నవ్వులు

Aug 13, 2008

సుబ్బారావు : నమస్తే మాస్టారూ ! రేపు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మీ దంపతులిద్దరికీ సన్మానం చేద్దామనుకుంటున్నామండీ. మీరు కాదనగూడదుమరి.
మాస్టారు : మాకు సన్మానమా? ఎందుకండీ?
సుబ్బారావు : మరి మన అపార్టుమెంటులో ఎప్పుడూ ఆనందంగా , అన్యోన్యంగా ,ఆదర్శంగా ఉండేది మీరే. మీరూ, మీయావిడా ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారుగదా .అందుకని.
మాస్టారు : నవ్వుకోవడవా! మరేంలేదండీ, మాయావిడ నాపైకి గ్లాసులూ, గంటెలూ విసురుతూంటుంది. అవి నాకూ తగలలేదనుకోండి – అప్పుడు నేను నవ్వుతాను , తగిలిందనుకోండి మాయావిడ నవ్వుతుంది. అంతే.
సుబ్బారావు : ఆఁ...........

మిస్టేక్

Aug 8, 2008

మాస్టారు ఓరొజు పెందలకడనే నిద్రలేచి భార్యను కూడా లేపాడు.ఆమె నిద్ర లేస్తూనే అలవాటుగా భర్త కాళ్ళకు నమస్కారం చేసి తర్వాత బాత్ రూంకు వెళ్ళింది. అది చూసిన మాస్టారికి తన భార్య వెనకటి కాలం అలవాట్లను మార్చి ఆధునిక స్త్రీనిగా చెయ్యాలనీ , ఆమెకు ఙ్ఞానాన్ని బోధించాలని అనుకున్నాడు. ఆమె రాంగాన్నే ఇలా అడిగాడు.
మాస్టారు: " ఏం కమలా ! నువ్వు ఏం తప్పు చేసావని నాకాళ్ళు పట్టుకున్నావ్?"
కమల : " మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నానుగదండీ. అందుకని "
మాస్టారు : ???
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||