అచ్చువారు
|
ఒరియా భాష మాట్లాడుతూ ధాన్యాన్ని ఎద్దుల బండి మీద తోలుతూ ఉండేవారు
|
అచ్చు-వెల్లాల
|
తంజావూరు జిల్లాలోని కరైయానులు అని అనుకుంటున్నారు.
|
అడపడవ
|
కన్నడంలో కళాసి అనే ఓడ పనివారికి సమానార్ధకం. అడపం అనేది మంగలి
సంచి.
|
అడపాప
|
బలిజలలో ఉపకులం
|
అడ్డాపు-సింగ
|
మంగలి వారిని యాచించే తెలుగు కులం. దాసరి కి ఉపకులం.
|
అడిగారి
|
దక్షిణ ఆర్కోట్ లోని అగముడైయాన్లకు మరోపేరు.
|
ఆది శైవర
|
వెల్లాల ఉపకులం. వీరు శివాలయాల్లో దేవర (శైవ) కీర్తనలు గానం
చేసేవారు/ వంతపాటగాళ్ళు. వీళ్ళను ఓడువాన్ అని కూడా అంటారు.
|
ఆదియాన్
|
అంటే బానిస అని అర్ధం. దక్షణ కర్నాటక ప్రాంతపు మలబారు కొండ
ప్రాంతములో నివసించే చెరుమన్ అనే ఉపకులము నకు చెందిన వారు.
|
అదుట్టోన్
|
అంటే తోడుగా ఉండేవాడు అని. కావుటియాన్ అని కూడా అంటారు.
|
ఆఫ్ఘన్
|
ఆఫ్ఘనిస్థాన్ దేశానికి చెందిన ముస్లీము
|
ఆగముదైయన్
317,877
|
తమిళనాడు జిల్లాలలోని వ్యవసాయదారుల కులం. దక్షిణ ప్రాంతంలో వారికి
నేరస్తులనే చెడ్డ పేరు ఏర్పడింది. (కల్లన్ లో చూడండి) చెంగల్పట్టులో, ఉత్తర
ఆర్కోటులో, సేలం, కోయంబత్తూరు, తిరుచినాపల్లి లలో ఎక్కువ మంది ఉండేవారు. ఈ
సంవత్సరం (1901) వారు తమ కులస్థాయిని పెంచుకొని వెల్లాలస్ అని
పిలుచుకుంటున్నారు. మారవాన్లు , కల్లన్ల కన్నా తాము ఉన్నతులమని చెప్పుకున్నారు.
ఆచార వ్యవహారాలలో వారు వెల్లాలాస్ ను అనుసరించారు. వారి పేర్లు పిళ్ళై,
సేర్వాయిగారన్ అని పెట్టుకున్నారు.
|
ఆగరు, ఆవురు 1285
|
విశాఖపట్నం, గంజాం జిల్లాలలోని తెలుగు వ్యవసాయదారులు, మార్కెట్టు
తోటమాలులు. వీరు కూరగాయలు, తమలపాకులు అమ్ముతుంటారు.
|
అగర్వాల
|
భారతీయ ఉన్నత వ్యాపారవర్గం
|
అగస 15876
|
కన్నడ చాకలివారు
|
అగ్నికులం,
అగ్ని-క్షత్రియ, అగ్నికుల క్షత్రియ , వన్నికుల క్షత్రియ
|
అగ్ని జాతి క్షత్రియులు. వన్నియన్ లేదా పల్లి వంటి అర్ధం ఉంది.
|
అహిర్ 4
|
పశువులు, గొర్రెలు కాచుకునే ఉన్నత కులం వారు
|
అహ్మదీస్ 10
|
మహమ్మదీయులు
|
అయ్యరకం 18260
|
తెలుగు వ్యవసాయదారులు. కాపులు, బలిజలతో కలిసి వుంటారు తెలగ కులం
వారిని పెళ్ళి చేసుకుంటారు. గొల్లల చేతినీరు త్రాగుతారు. వీరిని సాధారణంగా
పాత్రుడు అని పిలుస్తారు.
|
అజమార (కిస్ట్న)
|
వక్కలిగ కు ఉపకులం.
|
అక్కసాల
|
పాంచాల ఉపకులం (కమ్మలాన్ చూడు)
|
ఆకుల
|
విశాఖపట్నం లో తమలపాకుల అమ్మకం దారులు. కాపుల ఉప కులం
|
అలన్
|
అంటే బానిస . చెరుమన్ ఉపకులం
|
అలప్పిల్లయి (మదుర)
|
మరవన్ ఉపకులం
|
అలవాన్ 1791
|
ఉప్పు పని చేసేవారు. మదుర, తిన్నెవెల్లి లోమాత్రమే ఉంటారు. వీళ్ళ
పేర్లు పన్నయియాన్, మూప్పన్. వీరికి హిందూ గుడులలో ప్రవేశం లేదు.
|
అలియ 20343
|
ఒరియా వ్యవసాయదారుల కులం
|
అల్లాయి 4
|
గుర్తింపులేదు.
|
అల్లి కులం
|
అంటే లిల్లీ తెగ. అనప్పాన్ లకు ఉపకులం
|
ఆళ్వారు
|
వెల్లువాన్ల ఉపకులం. తిరుప్పాన్ ఆళ్వారు కు చేందిన 12మంది వైష్ణవ
సన్యాసులలో ఒకరు
|
అంబలకారన్ 162471
|
తమిళ వ్యవసాయదారులు, గ్రామకాపలాదారుల కులం. ఇప్పటివరకూ ఇది
కల్లన్లకు చెందిన కులంగా భావించబడింది కానీ పరిశీలన జరుపగా ఇది తిరుచినాపల్లి
జిల్లాకు చెందిన వేరే కులంగా తేలింది. మదురాకు చెందిన కల్లాన్లు అబలకరన్ల
ఇండ్లలో తినరు. అంబలకరన్లకు, ముట్టిరియాన్లకు, ముత్రాసులకు, ఉరాలీలకూ, వేదన్లకు,
వలైయ్యాన్లకు, వెట్టువాన్లకూ మధ్య కొంత సంబంధం ఉంది. దీన్ని గురించి మరింత
పరిశీలించాల్సివుంది. వీరంతా ఒక కుటుంబం నుండి వచ్చిన వారు కావచ్చును. కాని
జనాభా లెక్కలలో వీరిని ప్రత్యేకంగా చూపిస్తున్నారు. అంబలకారన్లు తాము వేటగాళ్ళ
కులానికి చెందిన 63 శైవ సాధులులలో ఒకరైన కన్నప్ప నాయనార్ వారసులమని
చెప్పుకున్నారు. తంజావూరులో వలైయాన్లు కూడా తాము అంబలకారన్, ముట్టిరియాన్ లకు సంబంధించిన వారమని
చెప్పుకున్నారు. అంబలకారనుల కుల పెద్దను కరియకారన్ అంటారు.ప్రతి పెద్దకు ఒక
సేవకుడు ఉంటాడు వానిని కుడి-పిల్లయి అంటారు. ఈయన పని అందరికి సమాచారమును చేరవేయుట.
ఈ కులం వారు పెండ్లికి ముందే శారీరక సంబంధాలు కలిగివుంటారు. కొందరు బ్రాహ్మణులచే
పురోహితకార్యములు చేయించుకుంటారు. కొందరు జంధ్యం ధరిస్తారు. మటను, ఫోర్కు, పక్షుల
మాంసము తింటారు. సారాయి త్రాగుతారు. విధవలకు విడాకులు పొందిన వారికి వివాహం
చేస్తారు.
|
అంబలవాసి17663 | వీరు మలబార్ లో గుడి సేవకులు. వీరిలో పొడువాలు, చాక్కియార్,నంబియాసన్, పిడారన్, పిషారోడి, వారియన్, నంబి, తెయ్యంబాడి, మొదలైన వారు హిందూగుళ్ళలో పూలదండలు అల్లడం, నేల ఊడవడం, కట్టెలు తెచ్చుట, ఊరేగింపులలో విగ్రహాలు మోయుట, పాటలు పాడుట, నాట్యం చేయుట వంటి రకరకాల పనులు చేస్తారు. బ్రాహ్మణులకంటే తక్కువవారుగా భావించుతారు. వీరు నాయర్ల చేతి ఆహారం కూడా తినరు. |
అంబట్టన్ 199,965 | తమిళ మంగలి కులం |
అంబిగ |
కబ్బర ఉపకులం |
అనకల |
అరకల మాదిరిగానే. |
అనప్పన్ 17324 కప్పిలియాన్39608 |
మధుర, తిన్నెవెల్లి లలో ఉండే కన్నడ మాట్లాడే వ్యవసాయదారులు. పూర్వనివాసం మైసూరు ప్రాంతంలోని గుబ్బే/ కురవంజి నాడు.వీరిలో కప్పిలియాన్లు, అన్నపాన్లని రెండు తెగలున్నాయి.వాళ్ళ కుల పెద్దలను సామియార్లని లేదా పెరియ కవన్దన్లని అంటారు. ఆడపిల్లలు రజస్వల కాకముందుగాని అయిన తరువాతగాని పెండ్లిచేసుకుంటారు. ఒక వ్యక్తి తన సోదరి కూతురునిగానీ, అత్త కూతురునిగాని పెండ్లి చేసుకుంటాడు. కొన్నిసార్లు ఆ వరుస ప్రకారం చిన్న పిల్లవానిని పెద్ద వయసు వున్న అమ్మాయిలు పెండ్లి చేసుకోవాల్సివస్తుంది. అలాంటప్పుడు నీతి తప్పుడం జరుగుతుంది. పెళ్ళిలో వధూవరులపై కాసిని పాలు పోస్తారు. కొన్నిసార్లు పెళ్ళికొడుకు సోదరిచే పెళ్ళికూతురు మెడలో తాళి కట్టిస్తారు.విధవా వివాహాలు అనుమతిస్తారు. తన కులంలో ఎవరినైనా ఆమె పెళ్ళాడవచ్చు. సాధరణంగా ప్రాధన్యత తన మరదికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కులం లోని వారు శైవులు లేదా వైష్ణవులు. కానీ అనప్పాన్లు హిందూ దేవతాగణంలో లేని వారి పూర్వీకుల ఆత్మలైన దొడ్డరాయన్ ను, పొన్నియమ్మాను పూజస్తారు. వారు జంధ్యం ధరించరూ, బ్రాహ్మణులచే పౌరోహిత్యం చేయించరు. చనిపోయిన వారిని పూడుస్తారు లేదా కాలుస్తారు కాని రెడ్ల పద్ధతులను అనుసరిస్తారు. చనిపోయిన వ్యక్తి భార్య కాటివద్దకు వచ్చికుండతో నీళ్ళు తీసుకుని మూడుసార్లు చితి చుట్టూ తిరిగి శవం కాళ్ళవద్ద కుండను పగలగొట్టాలి. శ్రాధ్ధకర్మలు చేయరు. |
అందెరౌత్ |
కురుంబన్ ల ఉపకులం |
అండి 87545 |
తమిళ బిచ్చగాళ్ళు. మద్రాసు ప్రసిడెన్సీలో యాచన చేసే
కులాలు ఎక్కువ. బ్రాహ్మణులు ఆశ్రమాలలో ఉండి ధ్యానం చేసుకోవడం గౌరవప్రదమైన వృత్తిగా
భావించబండింది. ప్రతి బ్రాహ్మణుడూ తాను యువకుడూ ఉన్నప్పుడు యాచన చేసి తెచ్చి
గురువుకి ఇచ్చి మిగిలినది తాను తినాలని కట్టడిచేసేవారు.మొదట జైనులూ బౌద్ధులూ
అదేవిధంగా చేశారు. యాచక కులాలు తమిళ జిల్లాలలో 79 ఉండగా తెలుగు జిల్లాలలో అంతకు
రెట్టింపు కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇండియాలో మతమూ దాతృత్వమూ చేతిలో చేయి వేసుకొని
నడుస్తుంటాయి. అందుకే ఇతర కులాలవారు కూడా యాచనను వృత్తిగా స్వీకరించి బ్రతకడానికి
సిధ్ధపడుతున్నారు.
పండారం :- తమిళ యాచకుల్లో పండారములు ఉన్నతులు. వీరు మాంసం తింటారు మద్యం త్రాగుతారు వారిలో విధవలకు పెళ్ళిళ్ళ ఒప్పుకోరు. వీరిలో కొందరు జంధ్యం ధరిస్తారు. ఎవరైనా చనిపోతే బ్రాహ్మణేతరకులవలే కర్మకాండలు నిర్వహిస్తారు. పాల్ని లోని సుబ్రహ్మణ్యస్వామి గుడికి ఎవరైనా మొక్కుకుంటే తిన్నెవల్లిలోని ఇతరులు కావడిలో మొక్కుబడి సరుకులు కట్టుకుని తీసుకుపోతారు. ఉత్సవాలలో పసుపు గుడ్డలు కట్టుకుంటారు. వీరిలో కొందరు ఉన్నతులుగా పూజారులుగా వ్యవహరిస్తుంటే అనేకులు సాధారణ యాచకులుగా మిగిలిపోయారు. |
Castes in Andhra Pradesh
Jan 5, 2017
Labels:
History
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !