స్టేషను నుండి నడుచుకుంటూ వస్తుండగా పోలీసులు అతని కాగితాలు చూపమని అడిగారు.
రోజువారీ జరిగే చకింగులోభాగంగా పోలీసులు గుర్తింపు కార్డులు చూపించమని అడుగుతూ ఉండగా ఏమాత్రం అనుమానం కలుగకుండా తూపాకీతో పోలిసులపై అనిస్ అమ్రి కాల్పలకు దిగాడు.
క్రిస్టియన్ మోవియో అనే ఒక పోలీసు అధికారి గాయపడ్డాడు కానీ అతని ప్రాణానికి ఏమీ ప్రమాదము లేదని తెలిసింది. తొమ్మిది నెలల క్రితం ఉద్యోగంలో చేరిన లూకా స్కాటా అనే పోలీసు వెంటనే అమ్రీ ని కాల్చిచంపాడు.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !